AP Assembly: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం
ABN , Publish Date - Nov 21 , 2024 | 01:48 PM
Andhrapradesh: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. హైకోర్టు బెంచ్‌పై చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాయలసీమకు ఉన్న అవకాశాలు చాలా ఎక్కువ అని.. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్ పోర్టులు రాయలసీమకు దగ్గర అని తెలిపారు. ఈ అవకాశాలను ఉపయోగించుకుంటే సీమ అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. తిరుపతి, కడప, ఓర్వకల్లు, పుట్టపర్తిలలో నాలుగు ఎయిర్ పోర్టులు రాయలసీమలోనే ఉన్నాయన్నారు.
అమరావతి, నవంబర్ 21: ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తెలిపారు. ఏపీ హైకోర్టు శాశ్వత బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ కేంద్రానికి తీర్మానం పంపడంపై శాసనసభలో (AP Assembly) చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నిన్ననే (బుధవారం) కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపామని.. లోకాయుక్త , స్టేట్ హ్యూమన్ రైట్స్ కమీషన్ లాంటివి అక్కడే ఉంటాయన్నారు. ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
పోలీసు ఉద్యోగంపై సీపీ ఆనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమరావతి కూడా చాలా సార్లు చెప్పామని.. మూడు రాజధానులు అని చెప్పి మూడు ముక్కలాట ఆడారని మండిపడ్డారు. మన రాజధాని అమరావతి అని విశాఖ, కర్నూలు వాసులు కూడా ఆమోదం తెలిపారన్నారు. రాయలసీమ రాళ్ల సీమగా మారిపోతుంది అని అనుకున్నప్పడు బచావత్ అవార్డు ప్రకారం రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్ళామన్నారు. తెలుగుగంగా, మంద్రీనీవా, నగరీ, గాలేరు ప్రాజెక్టులను టీడీపీ ప్రారంభించి పూర్తిచేసిందన్నారు.
రాయలసీమకు ఉన్న అవకాశాలు చాలా ఎక్కువ అని.. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్ పోర్టులు రాయలసీమకు దగ్గర అని తెలిపారు. ఈ అవకాశాలను ఉపయోగించుకుంటే సీమ అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. తిరుపతి, కడప, ఓర్వకల్లు, పుట్టపర్తిలలో నాలుగు ఎయిర్ పోర్టులు రాయలసీమలోనే ఉన్నాయన్నారు. రాయలసీమను ఎడ్యూకేషన్ హబ్‌గా చేయడానికి ఎంతో ముందుకు వెళ్లిందన్నారు. మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి హమీని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిచేస్తుందని తెలిపారు.
రాయలసీమలో నీటి సమస్యను ఎదుర్కోనేందుకు డ్రిప్ ఇరిగేషన్‌కు 90 శాతం సబ్సిడీ ఇచ్చామన్నారు. తిరుపతి హర్డ్ వేర్ హబ్‌గా తయారైతే కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రీయల్ పార్కులను కేంద్రం ఇస్తే.. రెండు రాయలసీమలో పెట్టామన్నారు. ఓర్వకల్లులో డ్రోన్ సిటీని పెట్టడంతో పాటు కర్నూలు నగరం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఈరోజు హైకోర్టు బెంచ్‌ను కర్నూలులో పెట్టడానికి నేడు సభలో తీర్మానం చేస్తున్నామని.. సభ్యులు ఈ తీర్మానాన్ని సమర్ధించాలని కోరుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. అనంతరం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై చేసిన తీర్మానాన్ని ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ఛీ.. ఛీ... వీళ్లు అసలు మనుషులేనా
ఇది ఆనందించదగ్గ పరిణామం: కాల్వ శ్రీనివాసులు
కాగా.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు తీర్మానాన్ని మంత్రి ఎండీఫరూక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వవిప్, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ..రాయలసీమలో హైకోర్టు బెంచ్ ప్రయత్నం ఎంతో ఆనందించదగ్గ పరిణామమన్నారు. వైసీపీ వచ్చాక మూడు రాజధానులు పేరుతో కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. రాయలసీమ వాసులను నిలువునా మోసం చేశారు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అంటూ విరుచుకుపడ్డారు. అప్పట్లో 22 మంది ఎంపీలు ఉన్నా హైకోర్టు తరలింపుకు ఎలాంటి చర్య చేయలేదన్నారు. న్యాయరాజధాని కర్నూలు అని జగన్ అంటారని.. అదే జగన్ ఏపీ జుడిషియల్ అకాడమీని మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నట్టు జీవో ఇచ్చారని తెలిపారు.
ఈ నిర్ణయం అత్యంత దుర్మార్గమన్నారు. హమీలకు, ప్రభుత్వ ఉత్తర్వులకు ఆనాడు పొంతన లేదని అన్నారు. కర్నూలులో హైకోర్టు పెట్టే ఆలోచన ఉందని.. అయితే ఆ ఆలోచన విరమించినట్టు 2022 నవంబర్ 25న సుప్రీంకోర్టుకు తెలిపిందన్నారు. తద్వరా జగన్ రాయలసీమ ద్రోహిగా మిగిలి పోయారని చెప్పారు. ప్రజాగళం యత్రలో ఇచ్చిన హమీ మేరకు నిర్ణయం తీసుకొని కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రాసెస్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. దేశంలో వేరు రాష్ట్రాల్లో 16 బెంచ్‌లు పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్ర జనాభా 5 కోట్లు అయితే రాయలసీమలో కోటి 50 లక్షలు మంది ఉన్నారని... విస్తీర్ణం 43శాతం ఉందన్నారు. రాయలసీమ బిడ్డగా సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమకు అందిస్తున్న వరంగా హైకోర్టు బెంచ్‌గా చెప్పుకోవాలని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Cyber Fraud ఈ-నేరగాళ్లకు ఝలక్ ఇచ్చిన ఉద్యోగి
షాకింగ్ రూ. 4 వేలు తగ్గిన వెండి.. ఇక బంగారం రేటు
Read latest AP News And Telugu News