ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌ జన్మదిన వేడుకలు

ABN, Publish Date - Sep 02 , 2024 | 11:22 PM

రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవనకళ్యాణ్‌ జన్మదిన వేడుకలను సోమవారం పలు ప్రాం తాల్లో ఘనంగా నిర్వహించారు.

కడపలో కేక్‌ కట్‌ చేస్తున్న జనసేన కడప అసెంబ్లీ ఇనచార్జ్‌ సుంకర శ్రీనివాస్‌

పోరాట యోధుడు పవనకళ్యాణ్‌ : సుంకర

కడప(ఎర్రముక్కపల్లె)/కడప మారుతీనగర్‌, సెప్టెంబరు 2 : రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవనకళ్యాణ్‌ జన్మదిన వేడుకలను సోమవారం పలు ప్రాం తాల్లో ఘనంగా నిర్వహించారు. కడప నగరం జనసేన పార్టీ కార్యాలయంలో రెడ్‌క్రాస్‌, బ్లడ్‌బ్యాంకు ఆధ్వర్యంలో పవన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గారక్తదాన శిబిరం నిర్వహించారు. జనసేన జిల్లా కో ఆర్డినేటర్‌, కడప అసెంబ్లీ ఇనచార్జ్‌ సుంకర శ్రీనివాస్‌, మరో 47 మం ది జనసేన నాయకులు రక్తదానం చేశారు. బైకు ర్యాలీగా వెళ్లి ఆర్టీసీ బస్టాండు కూడలిలో అంబేడ్కర్‌ సర్కిల్‌లో భారీ కేక్‌ కట్‌ చేశారు. అనంతరం దేవునికడప వెంకటేశ్వరస్వామిసన్నిధిలో 101 కొబ్బరికాయలను కొట్టి మొక్కులు తీర్చారు. అలాగే 101 మొక్కలను నాటారు. జిల్లా ప్రచార కమిటీ కో ఆర్డినేటరు పత్తివిశ్వనాథ్‌, నగర కమిటీ అధ్యక్షుడు బోరెడ్డి నాగేంద్ర, జనసేన సీనియర్‌ నాయకులు మాలే శివ, జీవీ రమణ, సాయిస్వరూప్‌, భగత, శేషు, ఫరూక్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి ప్రేమికుడు పవనకళ్యాణ్‌

ప్రకృతి ప్రేమికుడు డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్‌ అని జనసేన కడప అసెంబ్లీ ఇనచార్జ్‌ సుంకర శ్రీనివాస్‌ కొనియాడారు. జనసేన నాయకులు జి.వి. రమణ, మాలే శివ ఆధ్వర్యం లో గోకుల్‌ సెంటర్‌ రోడ్లపై క్లీన ఆంధ్ర, గ్రీన ఆంధ్ర పేరుతో క్లీన అండ్‌ గ్రీన కార్యక్రమం నిర్వహించారు. బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

పేదల మనిషి పవన కళ్యాణ్‌

జనసేన నేత తుంగా రమణయ్య

కడప (ఎడ్యుకేషన), సెప్టెంబరు 2:పేదల మనిషి డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌ అని జనసేన జిల్లా నాయకుడు తుంగా రమణయ్య కొనియాడారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన కళ్యాణ్‌ జన్మదినం సందర్భంగా కడప నగరంలో తుంగా రమణయ్య ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దేవుని కడపలో పూజలు నిర్వహించి పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం విశ్వప్రగతి ఛిట్‌ఫండ్స్‌ కార్యాయలంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప నగరంలో గల 50 డివిజన్ల పార్టీ కార్యకర్తలు, జనసైనికులతో కేక్‌ కట్‌ చేయించి సంబరాలు జరుపుకున్నట్లు తెలిపారు.

Updated Date - Sep 02 , 2024 | 11:22 PM

Advertising
Advertising