ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

education సమాజ అవసరాలు తీర్చేలా విద్యావిధానం : వీసీ

ABN, Publish Date - Sep 26 , 2024 | 11:54 PM

సమాజ అవసరాలు తీర్చేలా విద్యార్థుల్లో నైపుణ్యత పెంచే దిశగా విద్యాలయాలు ప్రయత్నాలు ప్రారంభించాలని వైస్‌చాన్సలర్‌ క్రిష్ణారెడ్డి తెలిపారు

మాట్లాడుతున్న రిజిసా్ట్రరు ప్రొఫెసరు రఘునాధరెడ్డి

కడప (ఎడ్యుకేషన), సెప్టెంబరు 26: సమాజ అవసరాలు తీర్చేలా విద్యార్థుల్లో నైపుణ్యత పెంచే దిశగా విద్యాలయాలు ప్రయత్నాలు ప్రారంభించాలని వైస్‌చాన్సలర్‌ క్రిష్ణారెడ్డి తెలిపారు. గురువారం యూనివర్శిటీ అన్నమాచార్య సెనెట్‌హాలులో ఉన్నత విద్య ప్రయోజనాలు వ్యూహాలు, సవాళ్లు, నైపుణ్యత ఆధారిత పాఠ్యాంశాలు అనే అంశంపై రెండురోజుల జాతీయ వర్క్‌షాపును రిజిసా్ట్రరు రఘునాధరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్‌చాన్సలర్‌ మాట్లాడుతూ ఉన్నత విద్యలో మార్కులు ప్రామాణికం కాదని, నైపుణ్యత ముఖ్యమన్నారు. జాతీయ విద్యావిధానం ద్వారా ప్రయోగాత్మక విద్యాబోధన అమల్లోకి రానుందని.. నాలుగేళ్ల హానర్స్‌ కోర్సు సత్ఫలితాలు ఇస్తుందన్నారు.

రిజిసా్ట్రర్‌ ప్రొఫెసరు రఘునాధరెడ్డి మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిష్కృతమైనా నైపుణ్యత లేని యువత వల్ల దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 47శాతం మంది విద్యార్థులు మాత్రం సరైన నైపుణ్యత కలిగి ఉన్నారన్నారు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంఏపీ 2020 విద్యారంగంలో ఒక మైలురాయి అని తెలిపారు. ఈ విధానం ఎన్నో విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం తిరుపతి ఐఐటీ ప్రొఫెసరు సునీల్‌కుమార్‌, వెల్లూరు వీఐఐటి ప్రొఫెసరు ఎస్‌ఎం ఫరూక్‌, కన్వీనర్లు ప్రొఫెసరు లలితలు ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రొఫెసరు సరిత, అసోసియేట్‌ ప్రొఫెసరు సునీతతో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2024 | 11:54 PM