ACB: ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి అరెస్ట్‌పై ఏసీబీ ఎఫ్‌ఐఆర్
ABN, Publish Date - Sep 27 , 2024 | 11:05 AM
Andhrapradesh: ఏసీబీ నమోదు చేసిన కేసులో ఏ-1 గా వెంకటరెడ్డి, ఏ2 గా జేపీ వెంచర్స్ ప్రతినిధి అనిల్ ఆత్మారామ్ కామత్, ఏ3 గా ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతినిధి పి.అనిల్ కుమార్, ఆర్.వెంకట కృష్ణారెడ్డి, జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రతినిధి, ఏ4గా ఏసీబీ కేసు నమోదు చేసింది.
అమరావతి, సెప్టెంబర్ 27: ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి (APMDC former MD Venkata Reddy) అరెస్ట్‌పై ఏసీబీ (ACB) ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ప్రభుత్వ ఖజానాకు 2 వేల 566 కోట్ల రూపాయల ఆదాయానికి నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఏసీబీ నమోదు చేసిన కేసులో ఏ-1 గా వెంకటరెడ్డి, ఏ2 గా జేపీ వెంచర్స్ ప్రతినిధి అనిల్ ఆత్మారామ్ కామత్, ఏ3 గా ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతినిధి పి.అనిల్ కుమార్, ఆర్.వెంకట కృష్ణారెడ్డి, జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రతినిధి, ఏ4గా ఏసీబీ కేసు నమోదు చేసింది. అలాగే జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (జేపీవీఎల్) ఏ5గా, ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, హైదరాబాద్ ఏ6గా చేర్చారుు. జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ7లతో పాటు ఇతరులను నిందితులుగా ఏసీబీ పేర్కొంది.
Bangalore: గుండెల్లో గుడి కట్టుకున్న అభిమానం..
కాగా.. ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం వెంకటరెడ్డి హైదరాబాద్ నుంచి విజయవాడ ఏసీబీ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు. వెంకటరెడ్డిని హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొస్తున్న సమయంలో కొన్ని కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ కార్యాలయంలో వెంకట రెడ్టి నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్నారు. మధ్యాహ్నం ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపర్చనున్నారు. ఇప్పటికే వెంకట రెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వెంకట రెడ్డి చర్యలు వలన ప్రభుత్వానికి 2 వేల 566 కోట్ల రూపాయలు మేర ఆదాయానికి గండి పండిందని అధికారులు పేర్కొన్నారు. వెంకట రెడ్డి లొంగి పోయారని కొంతమంది అధికారులు చెబుతున్నారు.
Hyderabad: ప్రభుత్వ వైద్యుడికి ఉస్మానియాలో కాలేయ మార్పిడి
ఇదీ విషయం...
కడప జిల్లాకు చెందిన వెంకటరెడ్డి కేంద్ర సర్వీసులకు చెందిన స్టాఫ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగి. రాష్ట్రంలో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక్కడ అడుగు పెట్టారు. పంచభూతాల్లో ఒకటైన ఇసుక, మైనింగ్ జగన్ అనుయాయులకు దోచిపెట్టారు. ఇసుక టెండర్లు పాడుకున్న జేపీ వెంచర్స్‌తో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 800కోట్లు ప్రత్యక్షంగా నష్టం చేకూర్చారు. బయటికి కనిపించకుండా వేలకోట్ల రూపాయల సంపద దోపిడీకి సహకరించిన వెంకట రెడ్డి, అందులో సింహ భాగం తాడేపల్లి ప్యాలెస్‌కు చేర్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పోయి ఎన్డీఏ సర్కారు ఏర్పడటంతో అక్రమాల నిగ్గు తేల్చే ప్రక్రియ ప్రారంభమైంది. చంద్రబాబు ప్రభుత్వం ప్రాథమిక నివేదిక తెప్పించుకుని ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించింది.ఆగస్టు 31న కేసు నమోదు చేసిన ఏసీబీ....కడప, తిరుపతి, విజయవాడతోపాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో గాలించింది. అయితే ప్రభుత్వం మారగానే విదేశాలకు పారిపోయినట్లు వార్తలు రావడంతో ఆదిశగా ఏసీబీ నిఘా పెట్టింది. ఇదే సమయంలో వెంకట రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా అప్రమత్తమైన ఏసీబీ... ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుపడింది. దిక్కుతోచని వెంకట రెడ్డి మధ్యవర్తుల ద్వారా ఏసీబీ అధికారులను సంప్రదించినట్లు సమాచారం. మర్యాదగా లొంగిపోయి విచారణకు సహకరిస్తే తాము కఠినంగా వ్యవహరించబోమని, అలా కాకుండా వ్యతిరేకంగా వ్యవహరిస్తే తమదైన శైలిలో చర్యలుంటాయని వారు హెచ్చరించారు. దీంతో వెంకటరెడ్డి ఎట్టకేలకు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి లొంగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి..
India vs Bangladesh: ఇండియా, బంగ్లాదేశ్ రెండో టెస్టులో.. టాస్ గెల్చిన టీమిండియా
Read Latest AP News And Telugu News
Updated Date - Sep 27 , 2024 | 12:11 PM