ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ram Charan: ముషాయిర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..

ABN, Publish Date - Nov 18 , 2024 | 07:42 AM

పెద్దదర్గా ఉరుసు ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం పెద్దదర్గాలో నిర్వహించే ముషాయర కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

కడప: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కడప పెద్దదర్గా ఉరుసు ఉత్సవాలు (Urusu Festivals) వైభవంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ కడప పెద్దదర్గాకు చదర్ సమర్పించారు. అయితే సోమవారం పెద్దదర్గాలో నిర్వహించే ముషాయిర కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global star Ram Charan) ముఖ్య అతిథిగా (Chief Guest) పాల్గొననున్నారు. ప్రతి ఏడాది ముషాయిర కార్యక్రమానికి ఒక అతిథి రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి రామ్ చరణ్ వస్తున్నారు.

ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం జాతీయ ముషాయిర గజల్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ గజల్‌ గాయకులు పాల్గొననున్నారు. అయితే ఈ కార్యక్రమానికి గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో రామ్‌ చరణ్‌ ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.


ఉరుసు ఉత్సవాల్లో ఏఆర్ రెహమాన్

కాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కడపలోని అమీన్ పీర్ దర్గాను ఆదివారం దర్శించుకున్నారు. దర్గా ఉర్సు ఉత్సవాల్లో ఆయన పొల్గొన్నారు. పీఠాధిపతి అరిదుల్లా హుసైనీ నివాసం నుంచి వైభవంగా గంధం ఊరేగింపు నిర్వహించారు. ఏఆర్ రెహమాన్ కుటుంబ సమేతంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ప్రధాన‌మైన గంధ మహోత్సవం క‌న్నుల పండుగ‌గా జ‌రిగింది. దర్గా పీఠాధిపతి తన శిష్యగణంతో కలిసి కలశాన్ని తీసుకువచ్చారు. ప్రతియేటా అత్యంత వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. పెద్ద దర్గాకు విశిష్ట ప్రాముఖ్యత ఉంది సర్వమతాలకు అతీతంగా ఇక్కడ భక్తులు వచ్చి ఉరుసు మహోత్సవంలో పాల్గొంటారు. ప్రతి ఏటా నవంబర్ 16 నుంచి 21వ తేదీ వరకు జరిగే ఉరుసు ఉత్సవం చాలా ప్రత్యేకత సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలతో పాటు చాలామంది ప్రముఖులు హాజరవుతారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బాబు అరెస్టుకు.. నా స్టేట్‌మెంట్లతో లింకా..

గనుల ఘనుడు వెంకటరెడ్డి విడుదల

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 18 , 2024 | 08:00 AM