ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Buddha Prasad: యువతకు తెలుగు భాషను వివరించండి..

ABN, Publish Date - Dec 28 , 2024 | 12:24 PM

Andhrapradesh: భుజాన తుపాకి పెట్టి తెలుగు భాషను చంపాలని చూస్తున్నారని మండలి బుద్ధ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు భాషను, తెలుగు రాష్ట్రం లేకుండా చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన అన్నట్లుగా తెలుగు భాష పరిస్థితి ఉందన్నారు. పాలకులు కూడా తెలుగు భాష వైభవం గురించి బాధ్యత తీసుకోవాలని కోరారు.

Mandali Buddha prasad

విజయవాడ, డిసెంబర్ 28: విజయవాడలో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల గౌరవ అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ..అమ్మ భాషను కాపాడుకుందామనేదే ఈ సభల ముఖ్య ఉద్దేశమన్నారు. హనుమంతుడికి బలం తెలియనట్లే... రచయితలు కూడా తమ బలం మరచిపోతున్నారన్నారు. పరభాషా మోజు నుంచి బయట పడేసే శక్తి రచయితలకు ఉందన్నారు. పొట్టి శ్రీరాములు వంటి త్యాగధనుల ఆత్మార్పణ గుర్తు చేసుకోవాలన్నారు. మన తెలుగు రాష్ట్రం కోసం ఆయన ప్రాణాలు వదిలారని.. తెలుగు భాష కోసం శక్తి వంచన లేకుండా రామోజీరావు కృషి చేశారని తెలిపారు. నేటి పత్రికలో అనేక ఆంగ్ల పదాల స్థానంలో తెలుగు పదాలు చేర్చారని.. ప్రపంచీకరణ కారణంగా మన మాతృభాష.. మృత భాషగా మారే ప్రమాదం ఏర్పడిందన్నారు. తెలుగు అక్షరాలు కూడా నేర్పని, నేర్చుకోలేని పరిస్థితి ఉందన్నారు. నేటి యువతకు మన భాష గొప్పదనం వివరించాలని.. రచయితలు, కవులు, ఇంట్లో పెద్దలు ఈ బాధ్యత తీసుకోవాలన్నారు. లేదంటే తెలుగు భాషకు అస్తిత్వం ఏర్పడుతుందన్నారు.


భుజాన తుపాకి పెట్టి తెలుగు భాషను చంపాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు భాషను, తెలుగు రాష్ట్రం లేకుండా చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన అన్నట్లుగా తెలుగు భాష పరిస్థితి ఉందన్నారు. పాలకులు కూడా తెలుగు భాష వైభవం గురించి బాధ్యత తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం తెలుగు భాషను ఏమాత్రం పట్టించుకోలేదని.. కూటమి ప్రభుత్వం తెలుగు భాషను పరిరక్షించాలని వినతి చేశారు. తెలుగు భాషా ప్రాధికార సంస్థకు సీఎం చంద్రబాబు నిధులు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం ఈ సంస్థ ను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. భాషా పండితులను నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వం మాతృభాషను మృత భాషగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడైనా తెలుగు భాష కోసం అందరూ నడుం కట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చాలా గొప్పగా పని చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం తెలుగు భాష కోసం ఏం చేస్తుందనేది ఆసక్తిగా చూస్తున్నారని తెలిపారు. సాహితీ, సాంస్కృతిక పరిస్థితి కూడా హృదయవిదారకంగా ఉందన్నారు. ఎన్నో తెలుగు సంప్రదాయ కళలు అంతరించి పోతున్నాయని.. వీటి పరి రక్షణకు కూటమి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. బడి భాషగా తెలుగు భాషలో బోధనలు సాగాలన్నారు. ఇంట్లో కూడా మనసారా తెలుగు భాషను మాట్లాడే పరిస్థితి రావాలన్నారు. ‘‘ఈ సభ ద్వారా మనమంతా మన మాతృ భాష కోసం కృషి చేయాలి’’ అని మండలి బుద్ధ ప్రసాద్ పేర్కొన్నారు.

AP News: మెగా వికసిత్ జాబ్ మేళా.. తరలివచ్చిన యువత



గుడ్‌మార్నింగ్‌ను వదలండి: చెరుకూరి శైలజ

దేశ భాషలందు తెలుగు లెస్స, ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అంటూ ఎందరో మహానుభావులు తెలుగు భావ వైభవాన్ని కీర్తించారని చెరుకూరి శైలజ అన్నారు. 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో ఆమె మాట్లాడుతూ.. రామోజీరావుకి తెలుగు భాషబాంటే ఎంతో ప్రేమ, అభిమానమని.. ఇంట్లో తామంతా శుభోదయం అని చెప్పుకోవాలని నేర్పించారన్నారు. రామోజీరావు జ్ఞాపకార్ధం అందరూ తమ ఇళ్ళల్లో గుడ్ మార్నింగ్ వదిలి.. ఉషోదయాన.. శుభోదయం అని పలకరించుకోవాలని అన్నారు. ‘‘మా ఇంట్లో ఒక్క ఇంగ్లీషు పదం రాకుండా మాట్లాడాలని మనవళ్లు, మనవరాళ్లతో రామోజీరావు పందాలు కాసేవారు. మన తెలుగు ప్రజలు ప్రపంచం మొత్తం విస్తరించి ఉన్నారు. మన భాష గొప్పతనం గురించి నలుదిశలా చాటి చెప్పాలి’’ అని కోరారు. సిఎం చంద్రబాబు చెప్పిన విధంగా జనాభా సంఖ్య పెరిగితే... మన భాష ప్రాముఖ్యత కూడా పెరుగుతుంని చెరుకూరి శైలజ పేర్కొన్నారు.


కాగా.. 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు సుప్రీం కోర్టు పూర్వపు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యన్.వి.రమణ, చెరుకూరి శైలజా కిరణ్, కాంగ్రెస్ నేత తులసి రెడ్డి, ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, సుజనా చౌదరి, సినీ గేయ రచయిత భువన చంద్ర అతిధిగా పాల్గొన్నారు. నేడు, రేపు మూడు వేదికలపై విభిన్న అంశాలపై సదస్సులు జరుగనున్నాయి. ఈ మహా సభలకు వివిధ ప్రాంతాల నుంచి రచయితలు, కవులు, తెలుగు భాషాభిమానులు తరలివచ్చారు.


ఇవి కూడా చదవండి...

ఈ పొలిటికల్ స్టార్‌కు బాగా కలిసొచ్చిన కాలం

బియ్యం మాయం కేసులో అనుమానాలెన్నో..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 28 , 2024 | 12:58 PM