ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వాన జాడ లేక...

ABN, Publish Date - Sep 18 , 2024 | 11:43 PM

వేసవిని తలపించేలా భగభగ మండుతున్న ఎండలు... అప్పడప్పుడు మేఘాలు కమ్ముకుంటున్నా వర్షం జాడ లేక.. రోజురోజుకు భూగర్జజలాలు పాతాళానికి పడిపోయాయి.

వదిలేసిన వరినారులో పశువులు మేస్తున్న దృశ్యం

ఎండుతున్న పంటలు

కాపాడుకునేందుకు రైతన్నల తాపత్రయం

బోరుబావుల తవ్వకాలు.. లక్షల్లో ఖర్చు

రైతులకు తప్పని కష్టాలు

సంబేపల్లె, సెప్టెంబరు 18: వేసవిని తలపించేలా భగభగ మండుతున్న ఎండలు... అప్పడప్పుడు మేఘాలు కమ్ముకుంటున్నా వర్షం జాడ లేక.. రోజురోజుకు భూగర్జజలాలు పాతాళానికి పడిపోయాయి. దీంతో సాగు చేసిన పంటలన్నీ కళ్లముందు ఎండిపోవటంతో రైతన్నలు తల్లడిల్లిపోతు న్నారు. పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. కొంద రు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటి తడులు అందిస్తుంటే.. మరి కొందరు అప్పులు చేసి బోరు బావులను తవ్విస్తున్నారు. ఇదే అదునుగా బోరు బావుల తవ్వకానికి ధరలు భారీగా పెంచేశారు. గతంలో బోరుబావి తవ్వకాలకు 300 అడుగుల వరకు 80 నుంచి 85 రూపాయలు ఉండేది. ప్రస్తుతం 100 రూపాయలకు పెంచారు. దీంతో రైతులు బోరు బావి తవ్వాలంటే లక్షరూపాయలుపైనే ఖర్చు చేయాల్సి వస్తోంది. గత రెండు నెలల నుంచి వర్షం జాడ లేకపోవడంతో వరినార్లు పోసిన కొందరు రైతు లు వదిలేశారు. వేరుశనగ పంట ఎండిపోతుంది. మామిడి చెట్లు నిలు వునా మాడిపోతున్నాయి. పల్లె జనాలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. సాగు చేసిన పంటలన్నీ ఎండిపోయి కరువు నెలకొంది. కరువు పరిస్థితులు నుంచి తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

Updated Date - Sep 18 , 2024 | 11:43 PM

Advertising
Advertising