ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మరమ్మతులు చేయించండి.. మహాప్రభో..!

ABN, Publish Date - Sep 02 , 2024 | 11:03 PM

స్థానిక జడ్పీ హైస్కూల్‌ తరగతి గదులు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వర్షం కురిసిందంటే పాఠశాల పైకప్పు నుంచి వర్షపు నీరు కారడం, గోడలు నెమ్మెక్కి పెచ్చులూడిపడుతున్నాయి.

బీటలువారిన తరగతి గది గోడలు

కూలడానికి సిద్ధంగా తరగతి గదులు

బిక్కు బిక్కు మంటూ విద్యార్థులు

బురదలో నరకయాతన ఫ నిర్లక్ష్యంతో ఆగిన నాడు-నేడు పనులు

పాఠశాల భవనం ప్రారంభించాలని తల్లిదండ్రుల వినతి

సింహాద్రిపురం, సెప్టెంబరు2: స్థానిక జడ్పీ హైస్కూల్‌ తరగతి గదులు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వర్షం కురిసిందంటే పాఠశాల పైకప్పు నుంచి వర్షపు నీరు కారడం, గోడలు నెమ్మెక్కి పెచ్చులూడిపడుతున్నాయి. దీంతో గోడలు ఎక్కడ కూలిపోతాయోనని ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. వర్షం కురిసిందం టే పాఠశాల ఆవరణ అంతా బురదమయమై నడిచేందుకు కూడా విన్యా సాలు చేయాల్సి వస్తోంది. కొన్ని సందర్బాల్లో నడవలేక కిందపడిపోయే పరిస్థితులున్నాయి. వర్షం కురిసినపుడు తరగతి గదుల్లో పరిస్థితి దారు ణంగా ఉంటోంది. పాఠశాలలో వున్న 360 మంది విద్యార్థులు ఎక్కడ కూ ర్చుని చదువుకోవాలో అర్థం కాని పరిస్థితి. త్వరితగతిన పాఠశాలను నూ తన భవనంలోకి మార్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజా ప్రతినిధులను, సంబంధిత ఉన్నతాధికారులను కోరుతున్నారు.

Updated Date - Sep 02 , 2024 | 11:03 PM

Advertising
Advertising