ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: సీఎం చంద్రబాబు ఏరియల్ విజిట్... నిశితంగా బుడమేరు ప్రాంతం పరిశీలన

ABN, Publish Date - Sep 06 , 2024 | 04:51 PM

Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ విజిట్ నిర్వహించారు. బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్‌లో ఏరియల్ విజిట్ ద్వారా సీఎం పరిశీలించారు. బుడమేరు ఏ ఏ ప్రాంతాల గుండా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో పరిశీలించారు. బుడమేరు ఎక్కడ ఎక్కడ ఆక్రమణలకు గురైందో అనే విషయాన్ని ముఖ్యమంత్రి ఏరియల్ సర్వేలో నిశితంగా పరిశీలించారు.

CM Chandrababu Naidu

అమరావతి, సెప్టెంబర్ 6: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఏరియల్ విజిట్ నిర్వహించారు. బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్‌లో ఏరియల్ విజిట్ ద్వారా సీఎం పరిశీలించారు. బుడమేరు ఏ ఏ ప్రాంతాల గుండా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో పరిశీలించారు. బుడమేరు ఎక్కడ ఎక్కడ ఆక్రమణలకు గురైందో అనే విషయాన్ని ముఖ్యమంత్రి ఏరియల్ సర్వేలో నిశితంగా పరిశీలించారు. బుడమేరుకు పడిన గండ్లు, గండ్లు పూడ్చే పనులను కూడా వీక్షించారు. కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల స్థితిని ఏరియల్ విజిట్‌లో చూశారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణానది ప్రవాహాలను.. కృష్ణా నది సముంద్రంలో కలిసే హంసల దీవి ప్రాంతాన్ని, కృష్ణానది లంక గ్రామాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు.

Traffic Diversion: రేపటి నుంచి ఈ రూట్‌లో వెళ్తున్నారా.. కొత్త చిక్కులు కొన్ని తెచ్చుకున్నట్లే


వేగంగా గండి పూడ్చివేత పనులు

మరోవైపు బుడమేరు గండి పూడ్చివేత పనులు వేగవంతంగా సాగుతున్నాయి. కుండపోత వర్షంలోనూ గండి పూడ్చివేత పనులను అధికారులు కొనసాగిస్తున్నారు. గండి పూడుస్తూనే మరోవైపు నీటిని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. మచిలీపట్నం నుంచి వచ్చిన బోట్లను బుడమేరు గండి పడిన ప్రాంతానికి అధికారులు తరలించారు. సరుకు బాదులు నిలబెట్టి నీటిని తాత్కాలికంగా రేకులు ద్వారా వరద నీటికి అడ్డుకట్ట వేయాలని అధికారులు భావిస్తున్నారు.

Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్‌కు ఆరో స్వర్ణం.. రికార్డు సృష్టించిన ప్రవీణ్ కుమార్


6వ మద్రాస్ మిలిటరీ బెటాలియన్ నుంచి 120 మంది అధికారులు, జవాన్లు గండి పడిన ప్రాంతానికి వచ్చారు. మరికొద్ది సేపట్లో మిలిటరీ ఆధ్వర్యంలో గండి పూడ్చే కార్యక్రమం ప్రారంభం కానుంది. తాత్కాలికంగా రాడ్డులతో వంతెనల్లాగా నిర్మాణం చేసి దాంట్లో రాళ్లు వేసి పూడుస్తామని మిలిటరీ అధికారులు చెబుతున్నారు. మరికొద్దిసేపట్లో బుడమేరు గండి పడిన ప్రాంతానికి మిలిటరీ అధికారుల సామాగ్రి చేరుకోనుంది. మరోవైపు గండి పడిన ప్రాంతానికి పెద్ద స్థాయిలో మిలిటరీ అధికారులు చేరుకున్నారు.


ఇవి కూడా చదవండి..

YS Jagan: వైఎస్ జగన్‌కు ఊహించని షాక్.. పాస్‌పోర్ట్ రద్దు

Viral Video: అయ్యో.. పాపం.. ఈ మందు బాబుకు ఎంతో కష్టం వచ్చింది.. చెప్పు కూడా అతడికి అందడం లేదే..

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 06 , 2024 | 04:53 PM

Advertising
Advertising