ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu Naidu: అధికారులకు స్వీట్ వార్నింగ్.. తేడా వస్తే అంతే సంగతులు..

ABN, Publish Date - Aug 05 , 2024 | 02:40 PM

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారి కలెకర్ల సదస్సు నిర్వహించారు. రానున్న ఐదేళ్లు ప్రభుత్వ పాలన ఎలా ఉండాలి.. ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటో సీఎం అధికారులకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

CM Chandrababu Naidu

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారి కలెకర్ల సదస్సు నిర్వహించారు. రానున్న ఐదేళ్లు ప్రభుత్వ పాలన ఎలా ఉండాలి.. ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటో సీఎం అధికారులకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. గతాన్ని ఎక్కువుగా తవ్వకుండానే.. తప్పిదాలను మర్చిపోయి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎలా ముందుకెళ్లాల్లో స్పష్టం చేశారు. బాగా పనిచేసే అధికారులకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని, ఎవరైనా తప్పులు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి సీఎం జగన్ తొలి కలెక్టర్ల సదస్సును ప్రజావేదికలో నిర్వహించి.. సాయంత్రానికి ఆ భవనాన్ని కూల్చేయాలని ఆదేశించడం ద్వారా విధ్వంసంతో తన పరిపాలనను ప్రారంభించారని.. అలాంటి పొరపాట్లు ఈ ప్రభుత్వంలో జరగడానికి వీల్లేదని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. తప్పు చేయాలని తాను అధికారులకు చెప్పబోనని.. కాని ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొచ్చే సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. అద్భుతాలు సృష్టించగల ఎంతోమంది మంచి అధికారులు ఉన్నప్పటికీ.. వారి సేవలను ఉపయోగించుకోవడంలో గత ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. ఓ రకంగా చెప్పాలంటే ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు మొదటి సదస్సులోనే స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

CM Chandrababu: పవన్‌కు పెద్ద బాధ్యత అప్పగించిన సీఎం చంద్రబాబు


జగన్ పేరు ఎత్తకుండానే..

చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సదస్సులో మాజీ సీఎం జగన్ పేరు ఎత్తకుండానే.. ఆయన వ్యవహరశైలిని అధికారులకు అర్థమయ్యేలా చెప్పారు. ఎమ్మెల్యేలంతా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశించామని, అధికారులు సైతం ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అహంకారపూరిత ధోరణితో, డిక్టెటర్‌గా వ్యవహరిస్తే ఏమవుతుందో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు చూస్తే అర్థమవుతుందన్నారు. ప్రజలు మ్యాండేట్ ఇవ్వడంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని.. ఐదేళ్ల తర్వాత మళ్లీ ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతామని.. వారి ఓట్లు వేస్తే మరోసారి ప్రభుత్వంలోకి వస్తామని.. లేకపోతే అసెంబ్లీకి కూడా రాలేమన్నారు. గత ప్రభుత్వం డిక్టెటర్‌గా వ్యవహరించడంతోనే మాజీ మంత్రులంతా ఎన్నికల్లో ఓడిపోయారని కేవలం ఒకరు మాత్రమే గెలిచి అసెంబ్లీకి వచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. దీంతో అధికారులు ఎలా ఉండాలనేదానిపై సీఎం చంద్రబాబు ఓ సందేశాన్నిచ్చారు.

SupremeCourt: స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా


ఓనర్‌షిప్ తీసుకోవాలి.. క్రెడిట్ మాత్రం

ప్రజాప్రతినిధులతో అధికారులు ఎలా వ్యవహరించాలనేదానిపై చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో క్లారిటీ ఇచ్చారు. ప్రజల్లో ఉండేది నాయకులని.. ఐదేళ్లకోసారి ప్రజాతీర్పును కోరవల్సి ఉంటుందన్నారు. ఎవరైనా ప్రజాప్రతినిధులు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే తక్షణమే వాటిని పరిష్కరించి.. ఆ క్రెడిట్‌ను నాయకుడికి ఇవ్వాలని.. అధికారులు ఆ సమస్యను సొంత సమస్యగా భావించి.. త్వరితగతిన పరిష్కార మార్గం చూపించాలన్నారు. మొదటి సదస్సులో ప్రారంభ ఉపన్యాసంలోనే అధికారులు ఎలా ఉండాలో చంద్రబాబు పూసగుచ్చినట్లు వివరించారు.


Ramakrishna: భూ అక్రమాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది...

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Aug 05 , 2024 | 02:40 PM

Advertising
Advertising
<