అవినీతి అనకొండ
ABN, Publish Date - Sep 01 , 2024 | 12:07 AM
వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఒక హక్కుగా మారింది. దీంతో కొందరు ఉద్యోగులుస్కాంలు కబ్జాలతో పాటు ఏకంగానేర సామ్రాజ్యమే నడిపారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసీపీని ఛీకొట్టి చంద్రబాబు నేతృత్వంలోని కూటమిని అధికారంలోకి తెచ్చారు.
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో.. రూ.కోట్ల దందా
టౌన్ ప్లానంగ్‌లో ఏకఛత్రాధిపత్యంగా దోపిడీ
గతంలో ఏసీబీకి దొరికినా మారని తీరు
సిబ్బందిని సైతం టార్చర్ పెట్టిన సైకో
అడ్డగోలుగా బిల్డింగ్ అనుమతులు
వైసీపీ అండతో చక్రం తిప్పిన వైనం
కూటమి ప్రభుత్వంలోనైనా వేటు పడేనా
ప్రొద్దుటూరు, ఆగస్టు 31: వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఒక హక్కుగా మారింది. దీంతో కొందరు ఉద్యోగులుస్కాంలు కబ్జాలతో పాటు ఏకంగానేర సామ్రాజ్యమే నడిపారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసీపీని ఛీకొట్టి చంద్రబాబు నేతృత్వంలోని కూటమిని అధికారంలోకి తెచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఒక అనకొండ మాత్రం ఎలాంటి జంకుగొంకు లేకుండా నిరాటంకంగా తన అవినీతి దందాను కొనసాగిస్తున్నాడు. టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో తన కింది స్థాయి అధికారులనుపనిచేయనీయకుండా అందరినీ తన సైకో విధానంతో తరిమేసి ఏకఛత్రాధిపత్యంగా ఐదేళ్లుగా చక్రం తిప్పుతున్నాడు. టౌన్ ప్లానింగ్ సెక్షన్‌ను అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా..ప్రొద్దుటూరును అక్రమ కట్టడాలకు నిలయంగా మార్చివేశాడు.
ఏసీబీకి దొరికినా మారని తీరు
ఈ అవినీతి అధికారి గతంలో నెల్లూరులో ఏపీబీకి దొరికాడు. ఆ కేసు నుంచి ఇంకా పూర్తిగా బయట పడలేదు. అసిస్టెంట్ సిటీ ప్లానర్‌గా ఉన్న ఇతనికి తిరిగి నాన్‌ఫోకల్ కింద ఆర్డర్ ఇచ్చారు. దీంతో ప్రొద్దుటూరుకు 2018లో ఏసీపీ ట్రాన్ప్‌పోర్టు ప్లానర్‌గా వచ్చాడు. వచ్చినప్పటి నుంచి అప్పటి మరో ఏసీపీ, టీపీవో, టీపీఎస్‌లతో ఎప్పుడూ వాగ్వాదం చేస్తూ ఉండేవాడు. 2021 జూన్‌లో ఇతన్ని భరించలేక పంపించి వేశారు. అతనుచిత్తూరు వెళ్లిపోయాడు. ఏడాది తిరగకముందే 2022 జూన్‌లో ఏసీపీగా వచ్చాడు.తన తోటి మహిళా ఏసీపీని మహిళా టీపీవోను వేధించాడు. వైసీపీ నాయకుల అండతో ఏకంగా మహిళా ఏసీపీని డమ్మీ చేసి మొత్తం అన్ని వార్డులు తనకు కేటాయించుకుని ఫోకల్ విధులు నిర్వహించాడు. వారిద్దరు ఇతన్ని వేధింపులు భరించలేక ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లి పోయారు. అప్పటి నుంచి దాదాపు 500 పైగా అక్రమ కట్టడాలకు తన హయాంలో అనుమతులు ఇచ్చాడు. ఇందులో 400 అక్రమ కట్టడాలు కాగా 150 ప్లానుకు విరుద్ధంగా కట్టారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో అప్పటి కమిషనర్ రాధకు, వైసీపీ ఎమ్మెల్యేకు భారీగా ఆదాయం సమకూర్చి పెట్టాడని ఆరోపణలున్నాయి. అందుకే అతను మహిళా ఏసీపీ, టీపీవోలను వేధింపులకు గురిచేసినా పట్టించుకోకుండా ఆదాయమే పరమావధిగా ప్రొత్సహించటంతో.. అతడు అవినీతి అనకొండగా తయారయ్యాడని చెబుతారు.
నోటీసులు తప్ప చర్యలు శూన్యం
అక్రమ కట్టడాలపై పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు, కౌన్సిల్లో వైసీపీ కౌన్సిలర్లే అక్రమ కట్టడాలపై ఆరోపించినప్పుడు మాత్రమే ఆ కట్టడాలకు కంటి తుడుపు చర్యగా నోటీసులు ఇచ్చి మమ అనిపిస్తాడు. దీంతో ప్రొద్దుటూరులో అక్రమ కట్టడాలపై స్వయంగా వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లే కౌన్సిల్లో ఆ ఏసీపీపై అనేకమార్లు ఆరోపించారు. అతని అవినీతి గురించి బహిరంగంగా వెల్లడించినా ఏ మాత్రం జంకకుండా తను అనుకున్నదే చేసుకుంటూ వచ్చాడు. వైసీపీ చైర్‌పర్సన్, కౌన్సిలర్లకు అతను ఫోన్ కూడా ఎత్తడని అనేకసార్లు ఆరోపించారు. కేవలం వైసీపీ ఎమ్మెల్యేకు, ఆయన బావమరిదికి మాత్రమే అతను జవాబుదారిగా ఉండేవాడని, కనీసం కమిషనర్ కూడా అతనిపై చర్యలు తీసుకోలేని దుస్థితిలో ఉండేవారని అంటారు.
వైసీపీ అండతో చక్రంతిప్పిన వైనం
వైసీపీఐదేళ్ల కాలంలో నాలుగేళ్లు అతని అవినీతి దందా సాగింది. అక్రమ కట్టడాల దందాలో కోట్ల రూపాయలు కూడగట్టాడని ఆరోపణలున్నాయి. ప్రొద్దుటూరులోనే రెండు ఇళ్లు సైతం కొనుగోలు చేశాడని కార్యాలయ వర్గాలే చెబుతున్నాయి. టౌన్‌ప్లానింగ్ సెక్షన్‌లో ఔట్ సోర్సింగ్ కింద పనిచేసే ఐదుగురు బిల్డింగ్ ఇనస్పెక్టర్లను వేరే సెక్షన్‌లకు పంపించి వేశాడు. కేవలం ఒకే ఒక్కడిని మాత్రం తన అనుచరుడిగా పెట్టుకుని అతని ద్వారానే పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అతని అసిస్టెంట్‌గా ఉన్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి జీతం రూ.15,000. ఇతనే రూ.కోటికి పైగా అక్రమంగా సంపాదించి ఉంటాడని, లక్షలు వెచ్చించి సొంత ఇల్లు కడుతున్నాడని కార్యాలయ వర్గాల్లో చర్చనడుస్తోంది. అంటే అసిస్టెంటే కోటికి పైగా సంపాదించి ఉంటే.. ఏసీపీ లేరు, టీపీఎస్ లేరు, బిల్డింగ్ ఇనస్పెక్టర్లు లేరు.. వీరందరి వాటాలన్నీ అవినీతి అనకొండ ఒక్కడే వసూళ్లు చేసుకున్నాడంటే ఎన్ని కోట్లు సంపాదించివుంటాడో స్పష్టమవుతోంది.
కొన్నికట్టడాలకు అతను వసూళ్లు చేసిన మొత్తాలు
శ్రీరాముల పేటలో కట్టిన ఒక అక్రమ కల్యాణమండపంలోనే రూ.5 లక్షలకు పైగా వసూలు చేశాడు. ఆ కల్యాణమండపం పక్కనే కడుతున్న మరో భారీ షాపింగ్ కాంప్లెక్సులో రూ.15 లక్షలు వసూలు చేశారని ఆరోపణలున్నాయి. మైదుకూరు రోడ్డులోని ఒక పెద్ద లాడ్జీకి రూ.5 లక్షలు వసూళ్లు చేశాడు. గాంధీరోడ్డు సుందరాచార్యుల వీధిలో ఇటీవల ప్రారంభం అయిన పెద్ద లాడ్జీ కమ్ హోటల్‌కు రూ.5 లక్షలు, కొవ్యూరు గ్యారేజీ వెనుక ఉన్న ఒక కార్పొరేట్ స్కూలుకు రూ.5 లక్షలు. వైఎంఆర్ కాలనీలోని కొన్నిఅపార్ట్ మెంట్లకు ఏకంగా ఒక్కొక్క దానికి రూ.10లక్షల నుంచి రూ. 15 లక్షలకు పైగా వసూలు చేశాడు. మరో బ్యాంకు కట్టడానికి రూ.2.5 లక్షలు, ఎర్రగుంట ్లరోడ్డులోని పూర్తిగా అక్రమ నిర్మాణమైనఒక ప్లాజాలో పెద్ద ఎత్తున వసూలు చేశాడని సమాచారం. ఐదు సెంట్లకు పైగా ఇంటి నిర్మాణముంటే చాలు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తాడు. అలాగే వీదుల్లో ఇంటికి పర్మిషన్ తీసుకోని షాపురూములు కట్టే వారివద్ద రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు తీసుకుంటాడు. అతను సాగించిన అక్రమ వసూళ్ల చిట్టా పెద్ద చాంతాడంత ఉంటుందని మున్సిపల్ ఉద్యోగులే కథలు కథలుగా చెబుతుంటారు. ఆ అధికారి నేరుగా ఫోన్ పేలో కూడా అక్రమ కట్టడాలకు వసూళ్లు చేశాడని కౌన్సిల్లోనే చర్చజరిగింది. కానీ ఇంతవరకు అతనిపై అధికారులు కానీ పాలకమండలి కాని ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
కూటమి ప్రభుత్వంలోనైనా వేటు పడేనా
కూటమి ప్రభుత్వం వచ్చినా అతని వసూళ్ల దందా ఆగింది లేదని చెబుతున్నారు. మూడు నెలల్లో మూడుసార్లు జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో కూడా అతని అవినీతి ప్రస్తావన లేని సమావేశం లేదంటే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ప్రతి సమావేశంలో కౌన్సిలర్లే అతని అవినీతిపై విమర్శించని రోజులేదు. కూటమి ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సైతం ఏసీపీ అవినీతిపై కౌన్సిల్లో వింటున్నారు. కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అతని హయాంలో సాగించిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయలేదు. అతనితోనే అక్రమ కట్టడాలు తీయిస్తానని చెప్పడమే కానీ అతనితో ఏ పని చేయించలేదు. రేపో మాపో అతనే ఇక్కడి నుంచి చల్లగా జారుకునే అవకాశం ఉంది. బదిలీపై వెళ్లిపోతే అతను సాగించిన అక్రమాలు మరుగున పడిపోతాయి. ఇప్పటికైనా కలెక్టర్, టౌన్ ప్లానింగ్ ఆర్డీ, డైరెక్టర్‌లు ఈ అవినీతి అనకొండపై విచారణకు ఆదేశించి చర్యలు తీసుకునేలా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి యత్నించాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Sep 01 , 2024 | 12:07 AM