ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YS Sunitha Live: వివేకా హత్య జరిగి ఐదేళ్లు.. సునీత సంచలన ప్రెస్‌మీట్

ABN, Publish Date - Mar 01 , 2024 | 11:02 AM

YS Sunitha Reddy: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసు వ్యవహారం ఇప్పటికీ తేలలేదు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్షించాల్సిందేనని వివేకా కుమార్తె సునీతా రెడ్డి (Sunitha Reddy) న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి (CM Jagan Reddy) బాబాయి హత్య ఘటన జరిగి ఐదేళ్లు పూర్తి కావొస్తోంది...

జగన్ పాత్రపై విచారణ జరగాల్సిందే..

  • సినిమాల్లో చూపించే విధంగా హంతకులు మన మధ్యే ఉంటారు..

  • మనం మాత్రం రియలైజ్‌ కాలేం..

  • వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ఏం సందేశం వెళ్తుంది?

  • సీబీఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తికావట్లేదు?

  • హత్యా రాజకీయాలు సమాజాంలో ఉండకూదు

  • వంచన, మోసానికి పాల్పడిన మా అన్న పార్టీ వైసీపీకి ఓటు వేయొద్దు

  • అవినాష్‌, భాస్కర్‌రెడ్డిని వైఎస్ జగన్ ఇంకా రక్షిస్తూనే ఉన్నారు

  • ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలే..

  • వైఎస్ జగన్‌ పాత్రపై విచారణ చేయాలి.. నిర్దోషి అయితే వదిలేయాలి


న్యాయం జరగాలంటే..?

  • వివేకా హత్యకు నిజంగా న్యాయం జరగాలంటే ప్రజా తీర్పుతోనే సాధ్యం

  • మా నాన్నకు న్యాయం జరిగే ప్రజాతీర్పు కావాలని కోరుకుంటున్నా

  • ఈ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఎక్కువ

  • మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే మా తండ్రి హత్య కేసుకు న్యాయం జరగదు

  • హత్య కేసులో అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి ఉన్నారు

  • వాళ్లను రక్షించే పనిలో జగన్ ఉన్నారు

  • జగన్‌ మీద ఉన్న 11 కేసులు లాగా వివేకా హత్య కాకూడదు

  • వివేకా హత్య కేసులో నాకు న్యాయం కావాలి: సునీత


వైఎస్ జగన్‌కు ఓటేయకండి

  • నా సోదరుడు వైఎస్ జగన్‌కు.. అయన పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దు

  • తన అనుకునే వాళ్ళకి కాకుండా అందరికీ సహాయం చేసే వాళ్ళకి మాత్రమే ఓటు వేయండి

  • ప్రజలకు పిలుపు ఇచ్చిన వైఎస్ సునీత

  • హత్యలకు పాల్పడే వారికి పాలించే హక్కు లేదు : వైఎస్ సునీత


నేనే వెళ్లి ఫిర్యాదు చేశా..

  • CBI దర్యాప్తుకు వెళదామని జగన్‌ని అడిగా

  • CBIకి వెళ్తే అవినాష్‌ బీజేపీలోకి వెళ్తారని జగన్ అన్నారు

  • నేను CBIకి వెళ్లి ఫిర్యాదు చేశా

  • CBIకి వెళ్లిన తర్వాత నాతోపాటు నా భర్తకు వేధింపులు

  • CBIపైనా కేసులు పెట్టడం మొదలుపెట్టారు

  • కేసు విచారణ ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టి

  • కర్నూలు ఆస్పత్రి దగ్గర ఏం జరిగిందో అందరికీ తెలిసిందే


నాతో మాట్లాడారు!

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంతవారు మోసం చేశారు వివేకానందరెడ్డిని ఓడించారు

  • ఈ కేసు దర్యాప్తు మాత్రం ఏళ్లుగా గడుస్తోంది

  • నాకు ప్రజా తీర్పు కావాలి

  • ఎన్నికల్లో పెద్దనాన్న ప్రచారం చేశాడని అవినాశ్‌ చెప్పాడు

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాన్న ఓటమి పాలయ్యారు

  • మార్చురీ వద్ద అవినాష్‌ నాతో మాట్లాడారు

  • పెదనాన్న 11.30 వరకు నాకోసం.. ఒక్కోసారి హంతకులు మనమధ్యే ఉంటున్న తెలియనట్లే ఉంటుంది

  • వివేకా హత్యకేసును ఇప్పటికీ తేల్చుకోలేక పోతున్నారు

  • ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మద్దతు తీర్పు నాకు కావాలి

  • మాతల్లి జగన్‌ కోర్టులో కేసులు వేస్తే.. దానికి అనుగుణంగా ప్రజలు తీర్పు ఇస్తున్నారని భావిస్తున్నా

  • రెట్టింపు ఉత్సాహంతో వివేకా ప్రజల్లోకి వెళ్లారు

  • మా తల్లి జగన్‌ కోర్టులో కేసులు వేస్తే ఈ కేసులో ఏపీ ప్రజల మద్దతు కావాలి


అందరికీ ధన్యవాదాలు..

  • కేసు విచారణలో మీ అందరి సహకారం కావాలి

  • ఏపీ ప్రజల మద్దతు, ప్రజా తీర్పు నాకు కావాలి

  • దానికనుగుణంగా ప్రజలు తీర్పు ఇస్తారని భావిస్తున్నా

  • నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు

  • నేను ఎక్కడికి వెళ్లినా వివేకా హత్య కేసు గురించి అడుగుతున్నారు

  • ఈ కేసు పోరాటంలో అండగా నిలిచిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్.. ఎంపీ రఘురామరాజుకు ధన్యవాదాలు

  • సాధారణంగా హత్య కేసు 4, 5 రోజుల్లో తేలుతుంది

  • వివేకా హత్య కేసు దర్యాప్తు మాత్రం ఏళ్ల తరబడి కొనసాగుతోంది

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంతవారే వివేకాను మోసం చేశారు

  • ఎన్నికల్లో వివేకానందరెడ్డిని ఓడించారు

  • ఓడిపోతే వివేకా సైలెంట్ అవుతారని వారు భావించారు

  • కాని రెట్టింపు ఉత్సాహంతో ఆయన ప్రజల్లోకి వెళ్లారు


తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసు వ్యవహారం ఇప్పటికీ తేలలేదు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్షించాల్సిందేనని వివేకా కుమార్తె సునీతా రెడ్డి (Sunitha Reddy) న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి (CM Jagan Reddy) బాబాయి హత్య ఘటన జరిగి ఐదేళ్లు పూర్తి కావొస్తోంది. 2019 మార్చి 15న తన నివాసంలో దారుణంగా వివేకా హత్యకు గురైన సంగతి తెలిసిందే. నాలుగేళ్లుగా వివేకా హత్య కేసును సీబీఐ (CBI) దర్యాప్తు చేస్తూనే వస్తోంది. గతేడాది జూన్ 3న ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy)ని సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి బెయిల్‌పై ఉన్నారు.


కాగా.. ఐదేళ్లుగా వివేకా కేసులో ఏం జరిగింది..? నిందితులు ఎవరు..? ఇందుకు కారకులు ఎవరు..? అనే పెను సంచలన విషయాలను సునీతారెడ్డి బయటపెట్టబోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఆమె మీడియా సమావేశం పెట్టబోతున్నారు. ఢిల్లీలోని కాన్స్‌ట్యూషన్ క్లబ్‌లో సునీతా మీడియాతో మాట్లాడుతున్నారు.. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ లైవ్‌లో చూడండి.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 01 , 2024 | 12:10 PM

Advertising
Advertising