Karnati Rambabu: సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం..
ABN, First Publish Date - 2024-02-07T12:48:12+05:30
Andhrapradesh: కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి ఏర్పడి సంవత్సరం పూర్తి కావడంతో పాలకమండలి సభ్యులు బుధవారం మెట్ల పూజ చేసి కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు.
విజయవాడ, ఫిబ్రవరి 7: కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి ఏర్పడి సంవత్సరం పూర్తి కావడంతో పాలకమండలి సభ్యులు బుధవారం మెట్ల పూజ చేసి కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు (kanakadurgamma temple chairman karnati rambabu) మాట్లాడుతూ... సామాన్యులైన తమకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు (CM Jagan) రుణపడి ఉంటామన్నారు. భక్తులకు సేవలందించడంలో ముందున్నామన్నారు.
ఏడాది కాలంలో కనకదుర్గమ్మ ఆలయం ఎంతో అభివృద్ధి చేశామన్నారు. దుర్గాఘాట్‌లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. రెండు ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. షిర్డీ తరహాలో భక్తులకు కుంకుమ ప్యాకెట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. రాత్రిపూట భోజనం దొరికేలా భక్తులకు అమ్మవారి ప్రసాదం అందిస్తున్నామన్నారు. సీఎం జగన్ ఇచ్చిన రూ.70 కోట్ల నిధులతో ప్రసాదం పోటును ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 18న శివాలయం ప్రారంభించాలని నిర్ణయించినట్లు చైర్మన్ కర్నాటి రాంబాబు పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - 2024-02-07T12:55:16+05:30 IST