ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kollu Ravindra : మేం ప్రజలకు మంచి చేస్తున్నాం

ABN, Publish Date - Oct 20 , 2024 | 03:51 AM

ఉచిత ఇసుక విధానం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుందని గనులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

  • గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దందాతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు

  • మా హయాంలో అక్రమాలకు తావు లేదు

  • ట్రాక్టర్లతోనూ ఉచితంగా ఇసుక తీసుకెళ్లొచ్చు

  • మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టీకరణ

అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఉచిత ఇసుక విధానం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుందని గనులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం ఆయన ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని ఇసుక రేవులన్నింటినీ జగన్‌ తన గుప్పిట్లో పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దండుకొన్నారు. మేం ఇసుకపై సీనరేజి పన్ను, జీఎస్టీ తీసేశాం. ప్రజలు సొంత అవసరాలకు ఉచితంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తవ్వుకొని తీసుకెళ్లేందుకు కూడా అనుమతిచ్చాం’ అని పేర్కొన్నారు. పన్నుల రద్దు వల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ.264 కోట్ల నష్టం వస్తుందని, ప్రజలకు ఉచితంగా ఇసుక అందించేందుకు దాన్ని వదులుకున్నామన్నారు. ఉచిత ఇసుక విధానంపై అనుమానం ఉంటే జగన్మోహన్‌రెడ్డి స్వయంగా ఒక ట్రాక్టర్‌ తీసుకొని ఇసుక ఉచితంగా తవ్వుకొని తాడేపల్లి ప్యాలె్‌సకు తీసుకొని వెళ్లొచ్చని మంత్రి అన్నారు.

‘జగన్‌ ప్రభుత్వంలో ఇసుక ధర ఆకాశాన్ని తాకింది. పనులు నిలిచిపోయి భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నిర్మాణ రంగానికి మళ్లీ ఊపిరి పోయడానికి మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కల్తీ మద్యం సరఫరా చేసి ప్రజల ప్రాణాలు తీశారని, మద్యం తయారీ నుంచి అమ్మకాల వరకూ తమ గుప్పెట్లో పెట్టుకొని వేల కోట్లు దోచుకొన్నారని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సంస్కరిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన పరీక్షలను ఆరు నుంచి పదమూడుకు పెంచి నాణ్యమైన మద్యం అమ్మేందుకు కృషి చేస్తున్నామని మంత్రి చెప్పారు. రిటైర్డ్‌ జడ్జితో టెండర్‌ కమిటీ వేసి మద్యం ధరలను నిర్ణయించబోతున్నామని తెలిపారు. బడులు, దేవాలయాలకు వంద మీటర్ల లోపు మద్యం షాపులు ఉండకుండా చూస్తామన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 03:51 AM