CEO: ఎన్నికల ప్రక్రియలో తుది అంకానికి..: ముఖేష్ కుమార్ మీనా
ABN, Publish Date - Jun 03 , 2024 | 01:54 PM
అమరావతి: ఎన్నికల ప్రక్రియలో తుది అంకానికి చేరుకున్నామని, మార్చి16వ తేదీన నోటిఫికేషన్ వస్తే.. మే 13వ తేదీన పోలింగ్ జరిగిందని, జూన్ 4వ తేదీ (మంగళవారం) కౌంటింగ్ జరుగుతుందని ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.
అమరావతి: ఎన్నికల ప్రక్రియలో (Election Process) తుది అంకానికి చేరుకున్నామని, మార్చి16వ (March 16) తేదీన నోటిఫికేషన్ (Notification) వస్తే.. మే 13 (May 13th) వ తేదీన పోలింగ్ (Polling) జరిగిందని, జూన్ 4వ (June 4th) తేదీ (మంగళవారం) కౌంటింగ్ (Counting) జరుగుతుందని ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా (CEO Mukesh Kumar Meena) పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో 81.8 శాతం పోలింగ్ నమోదు అయిందని, గత ఎన్నికల కన్న రెండు శాతం అదనంగా పోలింగ్ జరిగిందన్నారు.
26,700 సర్వీస్ ఓటర్లు ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్‌లు పంపారని, మంగళవారం ఉదయం 8 గంటలలోపు అందిన ప్రతి పోస్టల్ బాలట్‌ను లెక్కిస్తామని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, 8-30 గంటలకు ఈవీఎంల కౌంటింగ్ వుంటుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ లేని చోట 8 గంటలకే ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుందని, పోస్టల్ బ్యాలెట్ టేబుల్‌పై ఏఅర్‌వో, కౌంటింగ్ సూపర్ వైజర్‌లు వుంటారని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.
111 అసెంబ్లీ నియోజకవర్గాలలో 20 రౌండ్‌లు ఉంటాయని, 5 గంటల్లో ఫలితం వెలువడుతుందని సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 61 అసెంబ్లీ నియోజకవర్గాలలో 21 నుంచి 24 రౌండ్‌లు ఉంటాయని, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 అంతకన్నా ఎక్కువ రౌండ్‌లు ఉంటాయని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సుప్రీం కోర్టులో వైసీపీకి చుక్కెదురు..
న్యాయమైన కోరికలు తీరుస్తా: మంత్రి పొంగులేటి
బానిసత్వాన్ని తెలంగాణ భరించదు:సీఎం
మరో బాదుడు మొదలుపెట్టిన జగన్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 03 , 2024 | 01:56 PM