ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Contaminated Water: కలుషిత నీటి ఘటనలో అధికారులపై చర్యలు

ABN, Publish Date - May 29 , 2024 | 12:14 PM

విజయవాడ: నగరంలో కలుషిత నీరు సరఫరా ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటుపడింది. ఆరుగురు వీఎంసీ అధికారులను సస్పెండ్ చేయగా మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొగల్‌రాజపురంలో కలుషిత నీరు తాగి వ్యక్తి మృతి చెందగా.. తీవ్ర అస్వస్థతకు గురైన 24 మందికి చికిత్స కొనసాగుతోంది.

విజయవాడ: నగరంలో కలుషిత నీరు (Contaminated water) సరఫరా ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటుపడింది. ఆరుగురు వీఎంసీ (VMC) అధికారులను సస్పెండ్ (Suspend) చేయగా మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొగల్‌రాజపురంలో కలుషిత నీరు తాగి వ్యక్తి మృతి (Person Died)చెందగా.. తీవ్ర అస్వస్థతకు గురైన 24 మందికి చికిత్స కొనసాగుతోంది. ఇదిలా ఉండగా స్థానికంగా ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతోపాటు కలుషిత నీటిని పరీక్షించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పైప్‌లైన్లలో వచ్చిన నీటిని తాగవద్దని అధికారులు సూచించారు. కాగా వాటర్‌ ట్యాంకర్ల ద్వారా తాగునీరును అధికారులు సరఫరా చేస్తున్నారు.


కాగా వీఎంసీ సరఫరా చేసే మంచినీరు తాగేందుకు జనం బెంబేలెత్తుతున్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రంగు, వాసనతో మంచినీరు సరఫరా అవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. సోమవారం మొగల్రారాజపురంలో ఓ వ్యక్తి వాంతులు విరేచనాలతో చనిపోవడంతో నగరవాసులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. నగరంలో అన్ని ప్రాంతాల్లో మంచినీరు రంగు, వాసన రావడంతోపాటు పలువురు వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో డయేరియా అనే అనుమానాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. అధికారులు మాత్రం అటువంటిది ఏమీ లేదని వాదిస్తున్నారు.


విజయవాడలో 64 డివిజన్లలో సుమారు 1.40 లక్షల మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి. విద్యాధరపురం హెడ్‌ వాటర్‌ వర్క్స నుంచి తాగునీటిని పలు దఫాలుగా ఫిల్టర్‌ చేసి పైపులైన్లు ద్వారా నగరంలో 69 రిజర్వాయర్లుకు పంపుతారు. అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. హెడ్‌ వాటర్‌ వర్స్క్‌ నుంచి రోజుకి 44 ఎంజీడీ వాటర్‌ను ఫిల్టర్‌ చేసి ప్రజలకు అందిస్తున్నారు. వీఎంసీ పరిధిలోని మూడు సర్కిల్స్‌లో 600 మంది వాటర్‌ సప్లయ్‌ విభాగంలో పని చేస్తున్నారు. వీరు నిత్యం మూడు సర్కిల్స్‌లోని వివిధ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు వాటర్‌ శాంపిళ్లు తీసి పరీక్షలు చేస్తారు. కొంతమంది లీకేజీలు, పైపులైన్ల మరమ్మతులు తదితర పనులు చేస్తారు. నగరంలో మంచినీటి సరఫరా చేసే వాటర్‌ పైపులైన్లు పురాతన కాలం నాటివి. వీటికి తరచూ లీకేజీలు ఏర్పడుతుంటాయి. దీంతో తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొన్ని డివిజన్లలో మంచినీటి పైపులైన్లు డ్రైయిన్‌ క్రింద డ్రైయిన్‌లపైన, పక్కనే వెళుతున్నాయి. డ్రైయిన్‌ కింద పక్కనే ఉన్న కొన్ని ప్రాంతాల్లో పైపులైన్‌ పాడైతే వాటర్‌ పైపుల్లో మురుగునీరు చేరి తాగునీరు కలుషితం అవుతుంది. కొన్నిచోట్ల రిజర్వాయర్లు ఎక్కువ కాలం శుభ్రం చెయ్యకపోవడంతోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. రామలింగేశ్వ రనగర్‌లో నిర్మిస్తున్న తాగునీటి ట్యాంకు ఏళ్లు గడుస్తున్నా అందుబాటులోకి రావడం లేదు. ఫలితంగా ఈ ప్రాంతవాసులకు కలుషిత నీరే దిక్కవుతోంది. నీటి పన్ను వసూలు చేస్తున్న అధికారులు స్వచ్ఛమైన నీటిని అందించడం లేదని నగరవాసులు మండిపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యుత్ సబ్ స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు

అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు

బీఆర్ఎస్ హయాంలోనే మాయ చేసిన మిల్లర్లు

ఏపీలో పెన్షన్ల టెన్షన్..

జవహర్‌ రెడ్డి సర్వభ్రష్టత్వం!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 29 , 2024 | 12:19 PM

Advertising
Advertising