Narayana: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ.. ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Jun 16 , 2024 | 10:46 AM
అమరావతి: రాజధాని నిర్మాణంలో మొదటి దశను రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తామని, పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
అమరావతి: రాజధాని నిర్మాణంలో (Capital formation) మొదటి దశను రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తామని, పాత మాస్టర్ ప్లాన్ (Old Master Plan) ప్రకారం అమరావతి (Amaravati) నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ (Minister Narayana) స్పష్టం చేశారు. ఆదివారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో పట్టణ పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణను రాజధాని రైతులు, జేఏసీ నేతలు అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమరావతిపై న్యాయస్థానాల్లో వున్న చిక్కులను తొలగించి న్యాయం చేస్తామన్నారు. అధికారులతో చర్చించి పనులు స్టేటస్ తెలుసుకొని ప్రారంభిస్తామన్నారు.
అమరావతిలో 3,600 కిలోమీటర్ల రోడ్, తాగునీరు పూర్తి చేస్తామని, గతంలో అమరావతి కోసం రూ. 48 వేల కోట్లతో టెండర్‌లు పిలిచి రూ.10 వేల కోట్ల వరకు చెల్లింపులు చేశామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో జరిగిన దొంగతనాలపైన విచారణ చేపడతామని, ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఈ బాధ్యత ఇచ్చేటప్పుడు ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో అమరావతి కూడా వుండాలని చెప్పారన్నారు. గత అనుభవాల దృష్ట్యా అమరావతి నిర్మాణంకు రెండున్నర ఏళ్లు పడుతుందని భావిస్తున్నామన్నారు. రాజధాని కోసం అమరావతి రైతులు చిన్న లిటిగేషన్ కూడా లేకుండా రెండు నెలల్లోనే 33,000 ఎకరాలు భూమిని అమరావతి కోసం ఇచ్చారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారు..
కేసీఆర్ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు..
మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ మరో సంచలన పోస్ట్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 16 , 2024 | 10:59 AM