Cyclone: బంగాళాఖాతంలో బలపడుతున్న రెమాల్ తుఫాను
ABN , Publish Date - May 24 , 2024 | 10:49 AM
హైదరాబాద్: నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. శుక్రవారం నాటికి వాయుగుండంగా.. ఆ తర్వాత ఈశాన్యంగా పయనించి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారనుంది. దీనికి రెమాల్‌గా పేరు పెట్టారు.
హైదరాబాద్: నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. శుక్రవారం నాటికి వాయుగుండంగా.. ఆ తర్వాత ఈశాన్యంగా పయనించి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా (Cyclone) మారనుంది. దీనికి రెమాల్ (Remal)గా పేరు పెట్టారు. మరింత బలపడి తీవ్ర తుపానుగా మారి ఆదివారం సాయంత్రం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషాలో భారీ వర్షాలు కురుస్తాయని తీరం దాటేటప్పుడు వంద కి.మీ.పైగా గాలులు వీస్తాయని తెలియజేసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు ముప్పు లేనట్టేనని వాతావరణ నిపుణులు తెలియజేశారు. ఇదే సమయంలో తీరానికి దూరంగా తుపాను పయనించనున్నందున ఆ దిశగా భూ ఉపరితలం మీద నుంచి వేడి గాలులువీయనున్నాయి. ఇప్పటికే వాయువ్య భారతం నుంచి తీవ్ర వడగాల్పుల మధ్య ఒడిషా ఆంధ్రప్రదేశ్ మీదుగా అల్పపీడనం దిశగా వీస్తున్నాయి. రానున్న 2, 3 రోజుల్లో వాడగాల్పుల తీవ్రత మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కాగా ఆదివారం వరకు బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్లో బంగాళాఖాతంలో ఏర్పడ్డ మొదటి తుఫాను.. కారణంగా ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్షసూచన ఉందని నిపుణులు తెలిపారు. బెంగాల్, ఉత్తర ఒడిషా, మిజోరాం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశముందన్నారు. తుఫాను నేపథ్యంలో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ అధికారులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి ఫోకస్..!
పోలీసులకు నోటీసులు పంపిస్తా..: శ్రీకాంత్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News