ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kadapa: ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం: ఎమ్మెల్యే మాధవి రెడ్డి

ABN, Publish Date - Dec 23 , 2024 | 01:27 PM

కడప కార్పోరేషన్ సర్వసభ్య సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే మాధవి రెడ్డికి కుర్చీ వేయకపోవడంతో రెండు వర్గాలకు చెందిన నేతలు పోటా పోటీగా నిరసన తెలిపారు. ఎమ్మెల్యే కుర్చీ వేసే వరకు సమావేశం జరగకూడదని టీడీపీ పట్టుపడుతుండగా.. మరోవైపు ఎలాగైనా సమావేశం నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పట్టుపట్టారు.

కడప: నగర కార్పోరేషన్ (Kadapa Corporation) సర్వసభ్య సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే మాధవి రెడ్డి (Mayor vs. MLA Madhavi Reddy) మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. మాధవి రెడ్డికి కుర్చీ (Chair) వేయకపోవడంపై టీడీపీ సభ్యులు (TDP Leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ పోడియం వద్దే నిలబడి ఎమ్మెల్యే నిరసన తెలిపారు. ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం అంటూ మేయర్‌ను నిలదీశారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ (YSRCP), టీడీపీ కార్పొరేటర్లు పోటా పోటీగా నినాదాలు చేశారు.

గతంలో జరిగిన జనరల్ సమావేశంలో కూడా మేయర్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డికి కుర్చీ వేయకపోవడంతో అప్పుడు కూడా వాగ్వాదం జరిగింది. ఈ రోజు కూడా సర్వసభ్య సమావేశంలో కుర్చీ వేయకపోవడంతో ఉదయం నుంచి గొడవ జరుగుతోంది. మొత్తంగా ఎమ్మెల్యేకు కుర్చీ వేయకపోవడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యేకు కుర్చీ వేసే వరకు సమావేశం జరగకూడదని టీడీపీ పట్టుపడుతుండగా.. మరోవైపు ఎలాగైనా సమావేశం నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పట్టుపట్టారు. మేయర్ మహిళలను అవమానిస్తున్నారని, ఆయన అవినీతి పరుడని ఎమ్మెల్యే మాధవి రెడ్డి విమర్శించారు. ఈ గందరగోళం నేపథ్యంలో మేయర్ సురేష్ బాబు సమావేశాన్ని వాయిదా వేశారు. తిరిగి మధ్యాహ్నం తర్వాత సమావేశం ప్రారంభం కానుంది. అయితే జరుగుతుందో లేదో కూడా సందేహమే..


సోమవారం ఉదయం 11 గంటలకు నగర కార్పోరేషన్ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే మాధవి రెడ్డికి మేయర్ చాంబర్‌లో కూర్చీ వేయలేదు. మేయర్ సురేష్ బాబు, మాధవి రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. మహిళను అవమానిస్తారా.. ఇక్కడ కుర్చీ మీరు లాగేసినా ప్రజలు తనకు కుర్చీ ఇచ్చారని, కుర్చీల కోసం పోరాడాల్సిన అవసరం తనకు లేదని ఎమ్మెల్యే అన్నారు. సమావేశమంతా నిల్చొని మాట్లాడే శక్తి తనకుందన్నారు. మేయర్‌కు ఈ సలహా ఎవరు ఇచ్చారో తెలియదు కానీ, కడప నియోజక వర్గంలోని మహిళలను అవమానిస్తే.. వాళ్ల నాయకుడు సంతోషిస్తాడో.. లేకపోతే మేయర్, కార్పొరేటర్ల కుర్చీలు తీసివేస్తారేమో అన్న భయం పట్టుకుందో తెలియదుగానీ కుర్చీలాట మొదలెట్టారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఈ క్రమంలో సమావేశంలో గందరగోళం నెలకొంది. ఒకవైపు వైఎస్సార్‌సీపీ, మరోవైపు టీడీపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు.


కాగా ఉదయం నుంచి కడప సర్వసభ్య సమావేశంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మేయర్ డౌన్ డౌన్ అంటూ టీడీపీ (TDP) కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ (YSRCP) పాలక వర్గం, కడప ఎమ్మెల్యే మాధవి మధ్య కుర్చీ వివాదం నడుస్తోంది. గత సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ మేయర్ తనకు కుర్చీ వేయకుండా అవమానించారని ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా తనకు మేయర్ చాంబర్‌లో కూర్చీ వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అక్కడ ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. కడప కార్పొరేషన్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. కాగా ఇటీవల వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో 8 మంది కార్పోరేటర్లు చేరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారతరత్న పీవీ, తెలంగాణ ఠీవి..: కేటీఆర్

విజయసాయి రెడ్డి దోపిడీ ముఠా..: సోమిరెడ్డి

కడపలో టెన్షన్.. టెన్షన్..

యూట్యూబ్ కొత్త గైడ్‌లైన్స్ ఇవే..

పేర్ని నాని భార్య జయసుధపై లుకౌట్ నోటీసు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 23 , 2024 | 01:27 PM