Chandrababu: సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వం: చంద్రబాబు
ABN, Publish Date - Dec 11 , 2024 | 12:24 PM
ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరిందని, మంత్రి లోకేష్ కృషితో గూగుల్ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని చంద్రబాబు అన్నారు.
అమరావతి: ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని, సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమని, ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) వ్యాఖ్యానించారు. బుధవారం కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు వస్తాయని అన్నారు. విశాఖ (Visakha)లో గూగుల్ (Google) ఏర్పాటుకు ఎంవోయూ (MOU) కుదిరిందని, మంత్రి లోకేష్ (Minister Lokesh) కృషితో గూగుల్ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని చంద్రబాబు అన్నారు. గూగుల్ ఎంవోయూతో విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
హార్డ్ వర్క్ ముఖ్యం కాదు..
హార్డ్ వర్క్ ముఖ్యం కాదని.. స్మార్ట్ వర్క్ కావాలని.. ఓటే దేశాన్ని కాపాడుతుందని, ప్రజాస్వామ్యం లేకపోతే నియంతృత్వం వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. విధ్వంసక పాలన తర్వాత ఏపీలో పునర్నిర్మాణం జరుగుతోందని, ప్రభుత్వ విజన్ , డైరెక్షన్ కలెక్టర్‌లకు తెలియజేయడం ఈసమావేశం ముఖ్య ఉద్దేశమని అన్నారు. నాశనం జరిగాక దాన్నితిరిగి నిర్మించినప్పడు, హర్డ్ వర్కు అవసరం అవుతుందన్నారు. క్రైసిస్‌లోనే అవకాశాలు ఉంటాయని.. దాన్ని తాను నమ్ముతానని.. ఎన్నికల కంటే ముందు తమకు ఓ అనుభవం ఉందని సీఎం అన్నారు. అయిదేళ్ళ తరువాత ఇండియాలో తప్పు చేసిన వారిని ఇంటికి పంపుతుందని, ఓటే ఈ దేశాన్ని కాపాడుతోందని, ప్రజాస్వామ్యంలో కరెప్షన్ జరగనప్పుడు నియంతలు పుడతారన్నారు.
వైజాగ్‌లో గూగుల్ ఏర్పాటు..
ఐటి మంత్రి లోకేష్ అమెరికా వెళ్లి గూగుల్ వారిని సంప్రదించడతో వారు వైజాగ్ రావడానికి ఒప్పుకున్నారని, ఇప్పడు వారితో ఒప్పందం చేసుకున్నామని చంద్రబాబు తెలిపారు. గూగుల్ తో చేసుకున్న ఒప్పందం విశాఖలో ఎంతో అభివృద్దికి కారణం అవుతుందన్నారు. విశాఖ మంచి సిటీ అని గుర్తించామని గూగుల్ వాళ్లు చెపుతున్నారన్నారు. విశాఖకు గూగుల్ వాళ్లు వస్తున్నారంటే అది ఓ గేమ్ చేంజర్ అవుతుందన్నారు. విశాఖలో డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సీ కేబుల్ కనెక్టివిటీ వస్తే విశాఖ ఓ డీప్ టెక్ డెస్టినేషన్ అవుతుందన్నారు. ప్రజలు హర్డ్ వార్కు కాకుండా స్మార్ట్ వర్కు చేయాలని కొరుతున్నానని, ఆర్టీజీఎస్‌తో గూగుల్ ఓ ఒప్పందం చేశారని, ఆ ఒప్పందం ఎంతో మేలు చేస్తుందన్నారు. విశాఖ పట్నం ఏజెన్సీ ఏరియాలో గంజాయి ఎక్కడ ఉందనేది గ్రహించామని, గూగుల్ శాటిలైట్ ద్వారా గుర్తించి డ్రోన్లు పంపి నాశనం చేయగలుగుతామని, గూగుల్‌తో ఒప్పందం రాష్ట్రంలోని యువతకు గుడ్ న్యూస్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఒకటిన జీలాలు, పెన్షన్లు..
గతంలో ఒకటో తారీఖున జీతాలు రాలేదని... ఇప్పడు ఒకటో తారీఖునే జీతాలు, పెన్షన్‌లు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గతంలో అనేక తప్పులు జరిగాయని, తనకు కోపం, కసి ఉందని.. అయితే తొందరపడకుండా ముందుకు వెళ్ళాలని అన్నారు. రాష్ట్రం బ్రాండ్ అయిదేళ్ళలో దెబ్బతిన్నదని.. నమ్మకం పోయిందని, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకువచ్చామని.. ఎవరయితే ల్యాండ్‌ను గ్రాబ్ చేసారో వారే దాన్ని ప్రూ చేసుకోవాలని చంద్రబాబు అన్నారు.
ఇంకా వైఎస్సార్‌సీపీ వాసనలు పనిచేస్తున్నాయి..
ఇంకా వైఎస్సార్‌సీపీ వాసనలు పనిచేస్తున్నాయని, కేంద్రం ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసారని.. వాటికి యూసి ఇచ్చి డబ్బులు తెస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏపీ రాజధాని అమరావతిని సెట్ చేశామని, కేంద్రం రూ. 15 వేల కోట్లు ఇచ్చిందని, బయటనుండి రూ. 16 వేల కోట్లు తెస్తున్నామని తెలిపారు. అమరావతికి రూ.31 వేల కోట్లు మొబలైజ్ చేశామని, ఫైనల్‌గా తోలిదశకు రూ.50 వేల కట్లు కావాలన్నారు. పెన్షన్‌ను 3 నెలలు పాటు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నామని, దేశంలోనే ఎక్కు వ పెన్షన్‌లు ఇచ్చే రాష్ట్రం ఏపీ మాత్రమేనని అన్నారు. రూ. 33 వేల కోట్ల పించన్లు ఇస్తున్నామని, దీపం 2 కింద 40 లక్షల మందికి సొమ్ములు చెల్లించామని సీఎం చంద్రబాబు తెలిపారు.
రేషన్ బియ్యం మాఫియాకు అడ్డుకట్ట
అయిదేళ్లలో నాశనం అయిన రోడ్లు అన్ని పాత్ హోల్ ప్రీగా చేస్తున్నామని, రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియాకు అడ్డుకట్టపడాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా దాని వెనుక గంజాయి, డ్రగ్స్ బ్యాచ్‌లు ఉన్నట్టు వెలుగులోకి వస్తోందన్నారు. గంజాయి, డ్రగ్స్ మాఫియా కట్టడికి అంతా కలిసి పనిచేయాల్సిందేనని, జిల్లాల్లో ఈ మాఫియాను కూకటి వేళ్లను పెకిలించేయాలని కలెక్టర్లను ఆదేశిస్తున్నానని అన్నారు. గతంలో భూముల్ని మాత్రమే కబ్జా చేసేవాళ్లు, ఇప్పుడు పోర్టులు, సెజ్‌లను కూడా కబ్జా చేసేస్తున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమాలను అడ్డుకునేందుకే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అందుకే తీసుకువచ్చామన్నారు. 2047 విజన్ సాధన కోసమే రాష్ట్రంలో 20కి పైగా పాలసీలను తీసుకువచ్చామని, రాష్ట్రస్థాయితో పాటు జిల్లా, నియోజకవర్గ స్థాయిలోనూ ఈ విజన్ ప్లాన్ అమలు కావాలిన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అమరావతిని 31 వేల కోట్ల రూపాయల మేర నిధులతో నిర్మాణం చేపట్టబోతున్నామని, 2027కు పోలవరం పూర్తి చేసేందుకు గడువు నిర్దేశించుకుని ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం లోపు 16 వేల పైచిలుకు టీచర్ పోస్టుల భర్తీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్సప్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పేదలకు చెక్కులను అందజేసిన మంత్రి నిమ్మల
జగన్ పాపాలపై ఫిర్యాదుల వెల్లువ
శిక్షణ తరగతులను బహిష్కరించిన బీఆర్ఎస్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 11 , 2024 | 12:53 PM