TDP: వైఎస్ షర్మిల నిన్న ఒక రహస్యం చెప్పారు: కనకమేడల
ABN, Publish Date - Apr 26 , 2024 | 01:48 PM
న్యూఢిల్లీ: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న (గురువారం) ఒక రహస్యం చెప్పారని, రాజశేఖర్ రెడ్డి పేరును సీబీఐ చార్జీ షీట్‌లో ఇరికించింది జగన్మోహన్ రెడ్డేనని షర్మిలా చెప్పారని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ అన్నారు.
న్యూఢిల్లీ: ఏపీసీసీ అధ్యక్షురాలు (APCC Chief) వైఎస్ షర్మిల (YS Sharmila) నిన్న (గురువారం) ఒక రహస్యం చెప్పారని, రాజశేఖర్ రెడ్డి (Rajasekhar Reddy) పేరును సీబీఐ చార్జీ షీట్ (CBI Charge Sheet)లో ఇరికించింది జగన్మోహన్ రెడ్డేనని (CM Jagan) షర్మిలా చెప్పారని తెలుగుదేశం (TDP) సీనియర్ నేత, మాజీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ (Kanakamedala Ravindra Kumar) అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడుతూ.. వివేక హత్య కేసు (Viveka Murder Case) విచారణ జరగకుండా సీబీఐ (CBI) అధికారులను బెదరిస్తున్నారని, సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ముద్దాయికి ఎంపీ టికెట్ (MP Ticket for Accused) ఇచ్చారని విమర్శించారు.
వివేక హత్య కేసు విచారణను ముఖ్యమంత్రే అడ్డుకుంటున్నారంటే ఇంతకన్నా ఆధారాలు ఇంకా ఎం కావాలని కనకమెడల రవీంద్ర కుమార్ అన్నారు. ఎవరి పాత్రను కప్పిపుచ్చడం కొరకు ముద్దాయిలను జగన్ కాపాడుతున్నారని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి వివేక కేసులో నిందితుడని.. ఆయనను కాపాడాలని జగన్ చూస్తున్నారని అన్నారు. వివేక సతీమణి సౌభాగ్యమ్మ జగన్‌కు లేఖ రాశారని, ఆయినా జగన్ మనసు కరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ నైతిక బాధ్యత వహించి సీఎం పదవి నుంచి తప్పుకోవాలన్నారు. లేదా వివేకను హత్య చేసిన వారిని, కుట్రదారులను శిక్షించాలని కనకమెడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు.
స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి(YS Viveka) సతీమణి సౌభాగ్యమ్మ(YS Sowbhagyamma).. సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో సంచలన విషయాలు పేర్కొన్నారు సౌభాగ్యమ్మ. తండ్రిని కోల్పోయిన సునీత(YS Sunitha) ఎంత మనోవేదనకు గురయ్యారో ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. కుటుంబ సభ్యులే ఈ హత్యకు కారణమవడం తమను చాలా బాధించిందని సౌభాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
సౌభాగ్యమ్మ లేఖలోని సారాంశం యధావిధంగా..
‘‘2009 లో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించావో.. 2019 లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు మమ్మల్ని ఎక్కువగా బాదపెట్టిన అంశం.. మన కుటుబంలోనీ వారే హత్యకు కారణం కావడం. హత్యకు కారణం ఆయిన వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం, నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నను ఈవిధంగా నీ పత్రిక, నీ టీవీ చానెల్, నీ సోషల్ మీడియా, నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాట్లాడటం, చెప్పలేనంత విధంగా హననం చేయించడం ఇది నీకు తగునా ? న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్ళను హేళన చేస్తూ.. నిందలు మోపుతూ, దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే.. నీకు మాత్రం పట్టడం లేదా? సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే.. నీవు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఎంటి ? కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇదేనా నీ కర్తవ్యం ? ఇంకా బాధించే అంశం.. హత్యకు కారకులైన ఆయిన వారికి మరలా ఎంపీగా అవకాశాన్ని నీవు కల్పించడం. ఇది సమంజసమా ? ఇటువంటి దుశ్చర్యలు నీకు ఏ మాత్రం మంచిది కాదు. ఇది నీకు తగినది కాదు అని విన్నవించుకుంటున్నా. హత్యకు కారకుడు ఆయిన నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున.. చివరి ప్రయత్నంగా.. న్యాయం ధర్మం ఆలోచన చేయమని.. నిన్ను ప్రార్థిస్తున్నా. రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని.. ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడమని నిన్ను వేడుకుంటున్నా.’’ అని సౌభాగ్యమ్మ తన లేఖలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హరీష్‌రావు రాజీనామా స్పీకర్ ఫార్మాట్‌లో లేదు: మంత్రి కోమటిరెడ్డి
ఏపీలో మే 3, 4 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటన
మే 1న ఇళ్ల వద్దనే సామాజిక పెన్షన్ల పంపిణీకి చర్యలు చేపట్టాలి: రామకృష్ణ
అవినాశ్‌కు అందుకే టికెట్ ఇచ్చా.. జగన్
అనర్హత పిటిషన్లు స్పీకర్‌కు అందాయా?
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Sports News and Chitrajyothy
Updated Date - Apr 26 , 2024 | 01:51 PM