Budget Meetings: అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులు
ABN, Publish Date - Nov 20 , 2024 | 08:23 AM
ఏపీ శాసనమండలి సమావేశాలు హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. అధికార.. విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, మాటల యుద్ధం జరుగుతోంది. వైఎస్సార్ సీసీకి మండలిలో మెజారిటీ సభ్యుల సంఖ్య ఉన్నప్పటికీ కూటమి మంత్రులు, ఎమ్మెల్సీలు ధీటుగా బదులిస్తున్నారు. దాంతో వైఎస్సార్ సీసీ ఎమ్మెల్సీలు సభలో ఉండలేక వాకౌట్ చేస్తున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly budget meetings) బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. (Question time continues). తర్వాత కొన్ని కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రశ్నోత్తరాలు... ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు, పశుసంవర్ధక శాఖలో ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్లు కోనుగోలు, ఓడరేవులు, ఫిషింగ్ హర్బర్లు, గోదావరి పుష్కరాలు, ఆదోని ఆటోనగర్ అభివృద్ది, ఎన్టీఆర్ సృజల స్రవంతి పధకం, విశాఖ డైరీ, రాష్ట్రంలో క్రీడా మైదానాలు, పేదలందరికి ఇళ్లు, రాష్ట్రంలో జనరిక్ మందులు తదితర అంశాలపై చర్చ జరగనుంది. తర్వాత మాజీ ఎమ్మెల్యే నారా రాంమూర్తి నాయుడి మృతిపై సంతాప తీర్మానం చేయనున్నారు. రూల్ 344 కింద కూటమి ప్రభుత్వం 150 రోజుల పాలనలో అభివృద్ధి,సంక్షేమ పధకాలపై శాసన సభలో చర్చ జరగనుంది.
సభలో ప్రవేశ పెట్టనున్న బిల్లులు...
ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టసవరణ -2024, ఏపీ ఎక్సైజ్ ఇండియన్ ఫారెన్ మేడ్ లిక్కర్, ఫారన్ మేడ్ లిక్కర్ చట్ట సవరణ బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లు, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టసవరణ తదితర బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తర్వాత విశాఖ రిషికోండపై నిబంధలనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై సభలో స్వల్ప కాలిక చర్చ జరగనుందది. కాగా నూతన మద్యం పాలసీపై సభలో మంత్రి కొల్లు రవీంద్ర స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు.
కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి మంగళవారం రాష్ట్ర అసెంబ్లీకి వచ్చారు. భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డితో కలిసి అసెంబ్లీ ప్రాంగణంలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లారు. చంద్రబాబు లేకపోవడంతో సీఎంవో అధికారులతో తన తండ్రి హత్య కేసు విచారణ పురోగతిపై చర్చించారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఆమె కోరినట్లు తెలిసింది. అలాగే ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయాలని కూడా అభ్యర్థించినట్లు సమాచారం. అంతకుముందు హోం మంత్రి అనితతో సునీత సమావేశమయ్యారు. సునీత, భర్త రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ అధికారి రాంసింగ్‌పై వేసిన ప్రైవేటు కేసులో కడప పోలీసులు ఇటీవల వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆ కేసు విచారణ వేగవంతమైంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన సునీతను చూసిన కొందరు ఎమ్మెల్యేలు.. ‘అన్న ఎమ్మెల్యేగా గెలిచి ప్యాలె్‌సలో కూర్చున్నాడు.. చెల్లెలు ప్రజాప్రతినిధి కాకపోయినా అసెంబ్లీకి వచ్చారు’ అని సరదాగా వ్యాఖ్యానించారు
ఈ వార్తలు కూడా చదవండి..
రష్యా-ఉక్రెయిన్ వార్‌లో కీలక పరిణామం
వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 20 , 2024 | 08:25 AM