Kirak RP About Roja Scams: టిక్కెట్ల పేరుతో టీటీడీకి రోజా కుచ్చుటోపీ'... కోట్లలోనే కుంభకోణం
ABN, Publish Date - Nov 19 , 2024 | 08:02 PM
టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు పూర్తి అర్హులని కిరాక్ ఆర్పీ ప్రశంసించారు. రోజా టూరిజం మంత్రిగా పనిచేసిన గత రెండున్నరేళ్లలో వేల టిక్కెట్లను దుర్వినియోగం చేశారని ఆయన కూడా చెప్పారని, విజిలెన్స్ శాఖకు కూడా ఆ విషయాన్ని అప్పగించారని తెలిపారు.
అమరావతి: నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్‌కె రోజా (RK Roja)పై కిరాక్ ఆర్పీ (Kirak RP) సంచలన ఆరోపణలు చేశారు. రోజా టూరిజం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరో భారీ కుంభకోణం (Scam) బయటపడిందని అన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఆమె రెండున్నర సంవత్సరాల కాలంలో తిరుమల నుంచి ఏపీ టూరిజంకు 4 వేల టిక్కెట్లు కేటాయించడం జరిగిందని, టిక్కె్ట్ రేటు రూ.300 అని బోర్డు పెట్టి, కౌంటర్ల దగ్గర వచ్చే భక్తులకు రూ.3,300కు అమ్మి రోజా ఆధ్వర్యంలోని టూరిజం శాఖ దోచుకుందన్నారు. టీటీడీ బోర్డుకు రూ.300 ఇచ్చి, తక్కిన 3,000 తమ గోనుసంచుల్లో రోజా నింపుకున్నారని ఆరోపించారు. ఆ ప్రకారం వేల కోట్లలో కుంభకోణం జరిగందన్నారు. నాలుగు వేల టిక్కెట్లు ఒక రోజుకు అమ్ముడయితే, టిక్కెట్లుకు రూ.3000 నొక్కేస్తే ఎన్ని వేల కోట్లు దోచుకున్నారో అర్ధం చేసుకోవచ్చన్నారు.
Pawan Kalyan: మహిళలు, యువతుల అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్..
టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు పూర్తి అర్హులని కిరాక్ ఆర్పీ ప్రశంసించారు. రోజా టూరిజం మంత్రిగా పనిచేసిన గత రెండున్నరేళ్లలో వేల టిక్కెట్లను దుర్వినియోగం చేశారని ఆయన కూడా చెప్పారని, విజిలెన్స్ శాఖకు కూడా ఆ విషయాన్ని అప్పగించారని తెలిపారు. దీనిపై కిరాక్ ఆర్పీ మరింత వివరణ ఇస్తూ, రోజా టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు రూ.300 టిక్కెట్లు రూ.3,300కు అమ్ముకుని, తూతూ మంత్రుంగా టీటీడీకి 300 ఇచ్చి, కమిషన్లు ఇచ్చే వాళ్లకు కమిషన్లు ఇచ్చి తక్కినందంతా రోజా నొక్కేసారని, ఆ ప్రకారం రోజుకి కోటి 20 లక్షల ఆదాయం, నెలకి 36 కోట్లు ఆదాయం బొక్కేసారని, అలా గడచిన రెండున్నరేళ్లలో సంపాదంచినది 1,080 కోట్లని ఆయన గణాంకాలు చెప్పారు. ఇటీవలే తాను తిరుమల దర్శించానని, లడ్డూ నాణ్యత నుంచి, సేవల వరకూ మెరుగుపడ్డాయని, టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంటున్నాయని, గోవింద నామం వినిపిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
AP Assembly: వైసీపీపై కూటమి ఎమ్మెల్యేలు పైర్.. ఆ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారంటూ ధ్వజం..
AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నీటిపారుదల రంగంపై మంత్రి నిమ్మల కామెంట్స్
Real Latest AP News And Telugu News
Updated Date - Nov 19 , 2024 | 08:02 PM