Rs.10 coin రూ.10 నాణెం వద్దే వద్దు
ABN, Publish Date - Sep 19 , 2024 | 11:43 PM
ఓ పక్క పదిరూపాయల నాణెం చెల్లుతుందని ఆర్‌బీఐ చెబుతున్నా నాణేలు తీసుకునేందుకు వ్యాపా రులు నిరాకరిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లోనూ.. చివరికి పెట్రోలు బంకుల్లో సైతం ఇదే పద్ధతి అవలంభిస్తున్నారు.
నోట్ల కొరత.. నాణే లే దిక్కు
అయినా తిరస్కరిస్తున్న వ్యాపారులు
పెట్రోలు బంకుల్లోనూ అంతే
ఆర్‌బీఐ సూచనలు బేఖాతరు
పులివెందుల టౌన, సెప్టెంబరు 19 : ఓ పక్క పదిరూపాయల నాణెం చెల్లుతుందని ఆర్‌బీఐ చెబుతున్నా నాణేలు తీసుకునేందుకు వ్యాపా రులు నిరాకరిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లోనూ.. చివరికి పెట్రోలు బంకుల్లో సైతం ఇదే పద్ధతి అవలంభిస్తున్నారు. పది రూపాయల నోట్ల స్థానంలో ఐదేళ్ల క్రితం పది నాణేలను ఆర్‌బీఐ అందుబాటులోకి తెచ్చింది. కొంత కాలం ఈ నాణేలపై ఎటువంటి అభ్యంతరాలు లేకపోయినా రెండేళ్ల నుంచి దుకాణదారులు వాటిని తీసుకునేందుకు నిరాకరిస్తూ వచ్చారు. పై నాణేలు వినియోగంలోనే ఉన్నాయంటూ ఆర్‌బీఐ చెబుతున్నా వ్యాపారులు వాటిని తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. ఇటీవల పది రూపాయల నోట్ల కొరత వచ్చింది. ఇందుకు ప్రత్యామ్నాయమైన పది నాణెం చెలామణి అవుతుందని చెబుతున్నా కొంత మంది వ్యాపారులు తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు.
2019లో ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన పది రూపాయల నాణేన్ని స్టాండర్డ్ డిజైనతో నాలుగు రకాలుగా విడుదల చేశారు. పది రూపా యల నోటు ఎక్కువ కాలం నాణ్యత, మన్నికగా ఉండదు. దీంతో సుమా రు 20ఏళ్ల పాటు చెలామణిలో మన్నికగా ఉండేలా ఆర్‌బీఐ పది రూపా యల నాణేన్ని అందుబాటులోకి తెచ్చింది. రూపాయి, రెండు, ఐదు రూపాయల నాణేల తరువాత పది రూపాయల నాణెం విలువైనది. ఇప్పటికీ ఐదేళ్లుగా దేశవ్యాప్తంగా చెలామణిలో ఉన్నా మన ప్రాంతంలో అందుబాటులో లేదు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు, చెన్నై, మహా నగరాల్లో ఆ నాణెం చెల్లుబాటులో ఉంది. ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సులు, వ్యాపార సముదాయాల్లో విరివిగా వినియోగిస్తున్నారు. ఇక్కడ విని యోగంలో ఉన్న నాణేన్ని పులివెందులలో ఎందుకు తిరస్కరిస్తున్నారో అర్ధం కాని పరిస్థితి.
పులివెందులలో నోట్ల కొరత ఎక్కువగా ఉంది. ఈక్రమంలో కొద్దిరోజుల క్రితం ఆర్‌బీఐ మరోసారి పది రూపాయల నాణేల వినియోగంపై క్లారిటీ ఇచ్చింది. వీటిని తిరస్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయినా దుకాణ యజమానుల్లో మార్పు రాలేదు. దీనికి తోడు పెట్రోలు బంకుల్లో సైతం ఈ నాణేలు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు.
తీసుకోకపోతే.. కేసు నమోదు
పది నాణెం చెలామణిలో ఉందని... అన్ని చోట్ల అది చెల్లుబాటు అవు తుందని ఇటీవల రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది. బ్యాంకర్లు తిరస్కరిస్తే ఎల్‌డీఎంలకు ఆయా బ్యాంకుల ఉన్నతా ధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. వాణిజ్య సముదా యాల్లో నాణేన్ని తీసుకోకపోతే నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయ వచ్చు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తారు. పది నాణెం చెలామణిపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చాల్సి ఉంది. ఆ దిశగా బ్యాంకర్లు బాధ్యతగా తీసుకుని పది నాణెంపై ప్రచారం నిర్వహిస్తే వాటి చెలామణి పెరుగుతుంది. వ్యాపారులతో సత్సంబంధాలు కలిగిన జీఎస్టీ అధికారులు కూడా వ్యాపారులకు అవగా హన కల్పించాల్సిన అవసరం ఉంది. కాగా, పులివెందుల పట్టణంలో మెయిన రోడ్డు సమీపంలో ఉన్న పెట్రోలు బంకులో కొందరు వాహన దారులు రూ.10 నాణేలను ఇవ్వగా.. అక్కడ సిబ్బంది తిరస్కరించడంతో వారితో వాగ్వివాదానికి దిగారు. చిన్నవ్యాపారులు అవగాహన లేక నాణేలు తిరస్కరిస్తున్నారంటే వారిలో ఉన్న భయాలకు అర్ధం ఉంది. కానీ కేంద్ర పెట్రోలియం సంస్థల ద్వారా నడిచే పెట్రోలు బంకుల్లో సైతం తిరస్కరించడం విడ్డూరంగా ఉందని.. వాటిపై చర్యలు తీసుకో వాలంటూ స్థానికులు కోరుతున్నారు.
పది రూపాయల నాణెం ఎక్కడైనా చెల్లుతుంది.
పది రూపాయల నాణెం తమిళనాడుతో పాటు ఇతర రాషా్ట్రలలో చలామణిలో ఉంది. ఏపీలో ముఖ్యంగా కడప జిల్లా పులివెందులలో చెలామణిలో లేదు. బ్యాంకుల్లో వాటిని మార్చుకోవచ్చు. డిపాజిట్ చేయ వచ్చు. ఈనాణేన్ని తిరస్కరించే బ్యాంకర్లపై ఫిర్యాదు చేయవచ్చు, వ్యాపారులు ఇతరులకు ఈ నాణెంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
- జనార్ధనరావు, ఎల్‌డీఎం
Updated Date - Sep 19 , 2024 | 11:43 PM