ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Jagan: జగన్ రెడ్డి బస్సు యాత్రపై వైసీపీ నేతల్లో ఆందోళన...

ABN, Publish Date - Mar 27 , 2024 | 10:35 AM

కడప జిల్లా: వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రపై ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. ‘మేము సిద్ధం అంటే మీరు దేనికి సిద్దం?’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నా రని నేతలు ఆందోళన చెందుతున్నారు.

కడప జిల్లా: వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) బస్సు యాత్ర (Bus Yatra)పై ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. ‘మేము సిద్ధం (Siddam) అంటే మీరు దేనికి సిద్దం?’ అని ప్రజలు (People) ప్రశ్నిస్తున్నా రని నేతలు ఆందోళన చెందుతున్నారు. అవినీతి అక్రమాలు, ధౌర్జన్యాలు భూకబ్జా, ఇసుక మాఫియాలు ఇలాంటి వాటికి వైసీపీ సిద్ధం అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా సీఎం జగన్ బుధవారం మేము సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఇడుపులపాయలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ (YSR Ghat) వద్ద ప్రత్యే క ప్రార్ధనలు చేసి బస్సు యాత్ర ప్రారంభిస్తారు. ఇడుపులపాయ నుండి రోడ్ షో (Road Show) నిర్వహించి.. ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో రెండో విడత ప్రచారం కోసం సీఎం, వైసీపీ అధినేత జగన్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ‘సిద్ధం’ పేరుతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. రెండో విడత ‘మేమంతా సిద్ధం’ పేరుతో బుధవారం నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటకు ఇడుపులపాయలోని వైఎస్సాఆర్ ఘాట్‌కు సీఎం జగన్ చేరుకోనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించి మధ్యాహ్నం 1.30 గంటలకి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో జగన్ పాల్గొననున్నారు.

ఈ యాత్రలో భాగంగా ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి (కమలాపురం),, గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పొట్లదుర్తి, మీదుగా జగన్ బస్సు యాత్రలో భాగంగా ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకి ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డు వరకు బస్సు యాత్ర సాగనున్నది. ఎలాంటి గ్యాప్ లేకుండా 21 రోజులు పాటు ఇచ్చాపురం వరకు సీఎం జగన్ బస్సు యాత్ర సాగనున్నది.

Updated Date - Mar 27 , 2024 | 12:00 PM

Advertising
Advertising