ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Rain Alert: దక్షిణకోస్తా, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

ABN, Publish Date - Oct 17 , 2024 | 07:07 AM

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. వాయుగుండం తీరం దిశగా వస్తున్నందున 8 జిల్లాలకు ఆకస్మిక వరద హెచ్చరిక జారీచేశారు.

అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైకి 80 కి.మీ., నెల్లూరుకు 150 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని.. పశ్చిమ వాయువ్య దిశగా 22 కిమీ వేగంతో వాయుగుండం కదులుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని.. తరువాత వాయుగుండం క్రమంగా బలహీనపడుతుందన్నారు. గురువారం దక్షిణకోస్తా, రాయలసీమ (Rayalaseema)లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) పడతాయని, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.


బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. వాయుగుండం తీరం దిశగా వస్తున్నందున 8 జిల్లాలకు ఆకస్మిక వరద హెచ్చరిక జారీచేశారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, అక్కడక్కడా కుంభవృష్టి, కడప, ప్రకాశంతోపాటు పల్నాడు, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు, చెరువులు, నదులుండే ప్రాంతాల్లో వరద ముప్పు ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. నైరుతి బంగాళాఖాతంలో గల వాయుగుండం దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడుల దిశగా దూసుకొస్తోంది. గంటకు 15 నుంచి 20 కి.మీ. సగటు వేగంతో పశ్చిమ వాయవ్యంగా పయనిస్తున్న వాయుగుండం బుధవారం రాత్రికి చెన్నైకు 290 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, నెల్లూరుకు 270 కి.మీ. ఆగ్నేయంగా నైరుతి, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి గురువారం ఉదయం చెన్నైకు సమీపంలో తీరం దాటుతుంది.


తరువాత దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మీదుగా పయనించి శుక్రవారానికి బలహీనపడుతుంది. దీని అవశేషాలు ఈనెల 18న అరేబియా సముద్రంలో ప్రవేశించి అక్కడ అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. వాయుగుండం తీరందాటే సమయంలో గంటకు 40 నుంచి 50, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతోపాటు రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అనేకచోట్ల, ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఏర్పేడులో 97.75 మి.మీ.లు, ఓబులవారిపల్లెలో 81.25, రెడ్డిపల్లెలో 80.50 మి.మీ. భారీ వర్షపాతం నమోదైంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అనేకచోట్ల భారీవర్షాలకు ఇప్పటికే వరద తీవ్రత పెరిగింది. బుధవారం రాత్రి నుంచి వర్షాలు పెరిగే అవకాశం ఉండడంతో ప్రకాశం, నెల్లూరు, పల్నాడు, గుంటూరు, చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. వాయుగుండం తీరం దాటే సమయంలో బాపట్ల, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లోనూ వర్షాలు పెరుగు తాయి. గురువారం దక్షిణ కోస్తా, సీమల్లో అనేకచోట్ల, ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, మచిలీపట్నంలలో మూడు, కాకినాడ, గంగవరం, విశాఖపట్నంలలో ఒకటో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎక్కడి వారు అక్కడికి వెళ్లాల్సిందే!

చంద్రబాబు రక్షణకు సీఆర్‌పీఎఫ్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 17 , 2024 | 07:07 AM