AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ABN, Publish Date - Nov 11 , 2024 | 10:45 AM
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. సభలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ వార్షిక బడ్జెట్‌ను సభ ముందు ఉంచుతున్నానన్నారు. రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమైన తీర్పును ఇచ్చిన ప్రజల సంకల్పానికి ఈ బడ్జెట్ ప్రతిబింబమన్నారు.
అమరావతి, నవంబర్ 11: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Session)
సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఏపీ అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఏపీ వార్షిక బడ్జెట్‌ను సభముందు ఉంచుతున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమైన తీర్పును ఇచ్చిన ప్రజల సంకల్పానికి ఈ బడ్జెట్ ప్రతిబింబమన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి రాష్ట్రానికి గత ప్రభుత్వ చేసిన ద్రోహన్ని ఏడు శ్వేతపత్రాల ద్వారా తెలియజేశామన్నారు. కేంద్ర పథకాల నిధులు మళ్లింపు, పిల్లల పౌష్టికాహరాన్ని అందించే పథకాల నిధులు కూడా మళ్లించినట్లు చెప్పారు. ఇంధన రంగ నిధులు మళ్లింపు... ఇలాంటి పరిస్థితుల వల్ల ఆర్థిక గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయన్నారు. ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రాబాబు మాటలను బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ప్రస్తావించారు. 57శాతం ఓట్ల తో 175 సీట్లకు గానూ 93శాతం సీట్లు గెలిచామని.. గత దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన విప్లవ సమాధానం ఈ ఫలితమన్నారు. గత ప్రభుత్వం 1 లక్ష 37 వేల కోట్లు బకాయిలను పెట్టిందన్నారు. సహజ వనరులను దోచుకున్నారని ఆరోపించారు. ఇసుక, మద్యం విధానాలను తమకు అనుకూలంగా రూపొందించుకున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికలు రాష్ట్ర చరిత్రను మార్చివేశాయన్నారు. ప్రజలు అపురూపమైన తీర్పు ఇచ్చారని.. వ్యవసాయం, రైతుల అభ్యున్నతి తమకు ప్రాధాన్యమన్నారు. సూపర్ సిక్స్ పథకం ద్వారా రైతులకు మేలు చేస్తామని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
CM Chandrababu: ‘సూపర్ సిక్స్’కు ఊతం!
Rushikonda : రుషికొండ ఫైళ్లు మాయం!
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 11 , 2024 | 11:21 AM