AP Budget 2024: బడ్జెట్‌కు ముందు పయ్యావులకు సీఎం ఏం చెప్పారో తెలుసా
ABN, Publish Date - Nov 11 , 2024 | 01:10 PM
Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు గాను మంత్రి పయ్యావుల కేశవ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. 2024 - 25 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను మంత్రి సభలో ప్రవేశపెట్టారు. రూ.2.94 లక్షల కోట్లతో రూపొందించిన బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు మంత్రి పయ్యావుల.
అమరావతి, నవంబర్ 11: రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) ఈరోజు(సోమవారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2.94 లక్షల కోట్లతో రూపొందించిన బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు మంత్రి. వివిధ వర్గాల సంక్షేమం కోసం రూ. 73,720 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించింది. అలాగే గత ప్రభుత్వ పాలనపైనా మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే బడ్జెట్‌కు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబును మంత్రి కలిశారు.
AP Budget 2024-25: భారీగా ఏపీ వ్యవసాయ బడ్జెట్.. పూర్తి కేటాయింపులివే..
ఈ సందర్భంగా అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నందుకు గాను ఆర్థిక మంత్రికి సీఎం చంద్రబాబు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. బడ్జెట్ ప్రసంగం తరువాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా కేశవ్‌కు కంగ్రాట్స్ తెలియజేశారు. అలాగే తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన పయ్యావులకు పలువురు అభినందనలు తెలియజేశారు. అసెంబ్లీ లాబీల్లో మంత్రికి పలువురు ఐఏఎస్, ఇతర అధికారులు, పలువురు ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. బడ్జెట్ ప్రసంగం అర్థవంతంగా, సంక్షిప్తంగా ఉందని కేశవ్‌కు లాబీల్లో పలువురు ఎమ్మెల్యేలు చెప్పారు. సూపర్ సిక్స్ పథకం గురించి బాగా చెప్పారని మరికొంతమంది ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. ఆర్థిక మంత్రిగా చంద్రబాబు తొలి ప్రసంగాన్ని ప్రస్తావించి నాటి సంగతులను గుర్తు చేశారని పలువురు సీనియర్ మంత్రులు తెలిపారు. అయితే రెవిన్యూ శాఖ మంత్రిగానే చంద్రబాబు తమకు గుర్తున్నారని.. ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పని చేశారనే విషయాన్ని గుర్తు చేశారని పయ్యావులతో పలువురు జూనియర్ మంత్రులు అన్నారు.
కాగా.. రెండు ఓటాన్ అకౌంట్ల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు జరిగాయి. అలాగే సంక్షేమానికి భారీ కేటాయింపులు చేసింది సర్కార్. వివిధ వర్గాల సంక్షేమం కోసం రూ.73,720 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించింది. బీసీ సంక్షేమానికి రూ. 39 వేల కోట్లు కేటాయించింది. అలాగే విద్యా, వైద్యం, పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ధి, ఇరిగేషన్ రంగాలకు హై ప్రయార్టీ ఇచ్చారు. కునారిల్లిన పోలీస్ విభాగానికి నిధులను కేటాయించారు. పోలీస్ విభాగాన్ని ఆర్థికంగా పటిష్టం చేస్తూ రూ. 8495 కోట్ల కేటాయిస్టులన్నట్లు మంత్రి తెలిపారు. రోడ్ల మరమ్మత్తులపై బడ్జెట్‌లో ప్రత్యేక ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం ఆర్ అండ్ బికి రూ. 9554 కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది.
Payyavula: అంతా వైసీపీనే చేసింది.. అసెంబ్లీలో ఓ రేంజ్‌లో ఫైర్ అయిన పయ్యావుల
వార్షిక బడ్జెట్‌తో పాటు వ్యవసాయ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టింది ప్రభుత్వం. రూ. 43,402 కోట్లతో ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయరంగం వెన్నెముక అని.. ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. రైతులకు ఆధునిక పనిముట్లు, రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తామని చెప్పారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధే.. లక్ష్యంగా వ్యవసాయ బడ్జెట్ రూపొందించామని మంత్రి తెలిపారు. వ్యవసాయం ఆధారంగా 62% మంది జీవిస్తున్నారని.. 2047 టార్గెట్‌తో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Rushikonda : రుషికొండ ఫైళ్లు మాయం!
AP Assembly Session: ఏపీ వార్షిక బడ్జెట్ ఎంతో తెలుసా
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 11 , 2024 | 02:37 PM