ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Budameru: తగ్గుముఖం పట్టిన బుడమేరు వరద.. సింగ్‌నగర్ సేఫ్..

ABN, Publish Date - Sep 07 , 2024 | 11:19 AM

Andhrapradesh: గత వారం రోజులుగా సింగ్‌నగర్‌ వాసులను అవస్థలకు గురిచేసిన బుడమేరు వరద కాస్త తగ్గుముఖం పట్టింది. భారీ వర్షాలతో బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరదలతో బెజవాడ వాసులు స్తంభించిపోయారు. భారీ వరదలతో వేలాది మంది తమ తమ నివాసాలను వదలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు.

Budameru Flood

విజయవాడ, సెప్టెంబర్ 7: గత వారం రోజులుగా సింగ్‌నగర్‌ వాసులను అవస్థలకు గురిచేసిన బుడమేరు (Budameru Flood) వరద కాస్త తగ్గుముఖం పట్టింది. భారీ వర్షాలతో బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరదలతో బెజవాడ వాసులు స్తంభించిపోయారు. భారీ వరదలతో వేలాది మంది తమ తమ నివాసాలను వదలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం సింగ్‌నగర్‌లో బుడమేరు వరద నీరు తగ్గుముఖం పట్టింది.

Ganesh Chaturthi: నేడు వినాయకుడికి ఈ 7 స్వీట్స్ నైవేద్యంగా పెడితే లైఫ్‌లో విజయం!


దీంతో నీరు వెళ్లిన ప్రాంతాల్లో ఇళ్లను ప్రజలు శుభ్రం చేసుకుంటున్నారు. అయితే వరద దెబ్బకు వృధా అయిపోయిన వస్తువులు చూసుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి కూడేసుకున్న సామాన్లు పనికిరాకుండా పోయాయంటూ కన్నీరుమున్నీరు అవుతున్న పరిస్థితి. వరద నీరు వెళ్లిపోయిన ప్రాంతాల్లో క్లీనింగ్ కార్యక్రమం ఊపందుకుంది. మరోవైపు నిత్యావసర వస్తువుల కిట్‌ను ఎండీయూ వాహనాల ద్వారా వదర బాధితులకు ప్రభుత్వం అందజేస్తోంది.

Banks Hiring: డిగ్రీ పూర్తైందా.. బ్యాంకుల్లో అప్రెంటిస్ నియామకాలు


యుద్ధ ప్రాతిపదికన గండ్ల పూడ్చివేత

మరోవైపు బుడమేరు గండ్లు పూడ్చి వేత పనులు యుద్ధప్రాతిపదిక సాగుతున్నాయి. బుడమేరు గండ్ల పూడ్చివేత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... బుడమేరు మూడో గండి 90 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు. మరికాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఫలించి బుడమేరు గండ్లు పూడిక పూర్తి అవుతుందన్నారు. మిగిలిన 10శాతం ఇంకో రెండు గంటల్లో పూర్తి చేసి సింగ్ నగర్ నుంచి విజయవాడ వెళ్ళే వరదను పూర్తిగా నివారిస్తామన్నారు. నేటితో బుడమేరు వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి కలిగిస్తామని చెప్పారు. విపత్తుతో వేలాది మంది పడుతున్న కష్టంతో పోల్చితే తమ కష్టం ఎంత అని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. కాగా.. క్షేత్రస్థాయిలో ఉండి పనులను నిమ్మల పర్యవేక్షిస్తుంటే.. మంత్రి లోకేష్ బుడమేరు మూడవ గండి పూడ్చివేత పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఫ్లడ్ లైట్ల వెలుగులో రాత్రివేళ కూడా పనులను కొనసాగించారు.


ఇవి కూడా చదవండి...

CM Chandrababu: చంద్రబాబు పిలుపునకు భారీ స్పందన.. వెల్లువెత్తుతున్న విరాళాలు

Nimmala Ramanaidu: కాసేపట్లో బుడమేరు వరద నుంచి బెజవాడ వాసులకు విముక్తి

Read Latest AP News And Telngana News

Updated Date - Sep 07 , 2024 | 11:26 AM

Advertising
Advertising