ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

G2G Agreement : ఆ బియ్యం ఆపొద్దు!

ABN, Publish Date - Dec 17 , 2024 | 04:34 AM

కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతయ్యే నూకల విషయంలో అధికారులు తనిఖీల పేరుతో ఇక్కట్లు కలిగించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ ...

  • ఆఫ్రికాతో ఒప్పందాలకు ఇబ్బంది తీసుకురావద్దు

  • తనిఖీల పేరిట ఆటంకాలతో దేశానికి ఇబ్బంది

  • ఆకలి నివారణ కోసం ఆఫ్రికాతో జీటూజీ డీల్‌

  • కాకినాడ పోర్టు నుంచి నూక బియ్యం ఎగుమతులు

  • వాటి నిలిపివేతతో ఒప్పందానికి దెబ్బ

  • ప్రభుత్వానికి, కాకినాడ కలెక్టర్‌కు ఎన్‌సీఈఎల్‌ లేఖ

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతయ్యే నూకల విషయంలో అధికారులు తనిఖీల పేరుతో ఇక్కట్లు కలిగించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్‌ కో ఆపరేటివ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌సీఈఎల్‌) విజ్ఞప్తి చేసింది. ప్రపంచంలోని ఆఫ్రికా దేశాల్లో ఆకలి నివారణ, అక్కడి ప్రజలకు ఆహార భద్రత కల్పించే ప్రక్రియలో భాగంగా భారత్‌కు ఆఫ్రికాకు మధ్య కుదిరిన గవర్నమెంట్‌ టు గవర్నమెంట్‌ (జీటూజీ) ఒప్పందంలో భాగంగా ఎగుమతి అవుతున్న బియ్యాన్ని తనిఖీల పేరుతో ఆటంక పరచవద్దు అని కోరింది. ఈమేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌కు లేఖ రాసింది. జీటూజీ ఒప్పందంలో భాగంగా కాకినాడ యాంకరేజ్‌ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు ఎన్‌సీఈఎల్‌ నూక బియ్యాన్ని ఎగుమతి చేస్తోందని ఆ సంస్థ సీఈవో అనుపమ్‌కౌశిక్‌ వివరించారు. ఇందులో ఫోర్టిఫైడ్‌ రైస్‌ ఆనవాళ్లు ఉన్నాయనే కారణంతో కొంతకాలంగా బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఎగుమతి చేయకుండా కాకినాడ అధికారులు అడ్డుకోవడం తెలిసిందే. అయితే, అది సరికాదని లేఖలో ఎన్‌సీఈఎల్‌ తన లేఖలో పేర్కొంది. ఎగుమతులకు ఆటంకం వల్ల ఆఫ్రికాతో భారతదేశానికి కుదిరిన జీటూజీ ఒప్పందానికి ఆటంకాలు కలుగుతున్నాయని అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇదే విషయమై భారత విదేశీ వ్యవహారాలశాఖ తరచూ ఎన్‌సీఈఎల్‌కు మెయిల్స్‌, ఫోన్లు చేస్తూ ఎగుమతులు ఆగడంపై ప్రశ్నిస్తోందని ఆ లేఖలో ప్రస్తావించింది. వాస్తవానికి రాష్ట్రప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మర ఆడించడానికి మిల్లులకు ఇస్తుందని, ఇలా ఆడగా వచ్చే బియ్యాన్ని ఎఫ్‌సీఐకు అప్పగించే క్రమంలో కొంత బియ్యం తిరస్కరణకు గురవుతాయని లేఖలో వివరించింది.


ఇలా తిరస్కరణకు గురైన బియ్యాన్ని మిల్లులు నూకగా ఆడించి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తాయని, అవే నూకలను కేంద్రం తరఫున తాము ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తుంటామని వివరించింది. అయితే ఈ నూకల్లో ఫోర్టిఫైడ్‌ బియ్యం (ప్రభుత్వం సరఫరా చేసే ఉచిత బియ్యం) ఆనవాళ్లు 0.01 నుంచి 0.1 శాతం వరకు ఉండడం అత్యంత సహజం అని పేర్కొంది. కానీ కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్‌ బియ్యం ఎగుమతి అవుతున్నాయన్న కారణంతో పోర్టు వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారని, ఈ చెక్‌పోస్టుల ద్వారా కేంద్రం తరపున తాము ఎగుమతి చేస్తోన్న నూక బియ్యంలో ఫోర్టిఫైడ్‌ ఆనవాళ్ల పేరుతో శాంపిళ్లు సేకరించి బియ్యం సీజ్‌ చేస్తున్నారని లేఖలో ఎన్‌సీఈఎల్‌ అభ్యంతరం వ్యక్తంచేసింది. సీజ్‌, శాంపిళ్ల తనిఖీలతో ఆఫ్రికా దేశాలకు నూకబియ్యం ఎగుమతుల్లో ఇక్కట్లు ఎదురవుతున్నాయని, తద్వారా జీటూజీ ఒప్పందాలకు విఘాతం కలుగుతోందని తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో ఆఫ్రికా దేశాలకు కాకినాడ పోర్టు నుంచి వెళ్లే నూక బియ్యం ఎగుమతులకు ఇబ్బందులు తీసుకురాకుండా నౌకల్లో లోడింగ్‌కు అనుమతించాలని కోరింది. మరోపక్క ఈ లేఖతో రాష్ట్రప్రభుత్వం సైతం నూకబియ్యం ఎగుమతి విషయంలో ఆంక్షలు లేకుండా ఆదేశాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇదిలాఉంటే కేంద్ర హోంశాఖతోపాటు సహకార శాఖ పరిధిలో ఎన్‌సీఈఎల్‌ పనిచేస్తుంది. గత కొన్నేళ్లుగా నూక బియ్యాన్ని సేకరించి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఈ సంస్థ ఎగుమతి చేస్తోంది. గతేడాది కాకినాడ యాంకరేజ్‌ పోర్టు నుంచి పలు ఆఫ్రికా దేశాలకు 2.02 లక్షల మెట్రిక్‌ టన్నుల నూకను ఎగుమతి చేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు 2.94 లక్షల మెట్రిక్‌ టన్నులు ఎగుమతి చేసింది.

Updated Date - Dec 17 , 2024 | 04:34 AM