Share News

CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ నేడు..

ABN , Publish Date - Oct 23 , 2024 | 07:17 AM

దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై ఈరోజు కేబినెట్‌లో చర్చించి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు. పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే దేవాలయాల్లో చైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

CM Chandrababu:  సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ నేడు..

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం (Cabinet Meeting) జరగనుంది. ఈ భేటీలో కీలకమైన వివిధ ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే దేవాలయాల్లో చైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


మరో సంక్షేమ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం.. దీపావళి కానుకగా దీపం పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నెల 31వ తేదీ నుంచి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర రూ.876. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్ కు రూ.25 సబ్సిడీ ఇస్తుండగా ప్రస్తుతం ప్రతి సిండర్ ధర రూ.851గా ఉంది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వల్ల ప్రభుత్వంపై రూ.2 వేల 684 కోట్ల అదనపు భారం పడుతుంది. అదే ఐదేళ్ళకు కలిపి రూ.13వేల 423 కోట్ల అదనపు భారం అవుతుంది.

అలాగే కేబినెట్‌లో ఉచిత ఇసుక పాలసీ అమలుపై చర్చ జరగనుంది. గత కేబినెట్‌లో ఇసుక విషయంలో సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేబినెట్ నాటికి పరిస్థితిలో మార్పు రావాలని.. ఎక్కడ ఇసుక దొరకడం లేదు... రేట్ ఎక్కువ అనే మాట వినపడకూడదని ఆదేశాలు ఇచ్చారు. ఇసుక పాలసీ లక్ష్యం నెరవేరి తీరాలని గత కేబినెట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా చెప్పారు.


కాగా రైతులకు మరింత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్‌లను అందించాలని తయారీదారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. ఒకే దఫాలో ఎరువులు, క్రిమిసంహారక మందులు పిచికారీతో పాటు పైరు ఎదుగుదలను పరీక్షించేలా డ్రోన్‌ల సాంకేతిక పరిజ్ఞానం పెంచాలన్నారు. దీనివల్ల రైతులకు ఖర్చు తగ్గుతుందని చెప్పారు. మంగళగిరిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ జరిగింది. ఈ సమ్మిట్‌ ప్రాంగణంలో 50 డ్రోన్‌ స్టాళ్లను ఏర్పాటు చేశారు. 500 కిలోల బరువును మెసుకెళ్లే శక్తివంతమైన డ్రోన్‌తో పాటు.. 250 గ్రాములను మోయగలిగే చిన్న డ్రోన్‌లను కూడా ప్రదర్శనకు ఉంచారు. వీటిలో ఎక్కువగా వ్యవసాయానికి ఉపయోగపడేవే ఉన్నాయి. ఈ స్టాళ్లను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో కలసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దాదాపు గంటన్నర పాటు పరిశీలించారు. ప్రతి స్టాల్‌ వద్దకు వెళ్లి అక్కడి ప్రతినిధులతో రెండేసి నిమిషాలుపైగా మాట్లాడారు. డ్రోన్‌ ఎలా పని చేస్తుందో ఆరా తీశారు. ఈ డ్రోన్లు రైతులకు ఎలా సేవలందిస్తాయో అడిగి తెలుసుకున్నారు. 500 కిలోలు మోసుకెళ్లగలిగే డ్రోన్‌ పనితీరును ప్రత్యేకంగా పరిశీలించారు. పౌర సేవలు, వ్యవసాయం,రహదారులపై విశ్లేషణ, ప్రజారోగ్యం, మునిసిపల్‌ కాలువల తీరు, పేరుకున్న చెత్త పరిశీలన, ప్రాజెక్టుల పని తీరు, రౌడీ షీటర్లు, రోడ్లపై తాగి వాహనాలు నడిపేవారు, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించేవారు ఇలా పలు సేవల్లో డ్రోన్‌లను వినియోగించే వీలుందని చంద్రబాబు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీని ఆపలేరు!

బొత్సకు జీ హుజూర్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 23 , 2024 | 07:17 AM