ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: మద్యం మత్తులో ఓ వ్యక్తి వింత ప్రవర్తన..కుక్కను ఆస్పత్రికి తీసుకొచ్చి..

ABN, Publish Date - Jun 19 , 2024 | 10:47 AM

ప్రస్తుత కాలంలో చాలా మంది మద్యం(alcohol) సేవిస్తారు. కొంతమంది తమ బాధలను మరచిపోవడానికి మద్యం సేవిస్తే..మరికొంత మంది మాత్రం వినోదం కోసం సేవిస్తారు. అయితే పలువురు మాత్రం అతిగా మద్యపానం సేవించడం వల్ల వారికి వారు నియంత్రణ కోల్పోతారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి అతిగా మద్యం సేవించి చేసిన వింత చేష్టల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

alcohol addict person strange behaviour

ప్రస్తుత కాలంలో చాలా మంది మద్యం(alcohol) సేవిస్తారు. కొంతమంది తమ బాధలను మరచిపోవడానికి మద్యం సేవిస్తే..మరికొంత మంది మాత్రం వినోదం కోసం సేవిస్తారు. అయితే పలువురు మాత్రం అతిగా మద్యపానం సేవించడం వల్ల వారికి వారు నియంత్రణ కోల్పోతారు. ఆ క్రమంలో వారు ఏం పనులు చేస్తున్నారో కూడా వారికి తెలియదనే చెప్పవచ్చు. ఈ ప్రవర్తనతో ఆయా వ్యక్తులు అతిగా మద్యం సేవించి వారి ఇంటికి వెళ్లి నానా రచ్చ సృష్టిస్తారు. దీంతో వారి కుటుంబ సభ్యులపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఇంకొంత మంది మాత్రం స్నేహితులతో కలిసి మద్యం సేవించి చివరకు వారితోనే విచిత్రంగా ప్రవర్తిస్తారు.


అచ్చం అలాంటి సంఘటనే తాజాగా ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం(Machilipatnam)లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి చిన్న కుక్క పిల్లను తీసుకుని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. ఆ క్రమంలో కుక్కను తీసుకుని వెళ్లి పిల్లికి వైద్యం చేయాలని అక్కడి ఆస్పత్రి సిబ్బందితో నానా రచ్చ చేశాడు. ఇక్కడ మనుషులకు మాత్రం వైద్యం చేస్తామని, దానిని తీసుకుని పశు వైద్య శాలకు వెళ్లాలని చెప్పినా వినలేదు. డాక్టర్ చదువుకున్నాడు కదా, వైద్యం చేసేందుకు ఏంటి సమస్య అని సిబ్బందితో వాదనకు దిగాడు. దీంతో ఆస్పత్రిలో కొద్ది సేపు గందరగోళ వాతావరణం ఏర్పడింది.


అది చూసిన పలువురు ఆశ్చర్యపోగా, మరికొంత మంది మాత్రం నవ్వుకుంటూ అతను మద్యం మత్తులో ఉన్నాడని పట్టించుకోలేదు. చివరకు ఎంత చెప్పినా కూడా ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు చెప్పక తప్పలేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు(police) ఆ మందుబాబుకు నచ్చజెప్పి ఆ ప్రాంతం నుంచి పంపించారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది హమ్మయ్యా అనుకున్నారు. అయితే ఆ వ్యక్తి ఆస్పత్రికి వచ్చిన సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో తెగ చక్కర్లు కోడుతుంది. కుక్క పిల్లను తీసుకుని వచ్చి వాగ్వాదానికి పాల్పడటం వీడియోలో కనిపిస్తుంది. ఈ క్రేజీ వీడియో ఎలా ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.


ఈ వార్తలు కూడా చదవండి..

Gorantla Butchaiah Chowdary: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల.. ఫోన్ చేసి చెప్పిన పయ్యావుల

Kane Williamson: కెప్టెన్సీ నుంచి వైదొలగిన కేన్ విలియమ్సన్.. కారణమిదే!


Read Latest AP News and Telugu News

Updated Date - Jun 19 , 2024 | 10:52 AM

Advertising
Advertising