AP Govt: వర్రా రవీందర్ రెడ్డి ఎపిసోడ్.. కడప ఎస్పీపై సర్కార్ చర్యలు
ABN, Publish Date - Nov 06 , 2024 | 04:44 PM
Andhrapradesh: వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డి ఎపిసోడ్‌కు సంబంధించి ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంలో కడప ఎస్పీపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కడప ఎస్పీపై చర్యలకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం.
కడప, నవంబర్ 6: కూటమి నేతలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఏపీ కేబినెట్‌లో (AP Cabinet) కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కడప ఎస్పీపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), మంత్రి లోకేష్ (Minister Lokesh), హోంమంత్రి అనిత (Home Minister Anitha) సీరియస్ అయినట్లు సమాచారం. గత రాత్రి అదుపులోకి తీసుకున్న వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్‌రెడ్డి కడప పోలీసుల అదుపులో లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
AP Cabinet: ఎస్పీలపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్.. ఫోన్ చేస్తే రియాక్ట్ కావడం లేదు..
అసలేం జరిగిందంటే..
వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డిని రాత్రి పులివెందులలో చిన్నచౌకు పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తీసుకొచ్చారు. కడప తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఉంచగా.. 41ఏ నోటీసు ఇచ్చి పోలీసులు పంపించి వేసినట్లు సమాచారం. రవీంద్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్న విషయం తెలుసుకున్న అన్నమయ్య జిల్లా రాజంపేట పోలీసులు కడపకు వచ్చారు. ఓ కేసులో రవీందర్ రెడ్డిని తీసుకెళ్ళేందుకు అక్కడికి రాగా... 41ఏ నోటీసు ఇచ్చి అతడిని పంపినట్లు తాలూకా పోలీసులు చెప్పారు. దీంతో వెంటనే రవీందర్ రెడ్డి కోసం రాజంపేట పోలీసులు బయటకు వచ్చి గాలించగా అప్పటికే అతడు పరారైనట్లు తెలుస్తోంది. రవీందర్ రెడ్డి స్నేహితుడు మహేశ్వరెడ్డిని కూడా రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహేశ్వరెడ్డి వేముల వద్ద తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అతడికి కొట్టి వాహనంలో ఎక్కించుకున్నారు. అయితే వర్రారవీందర్ రెడ్డిని తప్పించిన ఎపిసోడ్ మొత్తం ఎంపీ అవినా ష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ కావడంతో హుటా హుటిన కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కడపకు చేరుకున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో సమావేశమై రవీందర్ రెడ్డి గురించి డీఐజీ ఆరా తీస్తున్నారు.
కడప ఎస్పీపై చర్యలు
మరోవైపు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును బాధ్యుడిని చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కడప ఎస్పీని బదిలీ చేసిన సర్కార్.. మరికొద్ది సేపటిల్లో అధికారిక ఉత్తర్వులను వెలువడించే అవకాశం ఉంది. కడప జిల్లాలో మరో సీఐను కూడా సర్కార్ సస్పెండ్ చేసింది. వైసీపీ నేత వర్రా రవీంద్ర రెడ్డిని అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతి పీఏగా రవీంద్రారెడ్డి ఉన్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. రవీంద్రారెడ్డి పోస్టులపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఏపీ కేబినెట్‌లో సీఎం దృష్టికి మంత్రులు తీసుకెళ్లారు. ఈ క్రమంలో కడప ఎస్పీని బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి...
Aghori: పిఠాపురంలో మహిళా అఘోరి కలకలం..
Purandeshwari: కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌లో పురందేశ్వరి ప్రస్తావించిన అంశాలివే
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 06 , 2024 | 04:55 PM