ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్‌గా కేకే చౌదరి
ABN, Publish Date - Nov 28 , 2024 | 05:04 AM
ఖాదీ బోర్డు ద్వారా గ్రామాల్లోని యువతలో చైతన్యం తీసుకువచ్చి ప్రతి ఇంటి నుంచి ఒక ఔత్సాహిక పారిశ్రామిక వేత్తను తయారు చేస్తానని ఆంధ్రప్రదేశ్ ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కస్తూరి కోటేశ్వరరావు చౌదరి (కేకే చౌదరి) తెలిపారు.
విజయవాడ వన్‌టౌన్, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ఖాదీ బోర్డు ద్వారా గ్రామాల్లోని యువతలో చైతన్యం తీసుకువచ్చి ప్రతి ఇంటి నుంచి ఒక ఔత్సాహిక పారిశ్రామిక వేత్తను తయారు చేస్తానని ఆంధ్రప్రదేశ్ ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కస్తూరి కోటేశ్వరరావు చౌదరి (కేకే చౌదరి) తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో బుధవారం ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లకుజీవితాంతం రుణపడి ఉంటానన్నారు. లోకేష్ పాదయాత్రలో ఆయన వెంటే నడిచానన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఖాదీబోర్డు ఉండేలా కృషి చేస్తానని చెప్పారు. మంత్రి సవిత మాట్లాడుతూ ఎన్‌ఎ్‌సఎంఈలు ఖాదీ గ్రామీణ బోర్డు ద్వారా యువకులతో యూనిట్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రులు కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్, రాంప్రసాద్‌రెడ్డి ప్రసంగించారు.
Updated Date - Nov 28 , 2024 | 05:04 AM