ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: కేశినేని నానిపై కేశినేని చిన్ని సంచలన ఆరోపణలు

ABN, Publish Date - Feb 17 , 2024 | 10:40 AM

Andhrapradesh: విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కేశినేని నాని ఊసరవెల్లి అంటూ వ్యాఖ్యలు చేశారు.

అమరావతి, ఫిబ్రవరి 17: విజయవాడ ఎంపీ కేశినేని నానిపై (MP Kesineni Nani) టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని (TDP Leader Kesineni Chinni) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కేశినేని నాని ఊసరవెల్లి అంటూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఉంటూ వైసీపీ కోసం కేశినేని నాని పని చేశారని ఆరోపించారు. ఢిల్లీలో లోకేష్ ఏయే లాయర్లను కలిశారు.. ఎవరెవరితో మాట్లాడుతున్నారనే విషయాన్ని వైసీపీ చేరవేశారన్నారు. చంద్రబాబు కోసం పూజలు చేసిన కేశినేని నాని.. ఇప్పుడు ఆయన్నే విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

విజయవాడ వెస్టులో టిక్కెట్లు ఇప్పిస్తానని కేశినేని నాని ఇద్దరి దగ్గర నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారన్నారు. తామిచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని నానిపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. కేశినేని నాని కాల్ రికార్డ్స్ ఉన్నాయని... కేశినేని నాని వసూలు రాజా అంటూ సెటైర్లు విసిరారు. ‘‘నన్ను పిట్టల దొర అంటున్న కేశినేని నాని విషయాన్ని త్వరలో ప్రజలే తేలుస్తారు’’ అని హెచ్చరించారు. జగన్ వద్ద.. వైసీపీ ఇంచార్జ్‌ల వద్ద కేశినేని నాని పాలేరు పని చేస్తున్నారన్నారు. కేశినేని నానిది సైకో మనస్తత్వమని మండిపడ్డారు. విజయవాడ ఎంపీ టిక్కెట్ కేశినేని నానికి ఇవ్వడం జగన్‌కు ఇష్టం లేదన్నారు. అవినాష్, వెలంపల్లి వంటి వారికి కేశినేని నాని అసిస్టెంట్ పని చేస్తున్నారని కేశినేని చిన్ని విమర్శలు గుప్పించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 17 , 2024 | 10:40 AM

Advertising
Advertising