AP News: న్యూఇయర్ వేడుకలకు దూరంగా ఏపీ మంత్రి.. కారణమిదే
ABN , Publish Date - Dec 31 , 2024 | 01:26 PM
Andhrapradesh: ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచే ఈ ఆనవాయితీ నిమ్మల పాటిస్తున్నారు. తొలిసారి మంత్రి అయ్యాక నూతన సంవత్సర సంబరాలు ఘనంగా చేయాలని ప్లాన్ చేసిన అభిమానులకు, కార్యకర్తలకు.. ఆనవాయితీ తప్పొద్దని మంత్రి చెప్పారు. కేకులు, బొకేలు, దండలు తీసుకురావద్దని.. ఆ ఖర్చును పేదవారికి సాయం చేయడంలోనే తనకు నిజమైన సంతృప్తి, ఆనందం ఉంటుందని వెల్లడించారు.
అమరావతి, డిసెంబర్ 31: కొత్త సంవత్సరంలోకి (New Year Celebrations) అడుగుపెట్టేందుకు అందరూ ఎదురుచూస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని కొత్తగా ఆహ్వానించేందుకు ఎన్నో ఏర్పాట్లు కూడా చేసుకున్నారు ప్రజలు. అలాగే కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయి. తమ అభిమాన నాయుకుడికి న్యూఇయర్ విషెస్ తెలిపేందుకు కార్యకర్తలు, అభిమానులు పార్టీ ఆఫీసులకు, నేతల నివాసాలకు వెళ్తుంటారు. తమ ప్రియతమ నేతలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి బొకేలు అందజేస్తుంటారు. అయితే ఏపీకి చెందిన ఓ మంత్రి మాత్రం నూతన సంవత్సరానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఎవరకూ కూడా రావొద్దని.. ఆ ఖర్చును పేదలకు సహాయం చేయడంలో ఉపయోగించాలని ఆదేశించారు. ఆయన ఎవరో కాదు మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu). ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నిమ్మల నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచే ఈ ఆనవాయితీ నిమ్మల పాటిస్తున్నారు. తొలిసారి మంత్రి అయ్యాక నూతన సంవత్సర సంబరాలు ఘనంగా చేయాలని ప్లాన్ చేసిన అభిమానులకు, కార్యకర్తలకు.. ఆనవాయితీ తప్పొద్దని మంత్రి చెప్పారు. కేకులు, బొకేలు, దండలు తీసుకురావద్దని.. ఆ ఖర్చును పేదవారికి సాయం చేయడంలోనే తనకు నిజమైన సంతృప్తి, ఆనందం ఉంటుందని వెల్లడించారు.
AP Govt: ఇకపై ఆ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం.. సర్కార్ కీలక నిర్ణయం
శుభాకాంక్షలు తెలుపడడానికి అమరావతి, పాలకొల్లు క్యాంప్ ఆఫీసులకు ఎవరూ రావొద్దన్న మంత్రి తెలిపారు. అలాగే అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్ర శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి. కొత్త సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలు, లక్ష్యాలకు అనుగుణంగా నదుల అనుసంధాన ప్రాజెక్టులను వేగవంతం చేస్తామన్నారు. ఐదేళ్ళ జగన్ రాక్షస పాలన నుంచి విముక్తి పొంది, సంక్షేమం,అభివృద్ది దిశగా రాష్ట్రం ముందుకెళ్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో జనవరి ఫూల్స్ అవుతారు..
బాస్ నన్ను అనకూడని మాటలు అంటున్నాడు: యువ ఉద్యోగి
Read Latest AP News And Telugu News