CM Chandrababu: అమరావతి రాజధాని నిర్మాణం 2.0 ప్రారంభం
ABN, Publish Date - Oct 19 , 2024 | 01:40 PM
Andhrapradesh: హైదారాబాద్ నుంచి వచ్చేప్పుడు ఒక వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టామని.. హైదారాబాద్‌లో 8 వరసల రోడ్డు రింగ్ రోడ్డు వేసి మెట్రోకు కనెక్ట్ చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. 5 వేల ఎకరాలు హైదారాబాద్ ఎయిర్టుకు ఇస్తామంటే అందరూ విమర్శించారని.. కాని ఇప్పుడు 5000 ఎకరాలు లాండ్ కూడా అభివృద్ధి అయిపోయిందన్నారు.
అమరావతి, అక్టోబర్ 19: అమరావతి రాజధాని నిర్మాణం 2.0 ప్రారంభమైంది. రాజధాని అమరావతి (Capital Amaravthi) నిర్మాణ పనుల పునః ప్రారంభానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) శ్రీకారం చుట్టారు. శనివారం రాయపూడిలో పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు సీఎం. 80 శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న అమరావతి నిర్మాణ ఏజెన్సీ సీఆర్డీయే కార్యాలయ పనులను చంద్రబాబు మొదలుపెట్టారు. రూ.160 కోట్లతో 7 అంతస్తుల్లో 2018 లో కార్యాలయ పనులను సీఆర్డీఏ చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన సీఆర్దీఎ అథారిటీ సమావేశంలో పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకున్న సర్కార్.. వెంటనే అమలు చేసింది.
KTR: మీరు చేయాల్సింది ఏమీ లేదు.. కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... ఒక చరిత్ర తిరగ రాయడానికి ఇక్కడ సమావేశం అయినట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చేప్పుడు ఒక వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టామని.. హైదరాబాద్‌లో 8 వరసల రింగ్ రోడ్డు వేసి మెట్రోకు కనెక్ట్ చేశామన్నారు. 5 వేల ఎకరాలు హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు ఇస్తామంటే అందరూ విమర్శించారని.. కానీ ఇప్పుడు 5000 ఎకరాల లాండ్ కూడా అభివృద్ధి అయిపోయిందన్నారు. హైదరాబాద్ జీఎస్‌డీపీలో 15 - 16 శాతం ఎయిర్‌పోర్టు నుంచి వచ్చిందన్నారు.
వీరోచితంగా మహిళల పోరాటం...
రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను అభినందించిన సీఎం... భూసేకరణలో మంత్రి నారాయణ చాకచక్యంగా వ్యవహరించారని కొనియాడారు. రాష్ట్ర భవిష్యత్తు బావుంటుందని రైతులు ఇంత పెద్ద ఎత్తున భూమి ఇచ్చారని తెలిపారు. దాదాపు 4300 ఎకరాలు భూ సేకరణ చేశామని... మీరు సమాజహితం కోసం భూమి ఇస్తే గత ప్రభుత్వం అమరావతి రైతాంగాన్ని చాలా బాధపెట్టిందని మండిపడ్డారు. మహిళా రైతులు వీరోచితంగా పోరాడారని.. రాణి రుద్రమ కన్నా వీరోచితంగా పోరాడారని కొనియాడారు. ‘‘ మీరు పడిన ఇబ్బందులు నేను చూశాను.. మీ ఉద్యమం కోసం జోలెపట్టి ఆర్థిక సాయం చేశాం. న్యాయస్థానం నుంచి దేవస్థానంకు వెళితే అడ్డుకున్నారు. మీరు రోడ్డుపై భోజనం చేశారు. దైవ నిర్ణయం... ఈ భూమి పవిత్రమైనది. ప్రపంచంలోని అన్ని క్షేత్రాల్లో పవిత్ర మట్టి, నీరు తెచ్చాం. ఈ బిల్డింగ్‌ను వెంటనే కాస్త మార్పులు చేర్పులతో 160 కోట్లతో ప్రారంభించాం. నాలుగు నెలల్లో పనులు ప్రారంభిస్తాం అన్నారు. 121 రోజున మరల వచ్చి ఈ భవనాన్ని ప్రారంభిస్తాం. రాష్ట్రానికి నడిబొడ్డున అమరావతి.. ఎటు చూసినా 12 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. విశాఖపట్నం, కర్నూలు వెళ్లి అమరావతి ఏకైక రాజధాని అని చెపుతున్న. విశాఖ ఆర్థిక రాజధానిగా, కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే లీజ్ పీరియడ్ అయిపోయింది.. అందుకు కొంత సమయం తీసుకున్నాం. రెండో ఇన్‌స్టాల్‌మెంట్ కోసం రైతులకు కౌలుగా రూ. 222 కోట్లు త్వరలో ఇవ్వనున్నట్లు తెలిపారు. వ్యవసాయ కూలీలకు రూ.5000 చొప్పున కూలీ ఇస్తున్నాం’’అని వెల్లడించారు.
YS Jagan: చేసిదంతా చేసి.. నీతులు చెబుతున్నారా..!
ఇది దేవతల రాజధాని
‘‘మన సంకల్పం చాలా గొప్పది... హైదరాబాద్ కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు . అక్కడ సంపద సృష్టించాను. ఔటర్ రింగ్ రోడ్డు ఆధారంగా అక్కడి ప్రభుత్వం వేల కోట్లు సాధిస్తోంది. లక్ష కోట్లు అవుతుందని మాట్లాడారు. అమరావతికి డబ్బులు పెట్టక్కర్లేదు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ ఉండే క్యాపిటల్. రాజధాని ప్రారంభించాం మరలా రాష్ట్రమంతా, అమరావతిలోనూ రేట్లు పెరిగాయి. ప్రభుత్వ డబ్బులు ఒక్క రూపాయి అవసరం లేదు. నిన్న బెంగళూర్‌లో ఆయన ఇల్లు మునిగింది.... అమరావతి కాదు. వేరే వాడు చెడిపోవాలి అనుకుంటే మనమే చెడిపోతాం. అమరావతి అనే పేరు సబబు అని రామోజీ రావు సూచించారు. నూటికి నూరు శాతం అమరావతిని ప్రజలు ఆమోదించారు. ఇది దేవతల రాజధాని. ఈ ప్రాంతంలో ఒక్క ఎండ తప్ప అన్ని అనుకూలతలే. బ్లూ, గ్రీన్ కాన్సెప్ట్‌తో నగర నిర్మాణం చేయాలనుకున్నాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
మూడేళ్లలో పనులు పూర్తి కావాల్సిందే...
‘‘రోడ్లు, ఫ్లాట్‌లు ఇక్కడ తవ్వేశారు, అమ్మేసుకున్నారు. కేంద్రం సెంట్రల్ విష్ట తరహాలో అమరావతి నగరం ఉంటుంది. చరిత్రలో 1631 రోజులు ఉద్యమం చేసింది అమరావతి పరిరక్షణ సమితి. విట్, ఎస్ ఆర్‌ఎం పనిచేస్తుంది, అమృతి పనిచేస్తుంది. బిట్స్ పిలాని కూడా ఇక్కడకు వస్తుంది. టాప్ ఇన్‌స్టిట్యూషన్ ఇక్కడకు రావాలి. భారతదేశం రాబోయే రోజుల్లో నిర్మించే నగరం అమరావతి మాత్రమే. భవిష్యత్తులో ఈ నగరంలో ఒక కోటి జనాభా ఉంటుంది. అశ్విని వైష్ణవను కలిసి బులేట్ ట్రెయిన్‌పై మాట్లాడాను. చెన్నై , బెంగళూర్, హైదారాబాద్, అమరావతిలు కలుపుతూ ఈ ట్రెయిన్ రావాలని కోరాను. పెండింగ్ పనులు అన్నీ పూర్తి చేస్తాం. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు అనుకున్న సమయానికి పూర్తి చేస్తాను. అన్ని పనులు ట్రాన్స్పరెంట్‌గా చేయండి. నగరంలో ఎలక్ట్రికల్ వెహికల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ కరెంట్ వస్తుంది. మీకు మాక్సిమం 3 సంవత్సరాలలో పనులు పూర్తి చేయాలని చెపుతున్న. 8603 కేఎంతో రాజధాని ప్రాంతం 217 కిలోమీటర్ల సీఆర్‌డీఏ పరిధిలో అన్నాము. రైతులు, ప్రభుత్వం అమరావతి విషయంలో లాభపడ్డారు. అమరావతి పనులు పట్టాలు ఎక్కి స్పీడ్ అవుతాయి. పోలవరం 72 శాతం పనులు చేస్తే దాన్ని అడ్డుకున్నారు. ఈ ఏడాది వరుణ దేవుడు కరుణించాడు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 పేరుతో ఇంకో విషన్ కూడా పెట్టుకున్న. నేను చెప్పేది 420లకు అర్థం కాదు. ప్రధాని నరేంద్ర మోడీ వికసిత భారత్ 2047 టేకప్ చేశారు’’ అని సీఎం వెల్లడించారు.
CM Chandrababu: అమరావతి రాజధాని నిర్మాణం 2.0 ప్రారంభం
ఒక్కసారే చెబుతా.. వినకపోతే
‘‘ఆడబిడ్డల 2.1 బిడ్డలకు జన్మనివ్వడం అవసరం. ఇప్పుడు మనం 1.6 లో ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో జనం పెరగాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు జనాభా నియంత్రణ చెప్పాను ఇప్పుడు నేనే వద్దంటున్న . ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారికి ప్రభుత్వ సాయం ఎక్కువ దక్కుతుంది. రాష్ట్రంలో స్వేచ్చగా అందరూ ఇప్పుడు నిద్రపోగలుగుతున్నారు. ఇప్పుడు కేంద్రం వద్ద మన పరపతి పెరిగింది డబ్బులు కూడా ఇస్తున్నారు. 93 శాతం గెలుపు ఈసారి సాధించాను. భూతం పోయింది ఫ్రీ గా ఉంటాము అనకూడదు. రాష్ట్రాన్ని నిర్మించాలి.. భూతాన్ని భూస్థాపితం చేయాలి. ఎమ్మెల్యేలకు చెప్పాను తప్పు చేస్తే ఒక సారి చెపుతా వినకపోతే మిమ్మల్ని వదులుకుంటా అని చెప్పాను’’ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Visakha: మాజీ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు..
ABN Effect: విశాఖ శారదా పీఠంకు కేటాయించిన స్థలంపై సర్కార్ కీలక నిర్ణయం
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 19 , 2024 | 05:07 PM