Nimmala: ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష
ABN, Publish Date - Nov 05 , 2024 | 10:46 AM
Andhrapradesh: పోలవరం, వెలిగొండ, చింతలపూడి,గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టులపై ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ఏజెన్సీలతో విజయవాడ క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు. ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, మేఘా ఇంజనీరింగ్ ఏజెన్సీ ఈ సమావేశానికి హాజరయ్యారు. రేపటి (బుధవారం) నుంచి పోలవరం ఢయా ఫ్రం వాల్, ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి
అమరావతి, నవంబర్ 5: నవంబర్ నెల నుంచే ప్రాధన్యతా ప్రాజెక్టుల పనులు ప్రారంభంకావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆదేశించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాలను అమలు చేసేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు వరుస సమీక్షలు నిర్వహించారు. పోలవరం, వెలిగొండ, చింతలపూడి,గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టులపై ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ఏజెన్సీలతో విజయవాడ క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు.
ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, మేఘా ఇంజనీరింగ్ ఏజెన్సీ ఈ సమావేశానికి హాజరయ్యారు. రేపటి (బుధవారం) నుంచి పోలవరం ఢయా ఫ్రం వాల్, ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి సంబంధించి నిపుణులతో వర్క్ షాప్ నిర్వహణపై సమావేశంలో చర్చించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టులో గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను, దెబ్బతిన్న ఫీడర్ కెనాల్‌పై సమగ్ర రిపోర్టును తయారు చేసి సీఎం చంద్రబాబు నాయుడికి మంత్రి నిమ్మల రామానాయుడు అందివ్వనున్నారు.
ఇటీవల దోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌ను ముగ్గురు మంత్రులు నిమ్మల రామానాయుడు, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్ట్ విషయంలో గత ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు మంత్రులు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే జగన్ జాతికి అంకితం చేశారని మండిపడ్డారు. 2014-19లో గత టీడీపీ పాలనలో వెలిగొండ ప్రాజెక్టుకు రూ.1373 కోట్లు కేటాయించి.. రూ.1319 కోట్లు ఖర్చు చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత అయిదేళ్ళ జగన్ పాలనలో రూ.3518 కోట్ల బడ్జెట్ కేటాయించి, కేవలం రూ.170 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారన్నారు. జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపంగా మారిందని విమర్శించారు. రెండు దశల్లో వెలిగొండ ప్రాజెక్టును వెనువెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని తెలిపారు. ఫేజ్-1లో హెడ్ వర్క్స్, రెండు టన్నెల్స్ , ఫీడర్ ఛానెల్, రిజర్వాయర్, రెగ్యులేటర్ వంటి నిలిచినపోయిన పనులు పూర్తి చేసి వచ్చే సీజన్ నాటికి 1.19 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి వెల్లడించారు.
తాను అధికారంలోకి వస్తే ఏడాదిలోగా వెలిగొండ పూర్తి చేస్తానన్న జగన్ ఐదేళ్లపాటు ఏం చేశారని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ప్రశ్నించారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా, పరిహారం ఇవ్వకుండా ప్రారంభోత్సవం చేసి జిల్లా ప్రజల్ని జగన్ మోసం చేశారని మండిపడ్డారు. 2014 - 19 లోనే మెజార్టీ పనులు పూర్తి చేశామన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయన్నారు. వెలిగొండ ప్రారంభించింది చంద్రబాబు నాయుడే అని.. పూర్తి చేసేది కూడా చంద్రబాబు నాయుడే అని మంత్రి డోలా స్పష్టం చేశారు.
Hyderabad: పట్టాలపై పరేషాన్.. మెట్రో రాకపోకల్లో అంతరాయం
వెలిగొండ ప్రాజెక్టును జగన్ జాతికి అంకితం చేస్తే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశారని భావించామని.. కానీ ప్రాజెక్టు వద్ద దారుణమైన పరిస్థితులు ఉన్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టులు నాశనం అయ్యాయన్నారు. రాబోయే రోజుల్లో వెలిగొండ ప్రాజెక్టును చంద్రబాబు పూర్తి చేస్తారని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Nagula chavithi: విజయవాడలో ఘనంగా నాగుల చవితి వేడుకలు
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 05 , 2024 | 10:46 AM