CM Chandrababu: ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం
ABN, Publish Date - Nov 12 , 2024 | 02:59 PM
Andhrapradesh: ‘‘ఇప్పుడు ఎవరు ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నారో నేను కూడా నోట్ చేసుకుంటున్నా. కేంద్ర బడ్జెట్‌లో కూడా ఏ విధమైన నిధుల కేటాయింపులు ఉన్నాయో స్టడీ చేసుకుంటే ఎమ్మెల్యేలకు ఉపయోగపడుతుంది. పని చేయాలన్న ఆసక్తి మీలో ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. సభలో ప్రతిపక్షం లేదు కదా మనకేముంది అని అనుకోవద్దు’’
అమరావతి, నవంబర్ 12: ఏపీ అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు ముగిసింది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో సీఎం మాట్లాడుతూ.. రానురాను ఎమ్మెల్యేలకు సబ్జెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతోందని.. ఇది మంచిది కాదని... నిరంతరం నేర్చుకోవాలి... తెలుసుకోవాలని సూచించారు. ‘‘ఇప్పుడు ఎవరు ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నారో నేను కూడా నోట్ చేసుకుంటున్నా. కేంద్ర బడ్జెట్‌లో కూడా ఏ విధమైన నిధుల కేటాయింపులు ఉన్నాయో స్టడీ చేసుకుంటే ఎమ్మెల్యేలకు ఉపయోగపడుతుంది. పని చేయాలన్న ఆసక్తి మీలో ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. సభలో ప్రతిపక్షం లేదు కదా మనకేముంది అని అనుకోవద్దు. వాళ్లకు బాధ్యత లేదు... కానీ మనకు ఉంది. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం. ప్రజలకు ఏం అవసరమో... ప్రజలకు ఏం చేశామో చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక. అసెంబ్లీకి మేము పంపిన ప్రతినిధి మా కోసం ఏం మాట్లాడుతున్నారని ప్రజలు ఎప్పుడూ గమనిస్తారు’’ అని తెలిపారు.
Pakistan: వరల్డ్ క్రికెట్‌కు షాక్.. పాకిస్థాన్‌పై బ్యాన్.. చేజేతులా చేసుకున్నారు
అలాంటి చర్చలకు సభ వేదిక కావాలి
సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో స్వాగతించరని.. గతంలో అదే జరిగిందన్నారు. శాఖల్లో ఏం జరుగుతుందో ఎమ్మెల్యేలకు అవగాహన లేకపోతే నియోజకవర్గానికి ఏం అవసరమో తెలియదన్నారు. బడ్జెట్ సమావేశాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని చెప్పుకొచ్చారు. బడ్జెట్ సమావేశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలని.... వచ్చే మంచి ఆలోచనలు సభలో పంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై ప్రతి ఎమ్మెల్యే అధ్యయనం చేయాలన్నారు. పబ్లిక్ గవర్నెన్స్‌లో ఎమ్మెల్యేలనూ భాగస్వామలను చేస్తామన్నారు. ప్రజలు ఎన్నో ఆశలు, నమ్మకం పెట్టుకున్నందున సమస్యలపై సభలో చర్చించాలని తెలిపారు. అర్థవంతమైన చర్చలకు సభ వేదిక కావాలన్నారు.
Ayyanna: చెయ్యి ఎత్తితే అవకాశం.. అసెంబ్లీ రూల్స్‌పై స్పీకర్ క్లారిటీ
విజన్-2047పై అభిప్రాయం చెప్పండి..
వరుసగా విజయం సాధించడం అనేది మన పనితనం, పార్టీ నిర్మాణాన్ని బట్టి ఉంటుందన్నారు. టీడీపీ నుంచి 61 మంది, జనసేన నుంచి 15 మంది, బీజేపీ నుంచి నలుగురు, వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికయ్యారని తెలిపారు. ఒకప్పుడు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌లో వచ్చేవని.. కానీ ఇప్పుడు లైవ్, సోషల్ మీడియాలో కూడా ప్రసారం అయ్యే దాకా టెక్నాలజీ వచ్చిందన్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళకు సభలో పబ్లిక్ పాలసీలు రూపొందిస్తామని.. ఈ పాలసీలు ప్రజా జీవితంలో మార్పులు తెస్తాయన్నారు. గతంలో కొందరు ఎమ్మెల్యేలను విదేశాలకు పంపి ఆయా దేశాలు సాధించే ఫాస్ట్ గ్రోత్ రేట్ గురించి స్టడీ చేయించామని గుర్తుచేశారు. మనం తెచ్చే పాలసీలే రాష్ట్రంలోని సమస్యలకు శాశ్వత పరిష్కారాలను చూపిస్తాయన్నారు. గతంలో ఒక సబ్జెక్టుపై ఎంత సమయమైనా చర్చించేవాళ్లమన్నారు. విజన్-2047పై అందరి అభిప్రాయాలు తెలియజేయలని తెలిపారు. మంచి చర్చ, సమస్యల పరిష్కారానికి శాసనసభ, శాసన మండలి ఇకపై వేదికగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
BRS: పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది: కేటీఆర్
YSRCP: ఎన్‌హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన వైసీపీ ఎంపీల బృందం.. ఎందుకంటే
Read Latest AP News And Telangana News
Updated Date - Nov 12 , 2024 | 04:16 PM