ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చదువులమ్మ చెట్టు నీడలో..

ABN, Publish Date - Sep 13 , 2024 | 12:05 AM

ఏడున్నర దశాబ్ధాల కిందట జనించిన ఆ విద్యాలయం ఎంతోమంది విద్యార్థుల రూపురేఖలు మార్చి.. వారి జీవితాల్లో వెలుగులు నింపింది. సమాజాన్ని సవ్యంగా నడిపించేందుకు మూలమైంది. ఈ విద్యా ప్రయాణ యజ్ఞంలో ఎన్నో స్ఫూర్తిగాథలు కదిలిస్తే తనువెల్లా విచ్చుకుంటాయి.

ఆర్ట్స్‌ కళాశాల

ఆర్ట్స్‌ కళాశాలకు 75 వసంతాలు

నేడు, రేపు ప్లాటినం సంబరాలు

హాజరు కానున్న ఐఎఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌తో పాటు

ఉన్నత స్థాయిలో స్థిరపడిన పూర్వవిద్యార్థులు

కడప (ఎడ్యుకేషన), సెప్టెంబరు 12: ఏడున్నర దశాబ్ధాల కిందట జనించిన ఆ విద్యాలయం ఎంతోమంది విద్యార్థుల రూపురేఖలు మార్చి.. వారి జీవితాల్లో వెలుగులు నింపింది. సమాజాన్ని సవ్యంగా నడిపించేందుకు మూలమైంది. ఈ విద్యా ప్రయాణ యజ్ఞంలో ఎన్నో స్ఫూర్తిగాథలు కదిలిస్తే తనువెల్లా విచ్చుకుంటాయి. క్రమశిక్షణ, నిబద్ధత ప్రమాణాలే పెట్టుబడిగా పరిపూర్ణమైన పౌరులుగా విద్యార్థులను తయారు చేసిం ది. రాష్ట్రంలో పాలకులుగా తయారు చేయడమే కాకుండా.. సరిహద్దులు చెరిపి దేశ విదే శాల్లో ఉన్నతస్థాయిలో నిలిచేలా ప్రయోజకులను చేసింది. ఇక విద్యాయజ్ఞంలో అడుగడు గునా సవాళ్లను ఎదుర్కొంటూ.. మొక్కవోని దీక్షతో మారుతున్న కాలమాన పరిస్థితులను అవగతం చేసుకుంటూ.. విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా జాతీయ సంస్థల గుర్తింపును అందుకుని.. స్వాతంత్ర సంస్థగా ఎదిగింది. ప్రస్తుతం ఈకళాశాల ప్లాటినం (75 వసం తాల) జూబ్లి ఉత్సవాలు జరుపుకోవడానికి సిద్ధమైంది. ఇంతటి విశిష్టత కలిగిన కడప నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలపై ప్రత్యేక కథనం.

కడపలోని జిల్లా పరిషత భవనంలో 1948వ సంవత్సరం 136 మంది విద్యా ర్థులతో బీఏ, బీకాం, పీఈసీ కోర్సులతో ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల ఏర్పాటయ్యింది. నూతన భవనాల నిర్మాణం కోసం 1952 సంవత్సరంలో అప్పటి సీఎం రాజగోపాలచారి కళాశాలకు సంబంధించి 90 ఎకరాల స్థలాన్ని మంజూరు చేశారు. అంతేకాకుండా ఆయనే కళాశాల భవన నిర్మాణ పనులకు శిలాఫలకం వేశారు. 1954 సంవత్సరానికి నిర్మాణాలు పూర్త య్యాయి. ఆనాటి మద్రాసు యూనివర్శిటీ వైస్‌చాన్సలర్‌ ముదిలిరగాయరపిళ్లూ కళాశాల నూతన భవనాలు ప్రారంభించారు. అప్పటి వరకు జడ్పీ భవనంలో కొనసాగుతున్న కళాశాల నూతన భవనంలోకి మారింది. 136 మంది విద్యార్థుల తో ప్రారంభమైన కళాశాల ప్రస్తుతం 1300కు పైగా విద్యార్థులు సంఖ్యకు చేరుకుంది. మూడు కోర్సుల నుంచి 20 కోర్సులకు చేరింది. అంతేకాదు.. కళాశాల ప్రమాణాలకు పెద్దపీటగా మారుతూ వచ్చింది. క్రమంగా ఆర్ట్స్‌ కళాశాలలో డిగ్రీలో చదువుతున్నారంటే ఓ రకమైన క్రేజ్‌. ప్రతిభా వంతులుగా గుర్తించేవారు.

కళాశాలలో చదివిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నతస్థాయికి ఎదిగారు. వీరిలో ప్రధానంగా ఐఏఎస్‌ అధికారులుగా డాక్టర్‌ జవహర్‌రెడ్డి, ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఐపీఎస్‌గా కె.లక్ష్మిరెడ్డి, ఐఎఫ్‌ఎస్‌లుగా కేఆర్‌ఎం రెడ్డితో పాటు కమిషనర్లుగా, ఉన్న తాధికారులుగా విఽభిన్నస్థాయిల్లో పనిచేస్తున్నారంటే.. ఇందులో గురువులు అకుంఠిత దీక్ష , అంకితభావం ఏ స్థాయిలో ఉందో అవగతం చేసుకోవచ్చు. అంతేకాదు.. కళాశాల విద్యా ర్థులు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలు, మంత్రులుగా ఎదిగిన క్రమం చూస్తే విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కళాశాలలో బీజం పడిందని చెప్పవచ్చు. మారుతున్న కాలామాన పరిస్థి తులకనుగుణంగా ఉన్నత విద్యలో వస్తున్న మార్పులను అనుసరిస్తూ న్యాక్‌వంటి జాతీయ స్థాయి గుర్తింపును అందుకుని స్వాతంత్య్ర సంస్థ(అటానమస్‌) కళాశాలగా ఎదిగింది. ప్రస్తుతం కళాశాలలో 54 మంది సహాఆచార్యులు, సహాయ ఆచార్యులు, ఆచార్యులుగా పనిచేస్తున్నారు. వీరిలో 48 మందికి పీహెచడీ అర్హత ఉండడం గమనార్హం. పది మంది అధ్యాపకులు ఒప్పందం ప్రాతిపదికన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


నేడు ప్రారంభోత్సవ సమావేశం

ఆర్ట్స్‌కళాశాల ప్లాటినం జూబ్లి ప్రారంభోత్సవ సమావేశం శుక్రవారం ఉదయం 9.45కు ప్రారంభం కానుంది. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ హాజరు కానున్నారు. అలాగే కడప ఎమ్మెల్యే మాధవీ, ఉన్నత విద్యా కమిషనర్‌ డాక్టర్‌ పోలా భాస్కర్‌, పూర్వవిద్యార్ధి, ఐఎఎస్‌ విశ్రాంత ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఇండియన స్టాటస్టికల్‌ ఇనిస్టిట్యుట్‌ డైరెక్టరు పూర్వవిద్యార్ధి ప్రొఫెసరు బీఎల్‌ఎస్‌ ప్రకాశరావు హాజరు కానున్నారు.

రేపు పూర్వవిద్యార్థుల సమావేశం

ప్లాటినం జూబ్లికి సంబంధించి ఈ నెల 14న పూర్వ విద్యార్థుల సమావేశం జరగనుంది. సమావేశానికి పూర్వవిద్యార్థులు హాజరు కానున్నారు. పూర్వవిద్యార్థులు ఎం.వేణు గోపాల్‌రెడ్డి ఐఎఎస్‌, కె.లక్ష్మిరెడ్డి ఐపీఎస్‌, కేఆర్‌ఎం రెడ్డి ఐఎఫ్‌ఎస్‌తో పాటు వివిధ యూనివర్శిటీల వైస్‌చాన్సలర్లుతో పాటు పలువురు పాల్గొననున్నారు.

Updated Date - Sep 13 , 2024 | 12:05 AM

Advertising
Advertising