ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్

ABN, Publish Date - Dec 19 , 2024 | 04:23 PM

Andhrapradesh: రాష్ట్ర మంత్రులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. మంత్రుల పనితీరును తాను ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. ఇంచార్జ్ మంత్రులు ఇంకా కొందరు జిల్లాలకు వెళ్లకపోవటంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP CM Chandrababu Naidu

అమరావతి, డిసెంబర్ 19: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఢిల్లీ పరిణామాలు, తాజా అంశాలపై చర్చ జరిగింది. పార్లమెంటులో జరిగిన పరిణామాలు ఫోన్‌‌లో మంత్రి లోకేష్‌కు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు. సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు కొనసాగించాలని నిర్ణయించారు. శాఖల్లో దస్త్రాలు పేరుకు పోతుండటం, మంత్రులు సక్రమంగా సాంకేతికత వినియగించకపోవటంపై సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) సీరియస్ అయ్యారు. మంత్రుల పనితీరును తాను ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నానని ముఖ్యమంత్రి తెలిపారు.

Rewind 2024: రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. ఓటర్ల విలక్షణమైన తీర్పు


మంత్రి వద్దకు ఏదైనా దస్త్రం వచ్చి ఎంత సేపు పెండింగ్‌లో ఉంటోందో ప్రతీదీ తనకు తెలుసని ఈ సందర్భంగా చెప్పారు. ఇంచార్జ్ మంత్రులు ఇంకా కొందరు జిల్లాలకు వెళ్లకపోవటంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు పాలసీలు లోతుగా చదువుకోవాలని హితవుపలికారు. కొంతమంది అసలు అధ్యయనం చేయడంలేదన్నారు. స్థానిక సంస్థల చైర్మన్‌ల పదవీకాలం నాలుగు ఏళ్ల నుంచి రెండున్నర సంవత్సరాలకు తగ్గించాలని వచ్చిన ప్రతిపాదనను కేబినెట్ తిరస్కరించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి 79 మున్సిపాలిటీలో సమయం అయిపోతుందని మంత్రి నారాయణ చెప్పారు.


రూ.31వేల కోట్లు సిద్ధం...


అలాగే రాజధాని నిర్మాణానికి మొత్తం 31 వేల కోట్లు రూపాయలు సిద్ధంగా ఉన్నాయని సీఎం చెప్పారు. ప్రపంచ బ్యాంక్ నుంచి 15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ. 16 వేల కోట్లు మంజూరు అయ్యాయని అధికారులు చెప్పారు. ప్రపంచ బ్యాంక్ ఈరోజు ఆమోదం తెలుపుతుందని భావిస్తున్నామని వారు అన్నారు. మూడు ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని సీఎంకు అధికారులు తెలియజేశారు. అసెంబ్లీ నిర్మాణంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. మంత్రులు కొంతమంది వెళ్లి కొన్ని అసెంబ్లీ భవనాలు లోపల ఎలా ఉన్నాయి అనేది చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాజధాని నిర్మాణ పనులు 30 రోజుల్లో ప్రారంభం అవుతాయని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Hyderabad: భర్త మోసం చేశాడని భార్యకు వేధింపులు

వాహనదారులకు షాక్.. హైకోర్టు సంచలన ఆదేశాలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 19 , 2024 | 04:49 PM