ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vishnukumar raju: అల్లు అర్జున్ వివాదం.. తెలంగాణ సీఎం వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా

ABN, Publish Date - Dec 23 , 2024 | 01:28 PM

Andhrapradesh: అల్లు అర్జున్ వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయితే చాలామంది ఆయనను పరామర్శించారని.. మరి చనిపోయిన మహిళ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. బెన్‌ఫిట్ షోలు వెయ్యాలనుకుంటే తప్పనిసరి పోలీస్ అనుమతి తీసుకోవాలన్నారు.

BJP MLA Vishnukumar raju

విశాఖపట్నం, డిసెంబర్ 23: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి కేసులో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయి ఆపై బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్ట్ వివాదంపై తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని తెలిపారు. ‘‘అల్లు అర్జున్ వివాదంపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిందే వాస్తవమైతే ఆయనతో నేను ఏకీభవిస్తున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం’’ అని స్పష్టం చేశారు. ఎంత పెద్ద సెలబ్రెటీ అయినప్పటికీ అందరికీ చట్టం ఒక్కటే అని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుందన్నారు.

BRS: భారతరత్న పీవీ తెలంగాణ ఠీవి..: కేటీఆర్


అల్లు అర్జున్ అరెస్ట్ అయితే చాలామంది ఆయనను పరామర్శించారని.. మరి చనిపోయిన మహిళ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. బెన్‌ఫిట్ షోలు వెయ్యాలనుకుంటే తప్పనిసరి పోలీస్ అనుమతి తీసుకోవాలన్నారు. బెన్‌ఫిట్ షోలను తప్పకుండా ఆపివేయాలన్నదే తన అభిప్రాయమన్నారు. బెన్‌ఫిట్ షోలకు ఎక్కువమంది వచ్చేస్తున్నారని.. తొక్కిసలాట జరుగకుండా ఉండాలంటే బెన్‌ఫిట్‌షోలు రద్దు చేయడమే మంచిదన్నారు. ప్రజల ఉద్దేశాలను ప్రజాప్రతినిధుల ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. అల్లు అర్జున్ వెళ్ళటం వల్లే ఇదంతా జరిగిందని స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సెలబ్రిటీలు ఏదైనా కార్యక్రమానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక వ్యక్తి చనిపోయారని చెప్పినప్పుడు.. హీరో అల్లు అర్జున్ బాధ్యతగా అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా ఉందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.

కడపలో టెన్షన్.. టెన్షన్..


బెనిఫిట్‌ షోలపై ఎమ్మెల్యే సత్యనారాయణ ఏమన్నారంటే..

బెనిఫిట్ షో విధానం అనేది.. ప్రజలకు సహాయార్థం మాత్రమే వేసేవారని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అన్నారు. గతంలో దీన్ని ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తీసుకొచ్చారని తెలిపారు. అయితే ఇప్పుడు బెనిఫిట్ షోలు లాభార్జన కోసం వేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. బెనిఫిట్ షో వేస్తే ఆ డబ్బులను , పేదలకు, ఆపదలో ఉన్న వారికో, వరద, తుఫాన్ బాధితులకు, కార్మికుల, మరొకరి కో సహాయం చేసేందుకు కోసం వినియోగించాలని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ డిమాండ్ చేశారు.


బన్నీ ఇంటిపై దాడి...

కాగా.. నిన్న (ఆదివారం) అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు దాడికి యత్నించారు. సంధ్య థియేటర్ వద్ద రేవతి మృతికి నిరసనగా ఓయూ జేఏసీ నేతలు.. అల్లు అర్జున్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. అల్లు అర్జున్ ఇంట్లోకి ప్రవేశించి టమాటాలు, కోడిగుడ్లు విసిరడంతో పాటు పూలకుండీలు ధ్వంసం చేశారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా.. న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అనంతరం వారు బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. మెజిస్ట్రేట్ వారికి బెయిల్ మంజూరు చేశారు.


ఇవి కూడా చదవండి..

గుడ్ న్యూస్.. జియో న్యూ ప్లాన్.. వివరాలు ఇవే..

ఈ రాశి వారు సన్నిహితుల నుంచే సమస్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 23 , 2024 | 01:33 PM