ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Sharmila: పంద్రాగస్టు రోజున ప్రధాని మోదీపై షర్మిల విసుర్లు

ABN, Publish Date - Aug 15 , 2024 | 10:05 AM

Andhrapradesh: దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం నాడు విజయవాడ ఏపీసీసీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని షర్మిల ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...

APCC Chief YS Sharmila

విజయవాడ, ఆగస్టు 15: దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila). స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం నాడు విజయవాడ ఏపీసీసీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని షర్మిల ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఎంతో మంది త్యాగాల ఫలితం మనకు సిద్ధించిన స్వాతంత్ర్యమన్నారు. మహనీయులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు తెలుపుతున్నామన్నారు. గత 10ఏళ్లుగా బీజేపీ (BJP) ఈ దేశంలో అధికారంలో ఉందన్నారు. ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది, ప్రగతికి పునాదులు వేసింది కాంగ్రెస్ (Congress) పార్టీ అని చెప్పుకొచ్చారు.

Chandrababu: ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారిగా జెండా ఎగురవేసిన చంద్రబాబు



బీజేపీ మతతత్వ పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అరాచకాలను 10 ఏళ్లుగా చూస్తున్నామన్నారు. హర్ ఘర్ తిరంగ అని మోడీ ఒక క్యాంపెయిన్ మొదలు పెట్టారన్నారు. దేశ భక్తి ఉన్నట్లు బీజేపీ సర్టిఫై చేస్తుందట అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ దేశానికి స్వాతంత్ర్యాన్ని, జాతీయ జెండాన్ని బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ అవమానించిందన్నారు. మూడు రంగుల జెండాను గౌరవించం అని చెప్పిందన్నారు. 2001 వరకు ఆర్ఎస్‌ఎస్ పార్టీ ఆఫీస్‌లో జాతీయ జెండాను ఎగరవేయలేదన్నారు. నిజానికి ఈ దేశానికి మోడీ చేసింది ఏమీ లేదన్నారు. హర్ గర్‌ను మోడీ మోసం చేశారని మండిపడ్డారు. ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు అని మోసం చేశారన్నారు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అని మోసం చేశారని.. ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకుంటాం అని మోసం చేశారని విమర్శలు గుప్పించారు. మణిపూర్‌లో ఊచ కోత కోశారన్నారు. ఆంధ్రలో కూడా ప్రతి ఘర్‌ను మోసం చేశారన్నారు.

జగన్‌ అక్రమాస్తుల కేసు.. విచారణ నుంచి తప్పుకొన్న న్యాయమూర్తి


ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ మోసం చేశారని.. విభజన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు. ఈరోజు దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారన్నారు. ఇవాల ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనుకుంటే కాంగ్రెస్ అధికారంలో రావాలన్నారు. మన రాజ్యాంగం కాపాడాలి అంటే కాంగ్రెస్ అధికారంలో రావాలన్నారు. ఈ దేశంలో ఐక్యత మళ్ళీ రావాలి అంటే...ప్రగతికి పునాదులు పడాలి అంటే కాంగ్రెస్ అధికారంలో రావాలని చెప్పుకొచ్చారు. రాహుల్, జగన్ కలుస్తారు అనే విషయం అవాస్తవమంటూ వైఎస్ షర్మిల కొట్టిపోరేశారు.


ఇవి కూడా చదవండి...

PM Modi: రాజస్థానీ లెహెరియా తలపాగా ధరించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

Treadmill: ట్రెడ్ మిల్ పై రన్నింగ్ చేసేటప్పుడు ఈ మోడ్ ఆన్ చేసి చూడండి.. ఎంత ఈజీగా బరువు తగ్గుతారంటే..!

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 15 , 2024 | 10:14 AM

Advertising
Advertising
<