ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Buddha Venkanna: ఆయనతో ఆస్తి తగాదాల్లేవు.. ఉద్యమ తగాదా ఉంది..

ABN, Publish Date - Feb 26 , 2024 | 12:36 PM

విజయవాడ: తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న కేశినేని నానిపై ఫైర్ అయ్యారు. కోవర్టు నాని అని, ఆయనకు తనకు మధ్య ఆస్తి తగాదాల్లేవని, ఉద్యమ తగాదా ఉందని అన్నారు.

విజయవాడ: తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న (Budda Venkanna).. కేశినేని నాని (Kesineni Nani)పై ఫైర్ అయ్యారు. కోవర్టు నాని అని, ఆయనకు తనకు మధ్య ఆస్తి తగాదాల్లేవని, ఉద్యమ తగాదా ఉందని అన్నారు. సోమవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ (TDP) అభిమానులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. విజయవాడ ఇన్ ఛార్జిగా తాను ఉంటే కేశినేని నాని తనపై ఫిర్యాదు చేశారని, తనను తొలగించేందుకు అనేక కుట్రలు చేశారన్నారు. ఆనాడు సుజనా చౌదరి (Sujana Chaudhary) అది సరికాదంటూ ఆపారన్నారు.

కేశినేని నాని వైసీపీ నేత వెల్లంపల్లితో లాలూచీ పడి... కోవర్టు అయ్యారని, తనతో నాని ఆట మొదలెట్టారని... ఆయన ఆట నేను కట్టిస్తానని బుద్దా వెంకన్న అన్నారు. ఇప్పుడు కూడా పాత పరిచయాలతో తనకు అడ్టు పడుతున్నారని, తన జోలికి వస్తే తప్పకుండా తగిన రీతిలో బుద్ధి చెబుతానని హెచ్చరించారు. ఒక పార్టీలో ఉంటూ... మరో పార్టీకి ఊడిగం చేసిన కోవర్టు కేశినేని నాని అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు తనకు దైవమని.. ఆయన కోసమే పని చేస్తానని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.

Updated Date - Feb 26 , 2024 | 12:38 PM

Advertising
Advertising