ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆగష్టు 15న అన్న క్యాంటిన్లు రీఓపెన్

ABN, Publish Date - Aug 12 , 2024 | 10:54 AM

అమరావతి: పేదలకు కడుపునిండా రుచిగా.. శుచిగా తక్కువ ధరకు భోజనం పెట్టి కడుపు నింపే అన్న క్యాంటిన్లు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 15వ తేదీన రాష్ట్రంలోని వివిధ ప్రాంతంలో మొత్తం వంద క్యాంటీన్లను ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ఇప్పటికే ఏర్పాట్లు చక చక జరిగిపోతున్నాయి. హరే రామ.. హరే కృష్ణ సంస్థ భోజనం అందించే ఏర్పాట్లను చేస్తోంది.

అమరావతి: పేదలకు కడుపునిండా రుచిగా.. శుచిగా తక్కువ ధరకు భోజనం పెట్టి కడుపు నింపే అన్న క్యాంటిన్లు (Anna Canteens ) మళ్లీ ప్రారంభం (Re Open) కాబోతున్నాయి. ఆగస్టు 15వ తేదీ (August 15th)న రాష్ట్రంలోని వివిధ ప్రాంతంలో మొత్తం వంద క్యాంటీన్లను ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం (Kutami Govt.,) నిర్ణయించింది. ఇందు కోసం ఇప్పటికే ఏర్పాట్లు చక చక జరిగిపోతున్నాయి. హరే రామ.. హరే కృష్ణ (Hare Rama.. Hare Krishna) సంస్థ భోజనం అందించే ఏర్పాట్లను చేస్తోంది. ఉదయం అల్ఫాహరం, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్. ఈ అన్న క్యాంటీన్ ద్వారా పిల్లలకు అందించనున్నారు.


రాష్ట్రంలో పేదలకు కడుపు నింపేందుకు అన్న క్యాంటీన్లను పున:ప్రారంభిస్తామని తెలుగుదేశం తన మ్యేనిఫే్టలో ప్రకటింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణించారు. మొదటి విడతలో మొత్తం వంద క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. 2017లో అన్నా క్యాంటీన్లను అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రారంభించి.. పేదలకు తక్కువ ధరకు భోజనం అందించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను పూర్తిగా మూసివేశారు. అన్న క్యాంటీన్ల భవనాలను గ్రామ, వార్డు సచివాలయాలుగా మార్చివేశారు. వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని గతలంలో చెప్పినప్పటికీ అది అమలు చేయలేదు.


కాగా పేద వారి కోసం రూ.5 లకే టిఫిన్‌, భోజనం అందించేందుకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌లను పునరుద్దరిస్తూ సీఎం చంద్రబాబు సంతకం చేశారు. దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ క్యాంటీన్లపై జగన్‌ ప్రభుత్వం కన్నెర్ర చేసి మూసివేయడంతో అవి నిరుపయోగంగా మారాయి. కొద్దిరోజులకు వాటిలో చాలా వాటిని సచివాలయాలుగా మార్చారు. కొన్నిచోట్ల నిరుపయోగంగా ఉన్నాయి. జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో అన్న క్యాంటీన్‌లను ఏర్పాటు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిలో సచివాలయాలు, పోలీస్‌స్టేషన్‌లను ఏర్పాటు చేసింది. కొన్నిచోట్ల తెలుగుదేశం నాయకులే ఉచిత భోజనాలు ఏర్పాటు చేశారు. పాలకొల్లులో అన్న క్యాంటిన్‌ వద్దనే ప్రతీ రోజు భోజనాలను అందించారు. తాడేపల్లిగూడెం, తణుకులోను దాతల సహకారంతో అన్న క్యాంటిన్‌లు నిర్వహిస్తూ వచ్చారు.


రోజువారీ కూలీలు, పేద కార్మికులే కాకుండా పట్టణాలకు వివిధ పనులపై వచ్చిన వారికి ఈ అన్న క్యాంటీన్లు ఆకలి తీర్చేవి. తాడేపల్లిగూడెంలో రద్దీ ఎక్కువ ఉన్న ప్రదేశాలైన తాలూకా సెంటర్‌ వద్ద, మున్సిపల్‌ కార్యాలయం వద్ద, బైపాస్‌ రహదారి వద్ద అన్న క్యాంటీన్లు నిర్వహించేవారు. పట్టణంలో అన్న క్యాంటీన్ల భవనాలు నేడు వార్డు సచివాలయాలకు నిలయాలుగా మారిపోయాయి. తాలూకా సెంటర్‌ వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ భవనం లో 33 వ వార్డు సచివాలయం, మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉన్న అన్నా క్యాంటిన్‌ 8 వార్డు సచివాలయం, బైపాస్‌ రోడ్డు వద్ద ఉన్న అన్నా క్యాంటిన్‌ 14, 17 వార్డుల సచివాలయాలుగా మారి పోయాయి. ఐదేళ్ల వైసీపీ పాలనలో మరుగునపడ్డ అన్న క్యాంటీన్‌ పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అదికారంలోకి రావడంతో అన్న క్యాంటీన్‌ను క్లీన్‌ చేశారు. చెత్త మెక్కలను తొలగించారు. క్యాంటీన్‌ ప్రారంభించేందుకు వీలుగా రెడీ చేస్తున్నారు. నరసాపురంలో అన్న క్యాంటీన్‌ వైసీపీ నిర్వహాకం వల్ల నేడు పోలీస్‌స్టేషన్‌గా మారింది. రాష్ట్ర విభజన తరువాత ఎన్నో హంగులతో పట్టణంలోని స్టీమర్‌రోడ్‌లో రూ.20 లక్షలతో దీన్ని నిర్మించారు. అన్న క్యాంటీన్‌ డిజైన్‌ను మొత్తం ధ్వంసం చేసి రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంగా మార్చేశారు. మూడేళ్ళ నుంచి ఈ భవనం పోలీస్‌ శాఖ అదీనంలో ఉంటుంది. భీమవరంలోని మూడు క్యాంటీన్లు సచివాలయాలుగా మారిపోయాయి. టూటౌన్‌ అడ్డవంతెన వద్ద, పాత బస్‌ స్టాండ్‌ వద్ద, బుధవారం మార్కెట్‌ లోని మునిసిపల్‌ కాంప్లెక్స్‌ వెనుక భాగంలో అప్పట్లో క్యాంటీన్‌లు ఏర్పాటు చేశాారు. అడ్డవంతెన దగ్గర ఉన్న అన్న క్యాంటీన్‌ను 35వ వార్డు సచివాలయంగా, పాత బస్‌స్టాండ్‌ వద్ద ఉన్న క్యాంటీన్‌లోకి 34వ వార్డు సచివాలయాన్ని, బుధవారం మార్కెట్‌ వద్ద ఉన్న క్యాంటీన్‌లోకి 8వ వార్డు సచివాలయాన్ని మార్చేశారు.


ఈ నెల 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాష్ట్రంలో వంద అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తెలిపారు. అన్న క్యాంటీన్‌ భవన నిర్మాణాల పనులు, మురుగు కాలువల్లో పూడికతీతతోపాటు పలు ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అన్న క్యాంటీన్ల భవన నిర్మాణ పనులు ఎంత మేరకు వచ్చాయి... కిచెన్‌ ఏర్పాటుకు సంబంధించిన వివరాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని 33 మున్సిపాలిటీల్లో ఈ క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. మరో 83 క్యాంటీన్లు ఈనెలాఖరులోగా పూర్తి చేసేలా ముందుకెళ్లాలని మంత్రి ఆదేశించారు. మరో 20 క్యాంటీన్లు సెప్టెంబరు నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా అన్ని మున్సిపాలిటీ డ్రెయిన్‌లలో పూడిక తీయాలని కమిషనర్లను మంత్రి ఆదేశించారు. ఈ నెల 20వ తేదీలోగా పనులు పూర్తి చేయాలన్నారు. టిడ్కో ఇళ్లకు మౌలిక వసతుల కల్పనపై మున్సిపల్‌ కమిషనర్లు దృష్టి సారించాలని మంత్రి నారాయణ సూచించారు. సీఆర్‌డీఏ పరిధిలోని టిడ్కో ఇళ్లకు మౌలిక వసతుల కల్పన బాధ్యతను సీఆర్‌డీఏకు అప్పగించినట్లు మంత్రి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటే ఇదేనేమో..

సైబర్ నేరగాళ్లపై పోలీసుల ఫోకస్

ఇప్పటికీ జగన్‌కు జై కొడుతున్న కొందరు పోలీస్ బాస్‌లు..

బాకింగ్‌హం కెనాల్‌కు కలుషిత నీరు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 12 , 2024 | 10:54 AM

Advertising
Advertising
<