ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యుత సబ్‌ స్టేషన్ల ఏర్పాటు ఎప్పుడో..?

ABN, Publish Date - Sep 01 , 2024 | 11:17 PM

గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల సమయంలో విద్యుత సబ్‌స్టేషన్లు గురించి పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో హడావిడిచేసి చివరికి చేతులెత్తేసిన వైనం తంబళ్లపల్లె నియోజక ర్గంలో చోటుచేసుకుంది.

బి. కొత్తకోట శెట్టిపల్లె వద్ద ఎమ్మెల్యే వేసిన శిలాఫలకం

ఎన్నికల సమయంలో భూమిపూజలకే పరిమితం చేసిన గత వైసీపీ ప్రభుత్వం ఆరు గ్రామాలలో ఒక్క ఇటుక పెట్టని వైనం రూ.10.80 కోట్ల నిధులు ఎటువెళ్లాయో తెలియదంటున్న జనం

బి.కొత్తకోట, సెప్టెంబరు1: గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల సమయంలో విద్యుత సబ్‌స్టేషన్లు గురించి పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో హడావిడిచేసి చివరికి చేతులెత్తేసిన వైనం తంబళ్లపల్లె నియోజక ర్గంలో చోటుచేసుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజ కవర్గంలో ఆరు 11కేవీ విద్యుత సబ్‌స్టేషన్లను మంజూరు చేయించగా అందులో బి.కొత్తకోట మండలంలోని గట్టుపంచాయతీ కొత్తపల్లె, నగర పంచాయతీ పరిధిలోని శెట్టిపల్లి, పీటీయం మండలంలోని పులి కల్లుపంచాయతీ బొంతలవారిపల్లి, టీ.సదుం పంచాయతీ రామాపు రం, ములకలచెరువు మండలంలోని మద్దినాయునిపల్లె, పాతకోట గ్రామాలలో 2024 మార్చి18న ఒకేరోజు ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ట్రాన్సకో సిబ్బంది, మండల అధికారులతోపాటు సొంత మంది మార్బ లాన్ని వెంటబెట్టుకుని అట్టహాసంగా శంకుస్థాపనలు చేశారు. అన్నింటికీ శిలాఫలకాలు వేశారు. ఇక లోవోల్టేజీ సమస్య ఉండదని ఈ సందర్భంగా రైతులకు హామీఇచ్చారు. దీంతో ఆయా గ్రామాల పరిధిలోని రైతులు ఆనందించారు. ఇకపై తమకు లోఓల్టేజి సమస్య ఉండదని మోటార్లు బాగా నడుస్తాయని భావించారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. వారి ఆశలు అడియాశలయ్యాయి.

రూ.10.80 కోట్ల నిధులు ఎటువెళ్లాయో తెలియదు

తంబళ్లపల్లె నియోజకవర్గానికి మంజూరైన ఆరు విద్యుత సబ్‌స్టేషన లలో ఒక్కో సబ్‌స్టేషనకు రూ.1.83కోట్లు చొప్పున మొత్తం సుమారు రూ.10.80 నిధులు సైతం మంజూరయ్యాయి. నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ సైతం పూర్తి అయింది. నిర్మాణ పనులను కేయస్‌ఆర్‌ ఏజె న్సీస్‌ అనే కంపెనీ దక్కించుకుంది. ఆరు చోట్ల సబ్‌స్టేషనల నిర్మాణా లకు అవసరమయ్యే స్థలాన్ని రెవెన్యూ అధికారులు కేటాయించారు. అయినా అప్పట్లో ఏం జరిగిందో ఏమో... నిర్మాణాలు ప్రారంభించ లే దు. అదిగో..ఇదిగో అంటూండగానే ఎన్నికల నోటిఫికేషన వెలువడింది. దీంతో మంజూరైన నిధులు ఏమయ్యాయో ఎవరికి తెలియదని ప్రజ లు వాపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. కథ మళ్లీ మొదటి కొచ్చింది. ఈ ప్రభుత్వంలో మళ్లీ ప్రతిపాదనలు, ప్రభుత్వ అనుమతి, నిధుల విడుదల అన్నీ జరగాల్సి వుంది. ఎన్నికల స్టంట్‌ చేయకుండా వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే సబ్‌స్టేషనలు పూర్తి అయి రైతులకు మేలు చేకూరేది.

నిర్మాణాలే జరిగి ఉంటే...

నియోజకవర్గంలో విద్యుత సబ్‌స్టేషన్ల నిర్మాణాలు జరిగిఉంటే వ్యవ సాయానికి లోఓల్టేజీ సమస్యలేకుండా పోయేది. ముఖ్యంగా మూడు మండలాల్లో లోఓల్టేజీ సమస్య ఉందని రైతులు పలుమార్లు అధికారు లకు విన్నవించడం తోపాటు. పరిస్థితిని నేరుగా గమనించిన ట్రాన్సకో అధికారులు సబ్‌స్టేషనల నిర్మాణం జరగాల్సిన ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు పంపారు. పాలకులు పదవీకాలం అంతా పట్టించుకో కుండా తీరా చివరి నిమిషంలో హడావిడిగా శంకుస్థాపనలతో చేతు లు దులుపుకొని నిర్మాణాలపై శ్రధ్ధ చూపకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని రైతులు వాపోతున్నారు. నిర్మాణాలే జరిగి వుంటే ఆరు సబ్‌స్టేషనల పరిధిలో సుమారు 40 గ్రామాల రైతులకు లాభం చేకూరేదంటున్నారు.

మళ్ళీ నిధులు రావాల్సిందే..

నియోజకవర్గ పరిధిలోని ఆరు విద్యుత సబ్‌స్టేషనల నిర్మాణాల కోసం వచ్చిన ఆ నిధులు తరలిపోయాయి. ఇప్పుడు మళ్లీ అనుమతు లు వచ్చి, నిధులు విడుదలైతే పనులు జరుగుతాయి. నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి. మళ్లీ ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. తాను కొత్తగా వచ్చాను కాబట్టి పూర్తి వివరాలు తెలియవు

-గంగాధర్‌, డీఈ ట్రాన్సకో

బి. కొత్తకోట శెట్టిపల్లె వద్ద ఎమ్మెల్యే వేసిన శిలాఫలకం

విద్యుత సబ్‌ స్టేషన్ల ఏర్పాటు ఎప్పుడో..?

ఫ ఎన్నికల సమయంలో భూమిపూజలకే పరిమితం చేసిన గత వైసీపీ ప్రభుత్వం ఫఆరు గ్రామాలలో ఒక్క ఇటుక పెట్టని వైనంఫ రూ.10.80 కోట్ల నిధులు ఎటువెళ్లాయో తెలియదంటున్న జనం

Updated Date - Sep 01 , 2024 | 11:17 PM

Advertising
Advertising