CM Chandrababu: రేపు హర్యానా వెళ్ళనున్న సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Oct 16 , 2024 | 01:44 PM
హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ గురువారం ప్రమాణం చేయనున్నారు. ఆయన ఆహ్వానం మేరకు ఈ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హజరుకానున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి.. 11 గంటలకు చంఢీఘర్ చేరుకుంటారు.
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) గురువారం హర్యానా (Haryana) పర్యటనకు వెళ్ళనున్నారు. నయాబ్ సింగ్ సైనీ (Nayab Singh Saini) హర్యానా ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణం చేయనున్నారు. ఆయన ఆహ్వానం మేరకు ఈ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హజరుకానున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి.. 11 గంటలకు చంఢీఘర్ చేరుకుంటారు. 12 గంటల నుంచి 2 గంటల మధ్య పంచకుల, సెక్టార్ 5లోని దసరా గ్రౌండ్‌కు సిఎం చంద్రబాబు వెళతారు. అక్కడ నయాబ్ సింగ్ సెనీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకూ నిర్వహించే మీటింగ్‌లో పాల్గొంటారు. తర్వాత రాత్రి 10 గంటలకు అక్కడి నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరి విజయవాడకు వస్తారు.
కాగా హర్యానా కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేతలు, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. గత మార్చిలో మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన బీజేపీ సీనియర్ నేత నయబ్ సింగ్ సైనీ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో (Haryana Assembly Elections) వరుసగా మూడోసారి విజయాన్ని సాధించిన బీజేపీ (BJP) కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మొత్తం 90 సీట్లలో 48 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమైంది. ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు ఇండిపెండెంట్లు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీకి మద్దతు ప్రకటించారు.
హర్యానాలో బీజేపీ విజయంపై చంద్రబాబు స్పందన
హర్యానా ఫలితాలపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. హర్యానాలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుబి మోగించిందని, ఏకంగా 50కి పైగా సీట్లను దక్కించుకుని రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుందని అన్నారు. ‘‘హర్యానాలో విజయం ఎన్డీఏకు శుభసూచకం... సుపరిపాలన వల్ల వచ్చే లాభాలను ప్రజలు చూశారు. మంచి చేసే ప్రభుత్వాలను ప్రజలు మళ్లీ ఆదరిస్తారు. మోదీ పాలనపై ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. భారత దేశాన్ని ప్రపంచంలోనే అగ్రదేశంగా చేసేందుకు ప్రధాని మోదీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ లోనూ ఎన్ఢీఏకు మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మామ జగన్ మోహన్ రెడ్డికి అఖిల ప్రియ సవాల్
స్కిల్ కేసులో సీఎం చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్
భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
జాయ్ జమీమా దారుణాలపై నోరు విప్పిన బాధితులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 16 , 2024 | 01:44 PM