ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vellampalli Srinivas: వెల్లంపల్లికి బెజవాడ సెంట్రల్ టికెట్.. వెళ్లేందుకు ఎమ్మెల్యే విముఖత.. కారణమేంటంటే...

ABN, Publish Date - Jan 03 , 2024 | 01:28 PM

Andhrapradesh: అధికార పార్టీ వైసీపీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతుంది. మొదటి, రెండవ లిస్టుల్లో పలువురు సిట్టింగ్లకు అధిష్టానం సీటు కేటాయించలేదు. దీంతో సీటు దక్కని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పలువురు ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే సీటు వచ్చిన వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాత్రం తనకు కేటాయించిన ప్రాంతానికి వెళ్లేందుకు విముఖుత వ్యక్తం చేస్తున్నాడు.

విజయవాడ, జనవరి 3: అధికార పార్టీ వైసీపీలో (YCP) టికెట్ల పంచాయతీ కొనసాగుతుంది. మొదటి, రెండవ లిస్టుల్లో పలువురు సిట్టింగ్లకు అధిష్టానం సీట్లు కేటాయించలేదు. దీంతో సీటు దక్కని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పలువురు ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే సీటు వచ్చిన వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ (MLA Vellampalli Srinivas) మాత్రం తనకు కేటాయించిన ప్రాంతానికి వెళ్లేందుకు విముఖుత వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకు వెల్లంపల్లికి అధిష్టానం ఏ సీటు కేటాయించింది?.. ఆయన ఎందుకు నిరాకరిస్తున్నారో చూద్దాం.


బెజవాడ సెంట్రల్ టికెట్‌ను వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు వైసీపీ అధిష్టానం కేటాయించింది. దీంతో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సీఎం జగన్ మొండిచేయి చూపించారు. వెస్ట్ నియోజకవర్గంలో వెల్లంపల్లిపై తీవ్ర అసంతృప్తి ఉన్న నేపథ్యంలో హైకమాండ్ ఆయనను సెంట్రల్ నియోజకవర్గానికి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే సెంట్రల్ నియోజకవర్గానికి వెళ్తే ఎక్కడ ఓడిపోతానేమో అని వెల్లంపల్లి ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.. తన నియోజకవర్గం మార్చవద్దని వైసీపీ పెద్దల ముందు ఎమ్మెల్యే మొరపెట్టుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఈరోజు (బుధవారం) సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిన వెల్లంపల్లి కలువనున్నారు.

మరోవైపు సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణుకు టికెట్ ఇవ్వకపోవడంపై శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వెల్లంపల్లి, మల్లాది విష్ణు బెజవాడ బ్రదర్స్‌గా పేరు పొందారు. అయితే సెంట్రల్‌ నియోజకవర్గ టికెట్‌ను మల్లాది కాకుండా వెల్లంపల్లికి అధిష్టానం కేటాయించింది. ఈ క్రమంలో తన స్నేహితుడు నియోజకవర్గానికి వెళ్లేందుకు వెల్లంపల్లి నిరాకరిస్తున్నట్లు సమాచారం. మరి వెల్లంపల్లి అభ్యర్థనను వైసీపీ అధిష్టానం అంగీరిస్తుందో?.. లేదో? చూడాలి.

మల్లాది విష్ణు అభిమానుల ఆందోళన..

కాగా... సెంట్రల్‌లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు జగన్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. పలు చోట్ల నిరసనలు, నినాదాలు చేపట్టారు. విష్ణు కే సీటు ఇవ్వకపోతే .. పార్టీని ఓడిస్తామన్న నాయకులు హెచ్చరిస్తున్నారు. ఒక కళ్యాణ మండపంలో వైసీపీ కార్పొరేటర్లు సమావేశమయ్యారు. వైసిపి అధిష్టానం నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విష్ణుకి సీటు ఇవ్వకుంటే రాజీనామాలకు సిద్ధం అంటూ ప్రకటించారు. సమావేశానికి రాని కార్పొరేటర్లపైనా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 03 , 2024 | 04:07 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising