ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Heavy Rains: వరద ఉధృతి.. వాగు దాటేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తి

ABN, Publish Date - Aug 31 , 2024 | 12:12 PM

Andhrapradesh: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చి చేరుతున్నాయి. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా. ఏ. కొండూరు మండలం లోని తండాలో ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ.మండలం మండలంలోని పలు చోట్ల ప్రధాన రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది.

Heavy Rains

అమరావతి, ఆగస్టు 31: ఏపీలో వర్షాలు (Heavy Rains) దంచికొడుతున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చి చేరుతున్నాయి. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా. ఏ. కొండూరు మండలం లోని తండాలో ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ.మండలం మండలంలోని పలు చోట్ల ప్రధాన రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. తిరువూరు రూరల్ మండలం లక్ష్మీపురం - విసన్నపేట ప్రధాన రహదారి అలుగుపై వరద నీరు ప్రవహిస్తోంది. తిరువూరు మండలం చౌటపల్లి - జి.కొత్తూరు విప్లవ వాగుకు వరద నీరు పోటెత్తింది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

Rain Alert: ఏపీలో భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండచరియలు.. పెను విషాదం


ఈదురుగాలులతో వర్షం కురవడంతో రహదారిపై భారీ వృక్షం కూలిపోయింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్రతరాయం ఏర్పడింది. తిరువూరు నియోజకవర్గంలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.

తిరువూరులో 8.90 సెం.మి

గంపలగూడెంలో 12.74 సెం.మి

విస్సన్నపేటలో 8.82 సెం.మి

ఏ.కొండూరు 12.74 సెంటి మీటర్లు-గా వర్షపాతం నమోదు అయ్యింది.


అలాగే ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే బైక్‌తో వాగు దాటేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి.. బైక్‌తో సహాకొట్టుకుపోయాడు. చివరకు చెట్టును పట్టుకుని వరద నీటిలో సదరు వ్యక్తి చిక్కుకున్నాడు. వెంటనే గ్రామాస్థులు ఆ వ్యక్తిని సురక్షితంగా వడ్డుకు చేర్చారు. అయితే వరద ప్రవాహానికి బైక్ కొట్టుకుపోయింది.

Rahul Dravid:అండర్-19 జట్టులోకి సమిత్


కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు...

అల్పపీడనం ప్రభావంతో కృష్ణాజిల్లా అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ డీకే బాలాజీ అప్రమత్తం చేశారు. వర్షాల వల్ల ప్రజలెవ్వరూ ఇబ్బందులకు గురి కాకుండా చూడాలన్నారు. అలాగే టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులకు కలెక్టర్ బాలాజీ పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ... భారీ వర్షాల నేపథ్యంలో అధికారులందరినీ అప్రమత్తం చేశామన్నారు. లోతట్టు ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. లంక గ్రామాల ప్రజల కోసం నెల రోజుల సరిపడా నిత్యావసర వస్తువులను సిద్ధం చేశామన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అత్యవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ బాలాజీ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

Kerala: ప్రొఫెషనల్‌గా ప్రొఫెసర్.. ఏమైందంటే..

Gudlavalleru College: హాస్టల్‌లో హిడెన్ కెమెరాల వెనుక కథ ఏంటి?

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 31 , 2024 | 12:15 PM

Advertising
Advertising