Kesineni Nani: కేశినేని నాని సంచలన నిర్ణయం
ABN, Publish Date - Jun 10 , 2024 | 06:39 PM
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయవాడ స్థానం నుంచి సొంత తమ్ముడి కేశినేని చిన్ని చేతిలో ఓడిపోయిన మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. జాగ్రత్తగా ఆలోచించి, ఆలోచించిన తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాననని వెల్లడించారు.
అమరావతి: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయవాడ స్థానం నుంచి సొంత తమ్ముడి కేశినేని చిన్ని చేతిలో ఓడిపోయిన మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. జాగ్రత్తగా ఆలోచించి, ఆలోచించిన తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాననని వెల్లడించారు.
నా రాజకీయ ప్రయాణాన్ని ముగించాను...
‘‘ నా రాజకీయ ప్రయాణాన్ని ముగించాను. రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపూర్వమైన గౌరవం. విజయవాడ ప్రజల స్థైర్యం, దృఢసంకల్పం నాకు స్ఫూర్తినిచ్చాయి. వారి తిరుగులేని మద్దతుకు నా కృతజ్ఞతలు. నేను రాజకీయ రంగానికి దూరంగా ఉన్నా.. విజయవాడపై నా నిబద్ధత బలంగానే ఉంటుంది. విజయవాడ అభివృద్ధికి నేను చేయగలిగిన విధంగా మద్దతు ఇస్తూనే ఉంటాను. నా రాజకీయ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. విజయవాడ అభివృద్ధి, శ్రేయస్సు కోసం పాటుపడుతున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు’’ అంటూ కేశినేని నాని ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన సోమవారం స్పందించారు.
Updated Date - Jun 10 , 2024 | 06:50 PM